Author: ఇందూర్ వార్త

*రిజర్వేషన్ కల్పించకపోతే అసెంబ్లీ ముట్టడిస్తాం* -ప్రభుత్వానికి కాయితి లంబాడీల హెచ్చరిక కాయితి లంబాడీలకు ఎస్టీ రిజర్వేషన్ కల్పించకపోతే అసెంబ్లీ ముట్టడిస్తామని ప్రభుత్వాన్ని కాయితి లంబాడీలు హెచ్చరించారు. కాయితి లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చడంతో పాటు రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా సదశివనగర్ మండలం పద్మాజీవాడి చౌరస్టాలో సుమారు వెయ్యి మంది కాయితి లంబాడీలు 44 వ జాతీయ రహదారిని దిగ్బంధించారు. సుమారు అరగంటకు పైగా రహదారిని దిగ్బంధించారు. దాంతో ఇరువైపులా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జిఓ 2,4,5 అమలు చేయాలని, పొడు పట్టాలు ఇవ్వాలని నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఆందోళన చేస్తున్న వారిని విరమించేలా పోలీసులు శతవిధాల ప్రయత్నించినా వినిపించుకోకుండా ఆందోళన కొనసాగించారు. ఈ సందర్భంగా కాయితి లంబాడీల రాష్ట్ర అధ్యక్షుడు తాన్ సింగ్ నాయక్ మాట్లాడుతూ.. తమకు 38 ఏళ్లుగా జరుగుతున్న అన్యాయాన్ని తట్టుకోలేకనే రోడ్డుపైకి వచ్చామన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడకముందు సీఎం కేసీఆర్ కాయితి…

Read More

*కేసీఆర్ కు ఆరునెలల్లో 100 బెడ్ రూంల ప్రగతి భవన్* -సీఎం కేసీఆర్ పై ఎమ్మెల్యే రఘునందన్ రావు ఫైర్ సీఎం కేసీఆర్ కు ఆరునెలల్లో 100 బెడ్ రూంల ప్రగతి భవన్ నిర్మాణం జరిగింది కానీ నిరుపేదలకు మాత్రం తొమ్మిదిన్నరేళ్లు గడిచినా డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం కావడం లేదని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలందరికి వెంటనే డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో కట్టిన ఇండ్లలో ఉండటానికి సరిపడా గదులు లేవని, 2014 లో కేసీఆర్ అధికారంలోకి రాగానే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. తొమ్మిదేళ్లు…

Read More

కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం పోసానిపేట గ్రామానికి చెందిన మలి విడత తెలంగాణ ఉద్యమ సహచరుడు శ్రీ కాలభైరవ స్వామి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ గంజి సతీష్ గుప్తా పరామర్శించిన బిఆర్ఎస్ నాయకులు మాజీ జెడ్పిటిసి పడిగేల రాజేశ్వరరావు, రామారెడ్డిఎంపీపీ నా రెడ్డి దశరథ్ రెడ్డి,సదాశివనగర్ మండల రైతుబంధు అధ్యక్షుడు ఏలేటి భూమిరెడ్డి,మాజీ జిల్లా డీసీఎంఎస్ డైరెక్టర్ ముకుందరావు, గాంధారి మండలం అధికార బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శివాజీ రావు బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి,సాయ గౌడ్ కామారెడ్డి సింగిల్ విండో వైస్ చైర్మన్ శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రాజేశ్వర్ రావు మాట్లాడుతు మనిషి ఆరోగ్యం జాగ్రత్త గా కాపాడుకోవాలని ఆహారం అలవాట్లు మార్చుకోవాలని అనునిత్యం యోగ ఆసనాలు చేసుకుంటే ఎలాంటి రోగలైన పరదోలాచాన్నారు. ముఖ్యంగా పని ఒత్తిడి, మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలన్నారుఈ రోజుల్లో చిన్న పెద్ద వయసుతో సంబంధం లేకుండా హృదయ రోగ సమస్య…

Read More

*ఈ నెల 19 న యూసీసీ మద్దతు ర్యాలీ*-యూసీసీ మద్దతు దారుడు కాటిపల్లి వెంకట రమణారెడ్డిఈ నెల 19 న కామారెడ్డి జిల్లా కేంద్రంలో యూసీసీ మద్దతు ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని యూసీసీ మద్దతు దారుడు కాటిపల్లి వెంకట రమణారెడ్డి తెలిపారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మీదేవి గార్డెన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ.. భారత దేశ భవిష్యత్తు కోసమే యూసీసీ అని తెలిపారు. యూసీసీ కోడ్ ఎవరికి వ్యతిరేకం కాదన్నారు. యూసీసీపై అపోహలు వద్దని, కొంత మంది కావాలని తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు. యూసీసీ వల్ల ఎవరికి నష్టం లేదని, యూసీసీతో మన పిల్లల భవిష్యత్ నిర్ణయించే అవకాశం ఉందని తెలిపారు. ఈ నెల 19 న నిర్వహించే యూసీసీ మద్దతు ర్యాలీలో కామారెడ్డి నియోజక వర్గంలోని అన్ని మతాల వారు, అన్ని కులాల వారు, వ్యాపారస్తులు, వైద్యులు, న్యాయవాదులు, పురప్రముఖులు విద్యావంతులు, యువకులు,…

Read More

INDURVAARTHA KAMAREDDYదొడ్డి కొమురయ్య జయంతి, వర్థంతిలను గ్రామగ్రామాన నిర్వహించేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కురుమ సంఘం జిల్లా అధ్యక్షుడు, గొర్లు, మేకలు సంఘం ఫెడరేషన్ చైర్మన్ మర్కంటి భూమన్న ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం దొడ్డి కొమురయ్య వర్థంతి సందర్బంగా కలెక్టరేట్ లో కురుమ సంఘం ఆధ్వర్యంలో కొమురయ్య చిత్రపటానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ప్రజాసంఘాల నాయకులు, కురుమసంఘం నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మర్కంటి భూమన్న మాట్లాడుతూ.. నిన్న సాయంత్రం వరకు దొడ్డి కొమురయ్య వర్థంతి వేడుకలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాలేదన్నారు. ప్రభుత్వం రెండు రోజుల ముందుగానే ప్రకటిస్తే సుమారు వెయ్యి మందితో వేడుకలు ఘనంగా నిర్వహించుకునే అవకాశం ఉండదన్నారు. గొల్ల కురుమలకు ఉపాధి నిమిత్తం ప్రభుత్వం గొర్లను సబ్సిడీ కింద ఇస్తుందని, అలాగే సబ్సిడీ కింద షెడ్ నిర్మాణం కోసం కూడా నిధులు కేటాయించాలని కోరారు. వచ్చే జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తే…

Read More

ఇందుర్ వార్త (వెబ్ వార్తలు )పీఎఫ్‌ కటాఫ్‌ డేట్‌ ఎత్తేసి .. అందరికీ ఆసరా పింఛన్‌ ఇస్తామన్న సర్కార్‌…జీవో వచ్చి పదినెలలైనా ఇంకా అమలు కాని వైనం….కలెక్టరేట్‌ చుట్టూ తప్పని ప్రదక్షణలు.. ప్రభుత్వ నిర్ణయం కోసం ఆగని పడిగాపుల నిరీక్షణలు…ఎన్నాళ్ల నుంచో ఆస‌రా పింఛ‌న్ కోసం ఎదురు చూస్త‌న్న బీడీ కార్మికుల‌కు ఇది శుభ‌వార్త‌. ప్ర‌భుత్వం బీడీ కార్మికుల‌కు జీవ‌న భృతి కింద ఆస‌రా పింఛ‌న్‌ను అందిస్తున్న‌ది. దీనికి మొన్న‌టి వ‌ర‌కు ఓ క‌టాఫ్ డేట్‌ను పెట్టింది. 2014 ఫిబ్ర‌వ‌రి 28 లోపు పీఎఫ్ నెంబ‌ర్ క‌లిగి ఉన్న‌వారు మాత్ర‌మే బీడీ పింఛ‌న్‌కు అర్హులు. మొన్న‌టి వ‌ర‌కు వారే ఆస‌రా పింఛ‌న్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. పంద్రాగ‌స్టు రోజున రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ 10 ల‌క్ష‌ల మంది కొత్త వారికి ఆస‌రా పింఛ‌న్ మంజూరు చేసిన వాటిల్లో బీడీ కార్మికులు కూడా ఉన్నారు.అయితే ఆ క‌టాఫ్ డేట్ మూలంగా చాలా మంది…

Read More

 అంబర్పేట్ : బాగ్ అంబర్ పేట్ డివిజన్ కుమ్మరిబస్తీలో జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్బంగా బాగ్ అంబర్ పేట్ డివిజన్ కార్పొరేటర్ పద్మ వెంకట్ రెడ్డి, జిహెచ్ఎంసి ఎంటమాలజీ డిపార్ట్మెంట్ సూపర్వైజర్ రాఘవేంద్రతో కలిసి ఇంటి ఇంటికి తిరుగుతూ దోమల నివారణ కొరకు తీస్కోవలసిన జాగ్రత్తలు వివరిస్తూ అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ దోమల నివారణకు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని,నీటి నిల్వలు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, చిన్నపాటి జాగ్రత్తలతో డెంగ్యూ బారిన పడకుండా చూసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బిజెపి అధ్యక్షులు చుక్క జగన్,బిజెపి నాయకులు రమేష్ ముదిరాజ్,స్వామి,దేవరప్పల లక్ష్మణ్, శ్రీశైలం, నాగలక్ష్మి, వర్క్ ఇన్స్పెక్టర్ రవి నాయక్, వారితో పాటు జిహెచ్ఎంసి అధికారులు పాల్గొన్నారు.

Read More

ఆర్డీవోను కలిసిన టీ జే యు జర్నలిస్టులు..జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి..జర్నలిస్టులకు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో మీటింగ్ హాల్ ఏర్పాటు చేయాలి..అక్రిడేషన్ రాని వారికి కార్డులు త్వరగా అందజేయాలి..కామారెడ్డి జిల్లా పట్టణ కేంద్రంలో మంగళవారం రోజు కామారెడ్డి ఆర్డీవో శ్రీనివాస్ రెడ్డి తో కామారెడ్డి జర్నలిస్టులు కలవడం జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ బాబురావు ఆర్డీవో శ్రీనివాస్ తో మాట్లాడుతూ గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి జర్నలిస్టు ఇళ్ల పట్టా స్థలాలను వెంటనే మంజూరు చేయాలని. మరియు అలాగే నూతనంగా నిర్మించిన ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో జర్నలిస్టులకు సమావేశం కొరకు గదిని ఏర్పాటు చేయాలని ఆర్డీవో శ్రీనివాస్ రెడ్డి కి తెలపడం జరిగింది. అనంతరం ఆర్డిఓ స్పందించి నేను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి మీ యొక్క సమస్యలను పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ యొక్క కార్యక్రమంలో తెలంగాణ…

Read More

జర్నలిస్టు లను మోసం చేసిన కేసీఆర్ కు ప్రజలను మోసం చేయడం ఓ లెక్కా: ఎమ్మెల్యే రఘునందన్ రావు బిఆర్ఎస్ వ్యతిరేక వార్తలు రాయండి మూడు రోజుల్లో కేసీఆర్ జర్నలిస్ట్ ల సమస్యలు పరిష్కరిస్తారు.ఆల్లం బెల్లం అని చెప్పే పెద్ద మనిషి కుర్చీకి పవర్ లేదంటూ జర్నలిస్టులకు న్యాయం చేయనివారు ఎర్ర బుగ్గ కారులో ఎందుకు తిరుగుతున్నారు అని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మండి పడ్డారు.అన్ని వర్గాలను మోసం చేసినట్లే కెసిఆర్ జర్నలిస్ట్ లను మోసం చేశారన్నారు. ఇదిగో ఇల్లు అదిగో స్థలాలు జర్నలిస్టులో ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. జర్నలిస్టులు అధైర్య పడవద్దని ఏక తాటిగా ఉంటే ప్రభుత్వమే దిగివచ్చిందన్నారు. ప్రభుత్వం చేపట్టి ఆత్మీయ సమ్మేలాన్ని పత్రికల్లో ప్రచూరించకుంటే పత్రికల విలువ తెలుస్తుంది అన్నారు. మాస్టర్ ప్లాన్ లో రైతులు ఏ విధంగా ఉద్యమంలో చేపెట్టారు అదే స్ఫూర్తిలో జర్నలిస్టులు ఏకతాటిపై వచ్చి స్థలాల కోసం పోరాడాలన్నారు. తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్…

Read More

ఎంఎస్ఎన్ కంపెనీ వ్యర్థ పదార్థాలు కాచాపూర్ గ్రామ పెద్ద చెరువులోకి వస్తున్నాయనిఎం ఎస్ ఎన్ కంపెనీ యొక్క వ్యర్థ పదార్థాలుతీ ముందు గ్రామ ప్రజలు ధర్నా రాస్తారో, కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం కాచాపూర్ గ్రామానికి చెందిన పెద్ద చెరువులో చేప పిల్లలు ఆ నీరు త్రాగడం వలన గేదెలు కూడా చనిపోవడం జరుగుతుందని, కంపెనీ విషయంపై గ్రామపంచాయతీ గ్రామ వద్ద సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు, ఎం ఎస్ ఎన్ కంపెనీ యొక్క వ్యర్థ పదార్థాలు బయటకు రావద్దని కంపెనీ యజమానికి పలుమార్లు చెప్పిన పట్టించుకోవడంలేదని కాచాపూర్ గ్రామానికి చెందిన విడిసి గ్రామ అధ్యక్షులు మర్రి మైపాల్ రెడ్డి ,తిరుమల్ రెడ్డి, కిష్టారెడ్డి ,దశరథం ,నంద గౌడ్ ,దుబ్బ రాజం తెలిపారు, ఎంఎస్ఎన్ కంపెనీ వలన ప్రాణాష్టం ఉందని గ్రామంలోని అన్ని కులాల అధ్యక్షుల కార్యదర్శిలతో గ్రామ ప్రజలతో సమావేశం నిర్వహించుకోవడం జరిగిందని తెలిపారు, ఇప్పటికైనా ఎంఎస్ఎన్ కంపెనీ…

Read More