Author: indurvaartha (ఇందూర్ వార్త)

మారిన ఆహార అలవాట్లతో పెరుగుతున్న థైరాయిడ్ సమస్య థైరాయిడ్ హార్మోన్ల లోపం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు ఇది కంటి చూపు దెబ్బతీయడానికీ దారి తీస్తుందని చెబుతున్న నిపుణులు ఇందుర్ వార్త దమారిన జీవన శైలి, జన్యుపరమైన కారణాలు, సరైన పోషకాలు లేని ఆహారం తీసుకోవడం వంటి కారణాలతో థైరాయిడ్ సమస్య బారినపడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ఇందులో రెండు రకాల సమస్యలు ఉన్నాయి. థైరాయిడ్ హార్మోన్లు సరిగా ఉత్పత్తికాకపోవడం ‘హైపో థైరాయిడిజం’, థైరాయిడ్ అతిగా స్పందించడం ‘హైపర్ థైరాయిడిజం’ అని చెబుతారు. ఈ రెండింటితోనూ కంటి ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని… ముఖ్యంగా హైపర్ థైరాయిడిజంతో ఎక్కువ నష్టం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మన శరీరంలో థైరాయిడ్ గ్రంథి ఉండే ప్రదేశం దృశ్యాలన్నీ ఉబ్బెత్తుగా కనిపించడం… థైరాయిడ్ సమస్య ఏర్పడినప్పుడు కళ్ల వెనుక భాగంలో వాపు వచ్చి… కనుగుడ్లపై ఒత్తిడి పెరుగుతుంది. దీనితో అన్నీ కూడా ఉబ్బెత్తుగా (కుంభాకారంలో) కనిపిస్తుంటాయి.…

Read More

సమతా సైనిక్ దళ్ ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షుడు ఏసు పోగు నాగేశ్వరరావు సస్పెండ్ ఇందూర్ వార్త డిసెంబర్ 7 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి ఏ.పీ అధ్యక్షుడిగా ఉన్న నాగేశ్వరరావుని అధ్యక్ష పదవి నుంచి నేషనల్ సమతా సైనిక్ దళ్ కమిటీ ద్వారా తొలగించడం జరిగింది, సమతా సైనిక్ దళ్ సస్పెండ్ చేయడం ఎందుకనగా…… సమతా సైనిక్ దళ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ బ్రేక్ చేస్తూ బ్యానర్ లో కడపత్రాలలో స్టేట్ ,డిస్టిక్, మరియు నియోజకవర్గ కమిటీల్లో , మండల, విలేజ్ కమిటీ లేకుండా,సమతా సైనిక్ దళ్ రూల్స్ ప్రకారం నడవకుండా,, జాయిన్ అయినా రెండు సంవత్సరాల నుంచి స్టేట్ అధ్యక్షుడు అని చెప్పుకుంటూ స్టేట్ కమిటీ స్ వేయకుండా ,మినిమం ఉండాల్సిన 11 లీడర్స్ స్టేట్ కమిటీ పూర్తి చేయకుండా , అధ్యక్షుణ్ణి అని చెబుతూ పదవిని అనుభవిస్తూ తానొక్కడే స్టేట్ కమిటీ లో ఉండి. ….తను కు పదవి…

Read More

తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు విపక్ష నేతలను ఆహ్వానిస్తున్నట్లు వెల్లడి సచివాలయంలో ఈ నెల 9న విగ్రహావిష్కరణ ఉంటుందన్న మంత్రి ఈ విగ్రహావిష్కరణకు విపక్ష నేతలు రావాలని విజ్ఞప్తి ఇందుర్ వార్త తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లను ఆహ్వానిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇందుకోసం వారిని సమయం ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. వారు అపాయింట్ మెంట్ ఇస్తే ప్రభుత్వం తరఫున ఆహ్వానిస్తామన్నారు. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు విపక్ష నేతలను ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కేసీఆర్, కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లను ఆహ్వానిస్తామని సీఎం రేవంత్ రెడ్డి నిన్ననే చెప్పారని గుర్తు చేశారు. వారు ఈ నెల 9న జరగనున్న ఈ కార్యక్రమానికి రావాలని విజ్ఞప్తి చేశారు.

Read More

మోసాలకు ఉపయోగించే ‘మ్యూల్ ఖాతా’ల గుర్తింపులో చక్కటి పురోగతి ‘మ్యూల్‌హంటర్.ఏఐ’ టూల్‌ని ఉపయోగించాలని బ్యాంకులను ఆర్బీఐ సూచన అధునాతన ఆల్గారిథమ్‌తో సులభంగా మోసపూరిత ఖాతాల గుర్తింపు ఇందుర్ వార్త నేటి డిజిటల్ యుగంలో ఆర్థిక మోసాలను అరికట్టడం ఒక పెద్ద సవాలుగా మారిపోయింది. కొత్త కొత్త పద్దతుల్లో పుట్టుకొస్తున్న సైబర్ నేరాలు ఆందోళనలకు గురిచేస్తున్నాయి. అయితే ఆర్థిక మోసాలకు అడ్డుకట్టవేసేందుకు అధునాతన ఏఐ టూల్ అయిన ‘మ్యూల్‌హంటర్.ఏఐ’ను ఉపయోగించాలని బ్యాంకులను ఆర్బీఐ ప్రోత్సహిస్తోంది. శుక్రవారం ముగిసిన ద్రవ్య విధాన కమిటీ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ… ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ఈ మేరకు బ్యాంకులకు సూచన చేశారు. దీంతో ‘మ్యూల్‌హంటర్.ఏఐ’ టూల్ ఏంటి? ఇది ఎలా పని చేస్తుందనేది చర్చనీయాశంగా మారింది.    ఆర్బీఐకి సంబంధించిన ఆవిష్కరణల విభాగమైన ‘రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్’ ఈ అధునాతన ఏఐ టూల్‌ని రూపొందించింది. ఆర్థిక మోసాలకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో ఈ…

Read More

డీఎంకే హయాంలో అదానీ గ్రూప్ తో ఒప్పందాలు చేసుకోలేదన్న మంత్రి ప్రతిపక్ష పార్టీలు అసత్య ప్రచారం చేస్తున్నాయని మండిపాటు అన్నాడీఎంకే హయాంలో విద్యుత్ ఒప్పందం జరిగిందని వెల్లడి ఇందుర్ వార్త సౌర విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి ఎలాంటి కాంట్రాక్ట్ పై సంతకం చేయలేదని తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ తెలిపారు. గౌతమ్ అదానీని ముఖ్యమంత్రి స్టాలిన్ ఎప్పుడూ కలవలేదని చెప్పారు. అదానీ గ్రూప్ తో డీఎంకే హయాంలో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని అన్నారు.   అదానీని స్టాలిన్ కలవలేదని… అధిక ధరకు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నారంటూ ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. కొన్ని మీడియా సంస్థలు కూడా అసత్య కథనాలను ప్రచురిస్తున్నాయని అన్నారు. యూనిట్ కు రూ. 7.01 చొప్పున విద్యుత్ కొనుగోలు చేసిన అంశం సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉందని తెలిపారు.  అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో అదానీ గ్రూపుకు చెందిన 648 మెగావాట్ల సోలార్…

Read More

కిషన్ రెడ్డికి డీఎన్ఏ పరీక్షలు జరగాలన్న వ్యాఖ్యలకు శిక్ష తప్పదని హెచ్చరిక తెలంగాణ ప్రభుత్వం మోసపూరిత హామీలతో దగా చేస్తోందని విమర్శ ఏడాది కాలంలో ఏం చేశారని అన్ని వర్గాలూ ప్రశ్నిస్తున్నాయన్న బీజేపీ ఎంపీ ఇందుర్ వార్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన హోదాను, స్థాయిని మరిచి చిల్లర మాటలు మాట్లాడుతున్నారని బీజేపీ నేత, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కిషన్ రెడ్డికి డీఎన్ఏ పరీక్ష జరగాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలకు శిక్ష తప్పదని హెచ్చరించారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నివాళులర్పించిన ఈటల మాట్లాడుతూ… రాజ్యాంగ స్ఫూర్తిని ప్రధాని మోదీ సమున్నతంగా కాపాడుతున్నారన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న ప్రభుత్వాలు ప్రజలకు సేవకులుగా ఉండాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మోసపూరిత హామీలతో ప్రజలను దగా చేస్తోందని విమర్శించారు.ప్రజలకు ఏం మంచి చేశారని కాంగ్రెస్ ప్రభుత్వం సంబరాలు చేసుకుంటుందో చెప్పాలన్నారు. ప్రజాక్షేత్రంలో తాము ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామన్నారు.…

Read More

అయ్యప్ప స్వామిని ఆదర్శించిన భారతీయ జనతా పార్టీ సిరిపురం ఎర్రోళ్ల లక్ష్మణ్ ఇందూరు వార్తా వికారాబాద్ జిల్లా ప్రతినిధి వికారాబాద్ నుండి శబరిమలై వరికి పాదయాత్ర చేసి వచ్చిన సిరిపురం, కృష్ణారెడ్డి గురు స్వామికి ,సన్మాన కార్యక్రమం ఎర్రోళ్ల లక్ష్మణ్ గారు చేయడం జరిగింది, మా గ్రామంలోని సన్నిధానంలోని అయ్యప్ప స్వాములు గ్రామస్తులు వారికి భక్తి శ్రద్దలతో పాద పూజ చేసి వారిని సన్మానించడం జరిగింది, ఇట్టి సందర్భంలో వీరభద్ర అర్చకులు సంగమేశ్వర్ స్వామి, రాజిరెడ్డి స్వామి, మహేందర్ రెడ్డి స్వామి, పాల్గొనడం జరిగింది

Read More

హరీష్ రావు అక్రమ అరెస్టు పట్ల తీవ్రంగా ఖండించిన మంగంపేట బిఆర్ఎస్ పార్టీ నాయకులు మచబోయిన శ్రీకాంత్ (జిన్నారం మండలం మంగంపేట ప్రతినిధి డిసెంబర్ 5 వార్త) అక్రమంగా గౌరవ మాజీ మంత్రి మర్యులు ప్రస్తుత ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అక్రమంగా అరెస్టు చేసి అధికార పార్టీ పైశాచిక ఆనందాన్ని పొందుతూ బిఆర్ఎస్ పార్టీ నాయకుల పట్ల లేనిపోని ఆరోపణలు చేస్తూ కేసులు పెట్టినంత మాత్రాన ఎవరు కూడా భయపడేది లేదని అధికార పార్టీ నాయకులు కేవలం వాళ్ళ లబ్ధికోసం మాత్రమే మా పార్టీ నాయకులను అరెస్టులతో భయపడుతూ కాలం గడుపుతున్నారు ఇప్పటికైనా అధికార పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలపైన దృష్టి పెట్టి ఇచ్చిన ఆమీలు నెరవేరిచే విధంగా పనిచేయాలని మంగంపేట గ్రామ బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాచబోయిన శ్రీకాంత్ డిమాండ్ చేశారు

Read More

రిజిస్ట్రార్‌పై వస్తున్న అసత్య ప్రచారాలపై జేఎన్టీయూహెచ్ విద్యార్థులుగా మా స్పందన ఇందూర్ వార్త డిసెంబర్ 5 ఈ రోజు పత్రికల్లో వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవం. రిజిస్ట్రార్ ఒక ఆదర్శనీయమైన అడ్మినిస్ట్రేటర్‌గా, జేఎన్టీయూహెచ్ చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా, ప్రామాణికతతో మరియు సమర్థతతో పనిచేస్తున్నారు.వారితో పాటు ఉన్న విద్యార్థులుగా, రిజిస్ట్రార్ పరిపాలనకు మేము ఎప్పుడూ మద్దతుగా ఉంటాము. వారి నాయకత్వంలో జేఎన్టీయూహెచ్ వివిధ రంగాల్లో పురోగతి సాధిస్తుంది. పత్రికా మిత్రులకు విజ్ఞప్తి మీరు ప్రచురించే వార్తలు నిష్పాక్షికంగా మరియు నిజాలను మాత్రమే ప్రతిబింబించేలా ఉండాలి. అసత్య వార్తలు విశ్వవిద్యాలయ పరువును దెబ్బతీయడమే కాకుండా, అందరి ఆత్మవిశ్వాసాన్ని కూడా దెబ్బతీస్తాయి. కాబట్టి, రిజిస్ట్రార్ పై వచ్చిన వార్తల వెనుక నిజానిజాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాతే రాయాల్సిందిగా మనవి చేస్తున్నాం. హెచ్చరిక: ఆసత్య ప్రచారాలు విశ్వవిద్యాలయం గౌరవానికి హాని కలిగిస్తాయి. ఇలాంటి చర్యలను మేము ఖండిస్తున్నాం. జేఎన్టీయూహెచ్ విద్యార్థులుగా, రిజిస్ట్రార్ పక్కన నిలుస్తున్నాము. కాబట్టి, అసత్య…

Read More

ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాల సందర్భంగా మండల స్థాయి వ్యాసరచన పోటీలు ఇందూర్ వార్త ప్రభుత్వ ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం అయిన సందర్భంగా ఈరోజు ఘనంగా రాష్ట్రమంతా విద్యా దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు మండల విద్యాశాఖ అధికారి , విజయ్ కుమార్ తెలియజేశారు ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాల సందర్భంగా ఈరోజు మండల స్థాయి వ్యాసరచన పోటీలు జిల్లా పరిషత్ ఆత్మకూరు పాఠశాల మండలం యందు నిర్వహించబడినవి . ఈ పోటీలో వివిధ పాఠశాలల నుండి 23 మంది విద్యార్థులు పాల్గొన్నారు. “పునరుత్పాదక ఇంధన వనరులు” అను అంశముపై నిర్వహించబడ్డ వ్యాసరచన పోటీలో పాల్గొన్నారు. పోటీలో పాల్గొన్న విద్యార్థులందరికీ మరియు పండ్లు స్వీట్లు అందజేశారు . పాల్గొన్న విద్యార్థులలో ప్రథమ బహుమతి స్. శృతి తెలంగాణ ప్రభుత్వ మహాత్మ జ్యోతిరావు పూలే బాలికల పాఠశాల ద్వితీయ బహుమతి స్ హర్షిని కస్తూరిభా గాంధీ విద్యాలయం,…

Read More