- ఏజెన్సీ ప్రాంతాల్లో గౌడులకు న్యాయం చేయండి
- ఉచిత సిద్ధ వైద్య శిబిరాన్ని ప్రారంభించిన శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్
- ఆదివాసీ విద్యార్థుల ఉన్నత విధ్య కోసం ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలి
- ఘనంగా పాడి కౌశిక్ రెడ్డి జన్మదిన వేడుకలు.
- పృధ్వీరాజ్ చౌహాన్ విగ్రహ ప్రతిష్టకు స్థలం కేటాయించాలి
- అమిత్ షా ను అరెస్టు చేసి బర్తరఫ్ చేయాలి:
- తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవ సంస్థ ఆధ్వర్యంలో
- అమిత్ షా ,పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు..!
Author: ఇందూర్ వార్త
శ్రీ జగన్నాథ స్వామి ఆలయ షెడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే సానుకూల స్పందన -హర్షం వ్యక్తం చేసిన వీడిసి ఇందూర్ వార్త /నిజామాబాద్ రూరల్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని నూతనంగా ఎన్నుకోబడిన గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు కాంగ్రెస్ ప్రభుత్వం రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలవడం అయినది. ఈ సందర్భంగా ధర్పల్లి మండలంలో గల సమస్యలు వాటి వివరాలను తెలుపుతూ ధర్పల్లి గ్రామంలోని శ్రీ జగన్నాథ స్వామి ఆలయ ప్రాంగణంలో భక్తజనులు ఎండాకాలంలో మరియు వర్షాకాలంలో సేద తీర్చుకోవడానికి షెడ్డు నిర్మాణం కొరకు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు కోరగా వెంటనే గౌరవ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి సానుకూలంగా స్పందిస్తూ త్వరలోనే షెడ్డు నిర్మాణ పనులను ప్రారంభించాలని షెడ్డు నిర్మాణానికి అయ్యే ఖర్చు పూర్తి డబ్బులను తానే చెల్లిస్తానని తెలపడం అయినది. చెప్పిన వెంటనే సానుకూలంగా స్పందించిన గౌరవ ఎమ్మెల్యే గారికి ధర్పల్లి…
– లక్ష రూపాయలు రుణమాఫీ తో రెత్తులు హర్షంవ్యక్తం – సిద్దిపేట్ అర్బన్ ఓ.బి.సి సేల్ ఆధ్వర్యంలో – రేవంత్ రెడ్డికిపాలాభిషేకం.. – పాల్గొన్న ఓబీసీ సెల్ అధ్యక్షుడు మిద్దె ప్రసాద్, జెనరల్ సెక్రెటరీ బొలుగం నవీన్ గౌడ్, గ్రామ అధ్యక్షుడు కట్కూరి సత్యనారాయణ ,మానవ హక్కుల సంఘము అర్బన్ అధ్యక్షుడు ఇన్యాలపు హరికృష్ణ తదితరులు…… సిద్దిపేట్ జిల్లా/అర్బన్/ ఎన్సాన్‌పల్లి జులై 18: రైతు రుణమాఫీ పథకంలో భాగంగా గురువారం అర్బన్ మండల్ ఓబీసీ ఆధ్వర్యంలో ఎన్సాన్‌పల్లి గ్రామంలో రైతుల సమక్షంలో సి.ఎం రేవంత్ రెడ్డి కి పాలాభిషేకం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఓ.బి.సి అర్బన్ మండల్ జనరల్ సెక్రటేరి బోలాగం నవీన్ గౌడ్ మాట్లాడుతూ రెత్తు ఖాతాల్లో రూ. 1 లక్ష వరకు జమ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రూ.2 లక్షలలోపు రుణాలను మాఫీ చేసేందుకు రేవంత్ రెడ్డి…
రైతుబంధు నిధులే రుణ మాఫీ కోసం మళ్లిస్తున్నారా! ఇందూర్ వార్త : వెబ్ డెస్క్ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం యసంగి, వానాకాలం పంట సహాయం కిందా ఎకరాకు ఐదు వేల రూపాయలు గత ప్రభుత్వంలో ఇచ్చినట్లు ఎకరానికి రూ. 5000 చొప్పున ఒక విడతకు రైతుబంధు కోసం ఇచ్చే మొత్తం రూ. 7,400 కోట్లు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు ఎకరానికి రూ. 7500 చొప్పున ఒక విడతకు రైతుబంధు కోసం ఇవ్వాలంటే అయ్యే మొత్తం రూ. 11,100 కోట్లు. ప్రస్తుతం రుణ మాఫీ కోసం ఖర్చు చేయబోయే మొత్తం సుమారు రూ. 6,800 కోట్లు.వానాకాలం రైతు బంధు ఇవ్వకుండా ఆ నిధులే రుణ మాఫీ కోసం ఖర్చు చేస్తున్నారని రైతుల నుండి విమర్శలు వస్తున్నాయి.
రైతు రుణమాఫీ గైడ్‌లైన్స్ మార్చాలి: బీ.వీ రాఘవులు Jul 18, 2024, ఇందూర్ వార్త : వెబ్ డెస్క్ రైతు రుణమాఫీ గైడ్‌లైన్స్ మార్చాలి: బీ.వీ రాఘవులు రైతు రుణమాఫీ గైడ్‌లైన్స్ సరిగ్గా లేవని సీపీఎం నేత బీవీ.రాఘవులు విమర్శించారు. కౌలు రైతులు, పోడుదారుల రుణాల సంగతేంటని ప్రశ్నించారు. హనుమకొండలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కౌలుదారులకు ఇవ్వకుండా ఎవరికిచ్చినా ప్రయోజనం లేదన్నారు. రీషెడ్యూల్ చేసిన రుణాలకు రైతుమిత్ర గ్రూపులకు, చిన్న, సన్న కారు రైతులకు మాఫీ జరగటం లేదన్నారు. వెంటనే గైడ్‌లైన్స్ మార్చాలని కోరారు
సహరా ఇండియా కంపని బాధితులను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి — ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు ఇందూర్ వార్త : సిరికొండ ప్రతినిది జూలై 17 దేశంలో 12 కోట్ల మంది పెద్ద, మద్య తరగతి ప్రజలు సహారా ఇండియా కంపని సంస్థలో పొదుపు చేసుకున్న 86 వేల కోట్ల డబ్బుల్ని తిరిగి చెల్లించకుండా సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేస్తుందని, కనుక కేంద్ర ప్రభుత్వం సహారావు బాధితులకు వెంటనే డబ్బులు చెల్లించి ఆదుకోవాలని ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారినీ డిమాండ్ చేశారు. సిరికొండ మండల కేంద్రంలో జూలై 17 తేదీన పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దాసు పాల్గొని మాట్లాడుతూ వివిధ అవసరాల కోసం, పొదుపు చేసుకున్న డబ్బును గంపెడు ఆశతో భవిష్యత్తులో పిల్లల చదువులకు పెళ్లిళ్లకు ఉపయోగపడుతుందని ఆశతో సహారా బ్యాంకుల్లో పొదుపు చేసుకుంటే కంపెనీతో కుమ్మక్కై కేంద్ర…
కామారెడ్డి బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులుగా రాజపాటిల్ నియామకం ఇందూర్ వార్త : కామారెడ్డి ప్రతినిది, కామారెడ్డి బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులుగా రాజపాటిల్ ను నియమించారు. ఈ మేరకు కామారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షురాలు అరుణతార 29 మందితో కూడిన జిల్లా కార్యవర్గ జాబితాను విడుదల చేశారు. ఈ సందర్భంగా రాజుపాటిల్ మాట్లాడుతూ..నాపై నమ్మకంతో.. కామారెడ్డి బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులుగా అవకాశం కల్పించిన బిజెపి జిల్లా అధ్యక్షురాలు అరుణతార కి, కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారికి హృదయపూర్వక దన్యవాదాలు తెలిపారు. సహచర పార్టీ నాయకుల కార్యకర్తల సహకారంతో పార్టీ పటిష్టతకు కృషి చేస్తానన్నారు.
నిజామాబాద్ జిల్లాలో యువజంట ఆత్మహత్య నిజామాబాద్ జిల్లా:జులై 16 నిజామాబాద్ జిల్లా కేంద్రం లోని యువ జంట రైలు కిందపడి ఆత్మహత్య చేసు కోవడం కలకలం రేపింది. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం పకీరాబాద్- మిట్టాపూర్ మధ్యలో రైలుపట్టాలపై సోమవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోతంగల్ మండలం హెగ్డో లికి చెందిన అనిల్(28) శైలజ(24)కు ఏడాదిన్నర కిందట వివాహం జరిగింది. బంధువుల వేధింపుల దుష్ట ప్రచారం తట్టుకోలేక తాము ఆత్మహత్యకు పాల్పడుతు న్నట్టు యువకుడు తన సెల్ ఫోన్ నుంచి సెల్ఫీ వీడియో ను రికార్డ్ చేసి పోలీసులకు పంపించారు.దుష్పప్రచారాలను తట్టు కోలేక జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసు కుంటు న్నామని తమ బాధను వీడియో రూపంలో చిత్రీక రించారు. దీంతో పోలీసులు వారి ఫోన్ ని ట్రాక్ చేసి ఆ దంపతులను కాపాడడానికి చేసిన ప్రయత్నం ఫలించ లేదు. చివరికి పోలీసులు పకీరాబా ద్-మిట్టాపూర్ పట్టాల పరి సర…
కొత్తపేటలో ప్రొటోకాల్ రగడ… ప్రజాపాలనలో ప్రహతీర్పు అపహాస్యం. ఓడిన అభ్యర్థి వేదికపై ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యే నేలపై కొత్తపేటలో ప్రొటోకాల్‌కు తిలోదకాలుఅ ధికారుల తీరుపై ఎమ్మెల్యే సబిత ఆగ్రహం మాజీ ఎమ్మెల్యేలను ఆహ్వానించే చట్టం తీసుకురండి స్టేజీ ముందు నేలపై బైఠాయించి నిరసన బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల తోపులాట ఇందూర్ వార్త : సంగారెడ్డి జూలై 16 ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం సహజం. అది ప్రజాస్వామ్య స్ఫూర్తి. ప్రజాక్షేత్రంలో ఓడి, ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధంలేని వ్యక్తి అధికారిక స్టేజీ మీద కూర్చోవడమంటే? అది ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే! ప్రజాతీర్పును అవహేళన చేయడమే! రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని కొత్తపేటలో సోమవారం అదే జరిగింది. ఐదుసార్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించడంతోపాటు మూడు పర్యాయాలు మంత్రిగా సుదీర్ఘ రాజకీయానుభవం ఉన్న ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ సర్కారు తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే అధికారిక…
డిప్యూటీ ఎమ్మార్వో ను అరెస్టు చేయాలి – ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి మాజీ బట్ట వెంకట రాములు ఇందూర్ వార్త – కామారెడ్డి రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ తెద్దు ప్రశాంత్ ఆత్మహత్యకు కారణమైన డిప్యూటీ ఎమ్మార్వో ను అరెస్టు చేయాలనీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి మాజీ బట్ట వెంకట రాములు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం తాసిల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న దళిత ఉద్యోగిని తెద్దు ప్రశాంత్ ఆత్మహత్యకు కారణమైన వెంకటేష్ పై ఎస్సీ ఎస్టీ అడ్రస్ కేస్ నమోదు చేయాలన్నారు. దళితులకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం చొరవ తీసుకొని చర్యలు తీసుకోవాలని కోరారు. డిప్యూటీ తాసిల్దారుని అరెస్టు చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు సత్తిగారి లక్ష్మి, లావణ్య, మానస, రాజనర్సు,…
కళ్యాణ లక్ష్మి చెక్కు కోసం డబ్బులు వసూల్ చేసిన కాంగ్రెస్ నేత హోటల్లో పనిచేస్తూ బిడ్డ పెళ్లి చేసిన మహిళను కూడా వదలని వైనం ఇందూర్ వార్త : సిరిసిల్ల జిల్లా రెండు రుపాయల వడ్డీకి అప్పు తెచ్చి పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి చెక్కు ఇవ్వట్లేదు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటు గోడు వెళ్లబోసుకున్న మహిళ రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం ఇందిరమ్మ కాలనీకి చెందిన చంద్రకళ అనే మహిళ తన బిడ్డ పెళ్లి చేయగా ప్రభుత్వం ఇచ్చే లక్ష రూపాయల కళ్యాణ లక్ష్మి చెక్కు ఇప్పిస్తా అంటే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గడ్డం మధుకర్ (చోటు) అనే యువకుడికి రూ. 7000 ఇచ్చింది. శనివారం కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం ఉండగా 178 లబ్దిదారుల లిస్టులో తన పేరు లేకపోవడంతో ఆగ్రహంతో అక్కడే ఉన్న ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వద్ద ఈ విషయం…