Author: ఇందూర్ వార్త

నూతన ఎస్సై కి స్వాగతం పలికిన కాంగ్రెస్ నాయకులు రాజంపేట మండలానికి నూతనంగా వచ్చిన ఎస్సై పుష్పరాజ్ ని రాజంపేట మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్ర ప్రణీత్ రెడ్డి శాలువాతో సత్కరించి పూల పుష్పం అందజేశారు.వెంట మండల ఉపాధ్యక్షులు మాశెట్టి శ్రీధర్, బన్సీలాల్ నాయక్, సెక్రటరీ సంజీవ రెడ్డి, డివిజన్ ఎస్సి సెల్ అధ్యక్షులు మదన్,బిసి సెల్ ఉపాధ్యక్షులు బీరయ్య, జంగిటి సాయిలు, మండల యూత్ ఉపాధ్యక్షులు బాలరాజ్, గ్రామ అధ్యక్షులు గణేష్ నాయక్, యువ నాయకులు సుభాష్ నాయక్ ఉన్నారు..

Read More

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలి ఇందూరు వార్త ఆర్మూర్ ప్రతినిధి ఆగస్ట్03 భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఆర్మూర్ ఆర్డీవో ముందు ధర్నా నిర్వహించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయాలని భారత రైతు కూలీ సంఘం. రాష్ట్ర ఉపాధ్యక్షులు బొట్ల రాజు అన్నారు. ముఖ్య ఐఎఫ్టియు రామ్ క స్పందన రాష్ట్ర అధ్యక్షులు ఎస్ సుధాకర్ లు విధంగా అన్నారు. రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు, ఇల్లు, ఇండ్ల స్థలాలు, అరులైన వారందరికీ ప్రభుత్వ వాగ్దాన ప్రకారం పెన్షన్లు ఇవ్వాలని. రైతాంగ రుణాలను రద్దు చేయాలి. వెంటనే కొత్త రుణాలు ఇవ్వాలని. నిరుద్యోగ ఖాళీలపై శ్వేతపత్రం ప్రకటించి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, పోడు సాగుదారులకు పట్టాలి వాళ్ళని హక్కులు కల్పించాలని, వ్యవసాయ కార్మికులకు ప్రకటించిన 12000 రూపాయలు జీవన భృతిని వెంటనే అమలు చేయాలని.…

Read More

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను వెంటనే అమలు చేయాలి బి.దేవారం సీపీఐ ఎం.ఎల్ మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి  ఇందూరు వార్త ఆర్మూర్ ప్రతినిధి ఆగస్ట్03 సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని ఆగస్టు ఒకటి నుండి తొమ్మిదవ తేదీ వరకు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని కుమార్ నారాయణ భవన్ లో గోడ పత్రికలను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి బి.దేవారం సబ్ డివిజన్ కార్యదర్శి బి కిషన్ లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తొమ్మిది నెలలు గడుస్తున్నా నేటికీ ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయలేదని వారు అన్నారు. మరో వైపు విఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో ఒక్క రేషన్ కార్డులను కూడా ఇవ్వలేదని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన కొన్ని రోజుల్లోనే రేషన్…

Read More

బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయనికి సన్మానం.. పెద్ద కొడపగల్ ఇందూర్ వార్తా : వడ్లం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలాలో విధులు నిర్వహించి ఇటీవల బదిలీపై వెళ్లిన రామాంజనేయులను ఉపాధ్యాయులు,విద్యార్థులు గ్రామస్థులు ఘనంగా సన్మానించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ రామాంజనేయులు గత కొన్ని సంవత్సరాలుగా ఈ పాఠశాలలో పని చేసి బదిలీపై వెళ్తునందుకు ఒక వైపు ఆనందం మరో వైపు బాధ ఉన్నపటికీ ఉద్యోగ రీత్యా బదిలిలో వెళ్లడం సహజం అని అన్నారు.విద్యార్థులు ఉపాధ్యాయులు చెప్పినట్లు విద్య బోధనలు పాటిస్తూ మీ తల్లిదండ్రులతో పాటు పాఠశాలకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వల్లభరావు, ఉపాధ్యాయులు విద్యార్థులు గ్రామస్థులు పాల్గొన్నారు.

Read More

బదిలీపై వచ్చిన నూతన ఎస్సైకి సన్మానం నర్సాపూర్ ఆగస్టు 3 (ఇందూర్ వార్త ప్రతినిధి) నర్సాపూర్ పోలీస్ స్టేషన్ నుండి రాజంపేటకు బదిలీపై వెళ్లిన ఎస్సై పుష్పరాజ్ స్థానంలో సిద్దిపేట జిల్లా తోగుట నుండి నూతనంగా బదిలీపై వచ్చిన బి.లింగం శనివారం నర్సాపూర్ ఎస్సైగా బాధ్యతలు స్వీకరించారు. ఆయనను స్థానిక విలేకరులు భరత్ గౌడ్, బైలు పాటి గణేష్, పూర్ణ చంద్రారెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్సై లింగం మాట్లాడుతూ మండల ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ తమ సేవలను అందిస్తూ శాంతి భద్రతలకు పాల్పడతానని అన్నారు.

Read More

ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు  కౌడిపల్లి మండలంలో బిజెపి పార్టీ  జీరో స్థాయిలో ఉన్న పార్టీకి కౌడిపల్లి మండల్ సెక్రెటరీ కృష్ణ పార్టీకి సహకరించడమే కాకుండా పార్టీని ఒక స్థాయికి తీసుకెళ్లాడు గతంలో ఉన్న దానికంటే కౌడిపల్లి గ్రామంలో బిజెపి వైపు చాలామంది మొగ్గు చూపుతున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో తప్పనిసరిగా పార్టీకి కౌడిపల్లి గ్రామంలో అధికంగా ఓట్లు పడే అవకాశం ఉందని చెప్పవచ్చు కౌడిపల్లి మండలంలోనే కాకుండా పార్టీకి అడుగున ఆదరణ పెరుగుతుంది దీనికి కారణం మండల సెక్రెటరీ కృష్ణ. పార్టీకి సహకరించినటువంటి కృష్ణ బిజెపికి కట్టుబడి ఉంటారని తెలియజేశాడు. ప్రతి విషయంలోనూ బిజెపికి మద్దతు తెలుపుతూ అడుగడుగునా కాషాయం జెండాను ఎగరవేస్తామని తెలియజేశారు

Read More

ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు  వార్తా ప్రతినిధి రాజు మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గమైన కౌడిపల్లి మండలం నాగ్సన్ పల్లి గ్రామంలోని భూమికోసం పోలీస్ స్టేషన్ ఎదుట తమ భూమి కావాలంటూ అర్జీ పెట్టుకున్నారు కట్టుకున్న ఇంటికి రహదారి నిమిత్తం కావాలని కోరితే ఇంటి వెనక నుండి వెళ్లాలని తెలియజేశారు భూమి కోసం అర్జీ పెట్టుకున్న వ్యక్తులు తమకు రావలసిన భూమి తమ కేటాయించాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి నాగ్సన్ పల్లి గ్రామ వాసికి సహకరించాలని గ్రామ ప్రజలు తెలియజేశారు. సంవత్సరం నుండి తిరిగిన ఎలాంటి ప్రయోజనం లేకపోవడం ఇంటి వ్యక్తికి ఇబ్బందికరంగా మారింది   ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మా స్థలాన్ని మాకు ఇప్పించాలని వేడుకున్నారు

Read More

ఇందుర్ వార్త ప్రతినిధి రాజు మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గమైన కౌడిపల్లి మండలం తునికి గ్రామ శివారులో వెలసిన నల్ల పోచమ్మ ప్రత్యేకత ఆపద ఉంది అంటే ఆ భక్తుడికి కొండంత అండనిస్తుంది నమ్ముకున్న వారికి సకల సౌభాగ్యాలను చేకూరుస్తుంది.మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తునికి లోని నల్లపోచమ్మ ఆలయం జాతరకు ముస్తాబైంది. ఏటా హోలీ పండగ తర్వాత మూడో రోజు నుంచి వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. దీని ప్రత్యేకత ఏంటో తెలుసా మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తునికి లోని నల్లపోచమ్మ ఆలయం జాతరకు ముస్తాబైంది. ప్రతి ఏటా హోలీ పండగ తర్వాత మూడో వ రోజు నుంచి వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. భక్తులకోరిన కోరికలు తీరుస్తూ భక్తుల కొంగుబంగారంగా నిలిచిన నల్లపోచమ్మ వెలిసిన ఈ పుణ్యక్షేత్రాన్ని జాతర సమయంలో దర్శించుకోవడానికి స్థానికులే కాకుండా ఇతర జిల్లాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. ఈజాతర కోసం…

Read More

ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు కౌడిపల్లి బస్టాండ్ లో త్రాగడానికి మినరల్ వాటర్ ఏర్పాటు వేసవికాలంలో త్రాగునీరు ఏర్పాటురెండు సంవత్సరాలుగా మినరల్ వాటర్ సప్లై చేస్తున్న శ్రీధర్ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ప్రతిరోజు మినరల్ వాటర్ సప్లై చేస్తానుధర్మసాగర్ గ్రామస్తుడైన శ్రీధర్ ముందుకు రావడం విశేషంమెదక్ జిల్లా కౌడిపల్లి మండలం బస్టాండ్ పరిధిలో ప్రయాణికుల కోసం మినరల్ వాటర్ ను ఏర్పాటు చేయడం జరిగింది. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా నీటిని ఏర్పాటు చేయడం మంచి విశేషం అలాగే గత సంవత్సరం నుండి ధర్మసాగర్ గ్రామస్తుడైన శ్రీధర్ ఈ మినరల్ వాటర్ ని అందించడం ఎంతో గొప్ప విశేషం ప్రతిరోజు ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా మినరల్ వాటర్ ని ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుతానని శ్రీధర్ తెలియజేశాడు. మెదక్ డిపో మేనేజర్ సుధాకౌడిపల్లి బస్టాండ్ కు విచ్చేసి ప్రయాణికుల కోసం ఏర్పాటుచేసిన త్రాగునీటిని కొబ్బరికాయ కొట్టి ప్రయాణికులకు వాటర్ అందించడం జరిగింది. అలాగే…

Read More