Author: indurvaartha (ఇందూర్ వార్త)

ఎన్నికలలో వినియోగించే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈ.వి.ఎం.) ట్యాంపరింగ్ చేయబడవని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఒక ప్రకటనలో తెలిపారు. భారత ఎన్నికలలో పేపర్ బ్యాలెట్ విధానాన్ని మళ్లీ ప్రవేశపెట్టాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొట్టి వేసిందని, ఈ.వి.ఎం. ట్యాంపరింగ్ పై పిటిషనర్ చేసిన వాదనలను జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ పి.బి.వరాలే లతో కూడిన ధర్మాసనం తిరస్కరించిందని తెలిపారు. ఎన్నికలలో ఓడిపోయినప్పుడు మాత్రమే ఈ.వి.ఎం.ల విశ్వసనీయతను ప్రశ్నించే నాయకుల అస్థిరతను ఎత్తి చూపిందని తెలిపారు.

Read More

విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి…. ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి…. ఇందూరు వార్త హనుమకొండ జిల్లా ఆత్మకూరునవంబర్ 26 విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి అని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. మండల కేంద్రము లోని సెయింట్ థెరిస్సా హై స్కూల్ సిల్వర్ జూబ్లీ వేడుకలు మంగళవారం జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతం లో ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దిన ఘనత సెయింట్ థెరిస్సా హై స్కూల్ కి ఉందని అన్నారు.విద్యార్థులు నైపుణ్యాలను అభివృద్ది చేసుకోవాలి అన్నారు. స్కూల్ అభివృద్ధికి సంబంధించి నా వంతు సహాయ సహకారాలు ఉంటాయని అన్నారు.ప్రొవిజనల్ మదర్ యానిస్ , ప్రిన్సిపాల్ సిస్టర్ జాయిస్,ఉపాధ్యాయులు,అధికారులు,తల్లిదండ్రులు పాల్గొన్నారు. అలాగే ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మండల కేంద్రంలో అంగన్వాడీ కేంద్రానికి శంకుస్థాపన చేశారు.

Read More

కామారెడ్డి మున్సిపల్ లో అడ్డగోలుగా అక్రమ కట్టడాలు.. చేతులు మారుతున్న ముడుపులు అడిగేదేవరు….ఆపేదెవరు టౌన్ ప్లానింగ్ స్పందించదు… టాస్క్ ఫోర్స్ పట్టించుకోదు… రాజకీయ నాయకుల కొమ్ము కస్తున్నా టౌన్ ప్లానింగ్ అధికారులు ఇందూర్ వార్త కామారెడ్డి: కామారెడ్డి మున్సిపల్ పరిధిలో అధికారుల అండదండలతో అడ్డు అదుపు లేకుండా అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. పట్టణంలో ప్రస్తుత ఛైర్పర్సన్ ఇంటి సమీపంలో నిర్వాహకులు నిబంధనలు పట్టించుకోకుండా మమ్మల్ని అడిగేదేవరు….ఆపేదెవరు అన్నట్టుగా సెట్ బ్యాక్ లేకుండా పర్మిషన్ ఒకలా తీసుకోని కట్టడాలు మరోలా నిర్మిస్తున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులు ఆప్రూవల్ ఇచ్చిన తరువాత ఆ బిల్డింగ్ ఏ విధంగా కడుతున్నారు. ఎన్ని అంతస్తులు వేస్తున్నారని పర్యవేక్షణ చేయాలి. కానీ ముడుపులు తీసుకొని పర్మిషన్ ఇచ్చిన తర్వాత అటు వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు ఎవరైనా కాలని వాసులు అభ్యంతరాలు చెప్తే మాకు చాలా పనులు ఉన్నాయంటూ తిప్పికొడుతున్నారు.రెసిడెన్సియల్ పేరుతో పర్మిషన్ తీసుకుని కమర్షియల్‌…

Read More

మృతుని కుటుంబానికి అండగా  రాష్ట్ర యువజన నాయకుడు రణధీర్ రెడ్డి ….  ఇందూరు వార్త ఆత్మకూరు నవంబర్ 26 ఆత్మకూరు మండలంలోని పెంచికలపేట గ్రామానికి చెందిన కోటగిరి మల్లయ్య గౌడ్ అనారోగ్యంతో ఇటీవల మృతి చెందగా విషయం తెలుసుకున్న రాష్ట్ర యువజన నాయకులు రేవూరి రణధీర్ రెడ్డి మృతుడు కోటగిరి మల్లయ్య గౌడ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా రణధర్ రెడ్డి మాట్లాడుతూ మృతుని కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని, తన వంతు సహాయం కూడా ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర యూత్ నాయకులు రణధీర్ రెడ్డి వెంట కాంగ్రెస్ మండల పార్టీ ఉపాధ్యక్షులు కుండే కృష్ణంరాజు, వెన్నపురెడ్డి నాగరాజు, మండల పార్టీ యూత్ కార్యదర్శి మంగరాజు, అసెంబ్లీ యూత్ కార్యదర్శి కొమ్ముల శ్రవణ్,కుండే మహేందర్, కమలాకర్ రెడ్డి, దురిశెట్టి శ్రవణ్, ఇలసారపు చంద్రమౌళి, సుద్దాల అనిల్,…

Read More

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు మంత్రి రోడ్ల నిర్మాణాలకు మంత్రి శంకుస్థాపన సంగారెడ్డి జిల్లా , ఇందూర్ వార్త నవంబర్26.కిట్టు రిపోర్టర్ నేడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర రాజనరసింహ అందోల్ నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 11.00 గంటలకు పుల్కల్ మండలం లోని కోడూరు X రోడ్డు నుండి కొండారెడ్డిపల్లి X రోడ్డు వయా బొమ్మారెడ్డిగూడెం నిర్మాణానికి 4.69 కోట్ల నిధులతో కోడూరు X రోడ్డు వద్ద శంకుస్థాపనచేసి 11.45 గంటలకు డాకూర్ PWD రోడ్డు నుండి పోతిరెడ్డిపల్లి X రోడ్డు (వయా మాసాంపల్లి) వరకు 2.38 కోట్లతో శంకుస్థాపన చేస్తారు 12.45 గంటలకు రోళ్లపహాడ్ గేట్ నుండి రోళ్లపహాడ్ గ్రామం వరకు రోడ్డు నిర్మాణానికి 1.40 కోట్లతో రోళ్లపహాడ్ గేటు వద్ద శంకుస్థాపన చేసి అనంతరం కార్యకర్తలతో సమావేశం చేయనున్నారు.

Read More

చెట్లను నరికిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి (జిన్నారం మండల్ గ్రామం మంగంపేట్ ప్రతినిధినవంబర్ 25 వార్త) జిన్నారం మండలం మంగంపెట్ గ్రామం లో తన పొలానికి వేసిన కడిల కు దూరంగా వున్న చెట్టును పొలం యజమాని ఎవరూ లేని సమయంలో గ్రామ కంఠం స్థలంలో ఉన్న చెట్టును నరికివేయడం జరిగింది ఈ విషయం పైన అటవీ శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Read More

రెండు రాష్ట్రాల మధ్య రహదారిని పట్టించుకోని అధికారులు- తంబళ్ల రవి ఇందూర్ వార్త నవంబర్ 24 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి తెలంగాణ రాష్ట్రం అల్లిపల్లి గ్రామం…ఆంధ్ర రాష్ట్రం అల్లిపల్లి గ్రామం మధ్యలో ఉన్న రహదారి ఏ ప్రభుత్వం రోడ్డు పోస్తుందో అని ఎదురు చూస్తున్న ఇరు గ్రామాల ప్రజలు ఇరు రాష్ట్రాల రాకపోకలకు ఇదే ప్రధాన రహదారి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం అల్లిపల్లి గ్రామం దగ్గర రెండు రాష్ట్రాల సరిహద్దు ఉంది,ఇరు రాష్ట్రాల రాకపోకలకు ఇదే ప్రధాన రహదారి,ఇ రహదారి వాహనదారులకు చాలా ఇబ్బందికరంగా మారింది,గత ప్రభుత్వాలు పట్టించుకోవడం వల్ల ఒక కిలో మీటరు రహదారి పూర్తిగా దెబ్బతిన్నది,కొత్తగా ఏర్పడిన ఆంధ్ర,తెలంగాణ రాష్ట్రాలు కూడా పట్టించుకోకపోవడం వల్ల సుమారు మోకాల్లోతు గుంటలు పడి ఉన్నవి నాలుగు చినుకులు వర్షం పడ్డ కూడా లోతు ఎంత ఉందో తెలవనంత దారుణంగా తయారైయున్నది,వాహనదారులు మరియు ప్రయాణికులు ఇబ్బంది…

Read More

ఇందూర్ వార్త :  వెబ్ డెస్క్ నవంబర్ 23 ఆపదలో ఆదుకునే వ్యక్తి శివంపేట జడ్పిటిసి మహేష్ గుప్తా,,,,, మెదక్ జిల్లా శివంపేట మండలంలోని గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల మరణించిన విషయాన్ని తెలుసుకొని కుమ్మరి చిత్తారి కుటుంబాన్ని పరామర్శించి జడ్పిటిసి మహేష్ గుప్తా తన సొంత నిధుల నుండి ఐదు వేల రూపాయలు ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు ముత్యంరెడ్డి ఎంపిటిసి వెంకటేశ్వర్లు బిఆర్ఎస్ నాయకులు వెంకటరెడ్డి కృష్ణారెడ్డి కుమ్మరి రాజయ్య కుమ్మరి నర్సింలు కుమ్మరి గోపాలు చాకలి మల్లయ్య కుమ్మరి గిరి కుమ్మరి గోపాల్ కుమ్మరి బిక్షపతి కుమ్మరి యాదగిరి తదితరులు పాల్గొన్నారు ఆర్థిక సహాయం  అందజేసిన జడ్పీటీసీ

Read More

ఇల్లందు మాజీ ఎంఎల్ఏ ఊకే అబ్బయ్య మృతి పట్ల తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన  మంత్రి  డాక్టర్ దనసరి అనసూయ సీతక్క ఇందూరు వార్త నవంబర్ 24 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మాజీ ఎంఎల్ఏ ఊకె అబ్బయ్య గత కొంత కాలంగా అనారోగ్యం తో భాదపడుతూ తుది శ్వాస విడువగా ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి సంతాపం తెలిపిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1983 లో తొలిసారి ఎంఎల్ఏ గా బుర్గం పాడు నియోజకవర్గం నుండి ఎంఎల్ఏ గా 1994,2009 లో ఇల్లందు ఎంఎల్ఏ గా సుదీర్ఘకాలంగా పని చేశారు అని ఆయన మృతి మమ్ముల ఎంతో కలిచి…

Read More