- ఏజెన్సీ ప్రాంతాల్లో గౌడులకు న్యాయం చేయండి
- ఉచిత సిద్ధ వైద్య శిబిరాన్ని ప్రారంభించిన శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్
- ఆదివాసీ విద్యార్థుల ఉన్నత విధ్య కోసం ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలి
- ఘనంగా పాడి కౌశిక్ రెడ్డి జన్మదిన వేడుకలు.
- పృధ్వీరాజ్ చౌహాన్ విగ్రహ ప్రతిష్టకు స్థలం కేటాయించాలి
- అమిత్ షా ను అరెస్టు చేసి బర్తరఫ్ చేయాలి:
- తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవ సంస్థ ఆధ్వర్యంలో
- అమిత్ షా ,పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు..!
Author: ఇందూర్ వార్త
మనుషులందరూ ఒక్కటేనని, స్త్రీ పురుష భేదం లేదని, శ్రమను మించిన సౌందర్యం లేదని, భక్తి కన్నా సత్ప్రవర్తనే ముఖ్యమని వీరశైవ సంప్రదాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన సాంఘిక విప్లవకారుడు బసవేశ్వరుడు అని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. మహాత్మా బసవేశ్వరుని 890వజయంతి వేడుకలను పురస్కరించుకుని జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం బసవేశ్వర జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బసవేశ్వర చిత్రపటానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ , వీరశైవ జంగం సమాజం ప్రతినిధులు, బీసీ సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.సర్వమానవ సమానత్వాన్ని ప్రబోధించిన విశ్వగురువుగా అందరి హృదయాల్లో బసవేశ్వరుడు చిరస్థాయిగా నిలిచిపోతారని తెలిపారు. కుల, వర్ణ, వర్గ, లింగ వివక్ష లేకుండా సమసమాజ నిర్మాణం కోసం కొన్ని వందల ఏళ్ల క్రితమే బసవేశ్వరుడు కృషి చేశారన్నారు. ఆ కాలంలోనే మహిళా…
రాష్ట్రంలో ప్రతిపక్ష నేతల అధికార బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు తగ్గించిరాష్ట్రంలో ప్రతిపక్ష నేతల సిగపట్లుఅధికార బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు తగ్గించిప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలే తిట్టుకుంటున్న వైనంతెలంగాణ రాజకీయ యవనికపై వినూత్నమైన తీరతెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష నేతల మధ్య సిగపట్ల కార్యక్రమం షురూ అయింది. అధికార పార్టీ భారత రాష్ట్ర సమితిపై విమర్శలు తగ్గించి… వీరిపై వీరే చేసుకోవడం వింతగా మారింది. తెలంగాణ రాష్ట్ర రాజకీయ యవనికపై వినూత్నతీరుతెన్నులు అగిపించడం సర్వత్రా చర్చనీయాంశమవుతున్నది. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్కు రూ. 25 కోట్లు ఇచ్చిందని ఈటెల రాజేందర్ ఆరోపణలు చేయగా… అందుకు బదులు రేవంత్ ఘాటుగా స్పందించారు. రాజేందర్ చేసింది నిజమైతే…. హైదరాబాద్లోని భాగ్యలక్ష్మి దేవాలయానికి రావాలని సవాల్ విసిరారు. రాజేందర్ రాకపోవడంతో… రేవంత్ అక్కడ మీడియాతో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ… ‘నా జీవితంలో అన్నీ ఉన్నాయి.. నాకు ఇంకా ఏమీ అవసరం లేదు..…
*షబ్బీర్ అలీ దేశద్రోహి*-ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్మంత్రి హోదాలో తీవ్రవాదిని పరామర్శించిన దేశద్రోహి షబ్బీర్ అలీ అని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఫైర్ అయ్యారు. మంగళవారం బిక్కనూర్ మండలం బస్వాపూర్ గ్రామంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మీడియా సమావేశం నిర్వహించారు. గత ఆదివారం పెద్దమల్లారెడ్డి గ్రామంలో హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా షబ్బీర్ అలీ చేసిన ఆరోపణలపై గంప గోవర్ధన్ ఫైర్ అయ్యారు. ప్రజల ఆశీర్వాదంతో తాను 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానన్నారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి పొందిన షబ్బీర్ అలీ.. తాను మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన అభివృద్ధి తప్ప తన హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, రామాయంపేట నుంచి కామారెడ్డి వరకు వెంచర్లు ఉన్నాయని పదేపదే ఆరోపణలు చేస్తున్నారన్నారు. ‘ఇదే బిక్కనూర్ ప్రెస్ వాళ్ళను తీసుకుని వెళ్దాం.. నాకు ఎక్కడైనా వెంచర్లు ఉన్నట్టు నిరూపిస్తే ముక్కు నేలకు రాసి…
*ప్రశ్నాపత్రాలతో దందా చేస్తున్న ప్రభుత్వం*-టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాంటీఎస్పీఎస్సి ప్రశ్నాపత్రాలతో ప్రభుత్వం దందా చేస్తుందని టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఈ నెల 18 న ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద చేపట్టబోయే నిరుద్యోగుల గోస-అఖిలపక్ష భరోసా నిరసన దీక్ష కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని షబ్బీర్ అలీ నివాసంలో అఖిలపక్ష నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. గతంలో ఎన్నో ప్రభుత్వాలు చూశామని, కేసీఆర్ ప్రభుత్వం లాంటి ప్రభుత్వాన్ని చూడలేదన్నారు. ప్రభుత్వాన్ని వాడుకుని అడ్డగోలుగా సంపాధిస్తూ దోచుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కమిషన్ల కోసమే ప్రాజెక్టులు డిజైన్ చేసారని, కాంట్రాక్టర్లకు లబ్ది చేకూర్చడం కోసమే పనులు చేపడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కేసీఆర్ చెప్పిందే వేదం.. గీసిందే గీత అన్నారు. ఉద్యోగం అనేది సామాజిక ఎదుగుదలకు ఉపయోగపడుతుందని, ఉద్యోగం ఆత్మస్తైర్యాన్ని కలిగిస్తుందన్నారు. అనేక కష్టనష్టాలకోర్చి నిరుద్యోగులు పరీక్షలు రాస్తే ప్రభుత్వం ప్రశ్నాపత్రాలు…
*టికెట్ కేటాయింపులో షబ్బీర్ అలీ హోదా ఏంటి..?*-షబ్బీర్ ఆలీకి మదన్ మోహన్ రావు సూటి ప్రశ్న కామారెడ్డి కాంగ్రెస్ లో విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. నిన్నమొన్నటి వరకు ఉప్పునిప్పులా ఉన్న నేతలు ఆ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పర్యటనతో అయినా ఏకతాటిపైకి వస్తారేమోనని కిందిస్థాయి కార్యకర్తల ఆశలు ఆడియాశాలవడంతో పాటు రేవంత్ రెడ్డి క్యాంప్ వద్ద కొట్టుకునే స్థాయికి చేరాయి. గాంధారి మండల కేంద్రంలో రేవంత్ రెడ్డి చేపట్టిన నిరుద్యోగ నిరసన దీక్ష కార్యక్రమంలో కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల బాధ్యత తాను చూస్తానని షబ్బీర్ అలీ చెప్పడంపై ఆ పార్టీ ఐటి సెల్ చైర్మన్ మదన్ మోహన్ రావు మండిపడ్డారు. నేడు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి షబ్బీర్ ఆలీపై నిప్పులు చెరిగారు. నిన్న గాంధారిలో ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాలను మాజీ మంత్రి షబ్బీర్ అలీ చూస్తానని చెప్పడాన్ని తప్పుబట్టారు. వరంగల్ డిక్లరేషన్ సభలో…
ఆటో నడిపే వ్యక్తి గుండె పోటుతో మృతికామారెడ్డి, మార్చి 6 : వరుసగా గుండెపోటు మరణాలు ప్రజలను భయందోళనకు గురి చేస్తున్నాయి. కరోనా వచ్చి విలాయతాండం చేయగా మనిషిని మనిషి చూస్తే భయపడే విధంగా మారిన పరిస్థితుల నుండి ఇప్పుడిప్పుడే కోరుకుంటున్న దశలో ఈ హఠాన్ మరణాలు భయాందోళనలకు గురి చేస్తున్నాయి. యువకులు గుండెపోటు బారిన పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఓ వ్యక్తి ఆటో నడువుతుండగా గుండెపోటుకు గురై మృతి చెందిన సంఘటన కామారెడ్డిలో కలకలం రేపింది.ఓ వ్యక్తి ఆటో నడుపుతూ గుండె పోటుకు గురై మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తిని కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన 40 సంవత్సరాల వయసు గల మదార్ గా గుర్తించారు. స్థానికుల కథనం మేరకు ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన మదార్ గత కొంతకాలంగా అయ్యప్ప నగర్ లో…
*టిఎన్ఎస్ఎఫ్ కామారెడ్డి,ఎల్లారెడ్డి నియోజకవర్గాల సమన్వయకర్తగా అంజల్ రెడ్డి నియామకం..**టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు..*కామారెడ్డి జిల్లా గాంధారి మండలం జువ్వాడి గ్రామానికి చెందిన బొండ్ల అంజల్ రెడ్డిని టిఎన్ఎస్ఎఫ్ కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల సమన్వయకర్తగా నియమించినట్లు టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు తెలియజేశారు.నూతన నియామకమైన టిఎన్ఎస్ఎఫ్ కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల సమన్వయకర్త అంజల్ రెడ్డి మాట్లాడుతూ టిఎన్ఎస్ఎఫ్ కమిటీల బలోపేతానికి ఐపీఎల్ కృషి చేస్తానని,బిఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తానని ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేశారు.
35 లక్షల మంది విద్యార్థులకు సన్న బియ్యంతో భోజనం..వికారాబాద్ జిల్లాలో బియ్యం నాణ్యతను పరిశీలించినపౌరసరఫరాల సంస్థ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ దేశంలో ఎక్కడా లేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు గారు నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ప్రతి రోజు దాదాపు 35 లక్షల మంది విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం అందిస్తోందని పౌరసరఫరాల సంస్థ చైర్మన్ శ్రీ సర్దార్ రవీందర్ సింగ్ తెలిపారు.మంగళవారం నాడు వికారాబాద్ జిల్లా శివారెడ్డి పల్లిలోని మైనార్టీ రెసిడెన్షియల్ హాస్టల్లో సన్నబియ్యం నాణ్యతను పరిశీలించారు. అనంతరం, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.బియ్యం నాణ్యత పై సంతృప్తి వ్యక్తం చేశారు. దేశంలో సన్నబియ్యంతో విద్యార్థులకు భోజనాన్ని అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్రంలో 28,632 ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం భోజన పథకం ద్వారా సుమారు 25 లక్షల మంది విద్యార్థులకు, అలాగే 4237 ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లోని 9 లక్షల 65 వేల మంది…
సబ్ రిజిస్టర్ శ్రీలతపై రియల్ ఎస్టేట్ వ్యాపారుల వేధింపులు ఆపాలి.. తెలంగాణ గిరిజన సంఘం.. జిల్లా కార్యదర్శి ప్రకాష్ నాయక్..హెచ్చరిక.. ఓ గిరిజన ఆఫీసర్ అనే పేరుతో. అక్కసుతో.. ఆమెపై లేనిపోని ఆరోపణలు చేస్తూ.. భయభ్రాంతులకు గురి చేస్తూ. దొంగ రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం.. అవినీతిని అంటగట్టడం సభాబు కాదని.. అన్నారు.. అవినీతికన నిరూపిస్తే.. పై అధికారులకు ఫిర్యాదు చేయాలి తప్ప.. డైరెక్ట్ గా .. ఆమెపై దాడులు చేసే విధంగా ప్రవర్తిస్తున్నారని.. అది సరైనది కాదు.. ఒకవేళ ఆమెపై ఒకే విధంగా వేధింపులకు పాల్పడితే… గిరిజన సంఘం చూస్తూ ఊరుకోదని.. ఆందోళనకు సిద్ధం చేస్తామని హెచ్చరించారు.. ఈ కార్యక్రమంలో నాయకులు జబ్బర్ లాల్ రాజు ఫుల్ సింగ్ ఏం సీన్ పాల్గొని ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది
*సబ్ రిజిస్ట్రార్ గారూ.. మీ అవినీతి సేవలు చాలు.. ఇక వెళ్లిపోండి*-బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబోద్దీన్ ‘సబ్ రిజిస్ట్రార్ గారూ.. మీ అవినీతి సేవలు ఇక చాలు.. ఇక మీరు వెళ్లిపోండి’ ఈ మాటలు అన్నది ఎవరో కాదు. అధికార బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ముజీబోద్దీన్. ఆయన ఇంతలా మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందనే చర్చ మొదలైంది. కామారెడ్డి సబ్ రిజిస్ట్రార్ శ్రీలతపై గత కొద్దిరోజులుగా అవినీతి ఆరోపణలు పుంఖాలు పుంఖాలుగా వస్తున్నాయి. నిన్న కామారెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారులు సమావేశమై సబ్ రిజిస్ట్రార్ అవినీతికి వ్యతిరేకంగా జాయింట్ యాక్షన్ కమిటీ వేశారు. గత కొద్దిరోజులుగా పత్రికల్లో సైతం ఆమె అవినీతిపై కథనాలు వస్తున్నాయి. దాంతో నేడు ముజీబోద్దీన్ నేరుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్దకు వెళ్లి అక్కడే మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత కొద్దిరోజులుగా సబ్ రిజిస్ట్రార్…