- ఏజెన్సీ ప్రాంతాల్లో గౌడులకు న్యాయం చేయండి
- ఉచిత సిద్ధ వైద్య శిబిరాన్ని ప్రారంభించిన శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్
- ఆదివాసీ విద్యార్థుల ఉన్నత విధ్య కోసం ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలి
- ఘనంగా పాడి కౌశిక్ రెడ్డి జన్మదిన వేడుకలు.
- పృధ్వీరాజ్ చౌహాన్ విగ్రహ ప్రతిష్టకు స్థలం కేటాయించాలి
- అమిత్ షా ను అరెస్టు చేసి బర్తరఫ్ చేయాలి:
- తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవ సంస్థ ఆధ్వర్యంలో
- అమిత్ షా ,పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు..!
Author: indurvaartha (ఇందూర్ వార్త)
‘ది ఇన్నర్ వరల్డ్ ఆఫ్ చిల్డ్రన్” పుస్తక ఆవిష్కరణ చేసిన కలెక్టర్ : జితేష్ పాటిల్ ఇందూరు వార్త నంబర్ 14 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చైల్డ్ వైల్ఫేర్ కమిటీ సభ్యుడు న్యాయవాది మహమ్మద్ సాదిక్ పాషా రచించిన ”ది ఇన్నర్ వరల్డ్ ఆఫ్ చిల్డ్రన్” పుస్తకాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలేక్టర్ జితేష్ పాటిల్ ఆవిష్కరించారు. జిల్లా కలెక్టరేట్ లో జరిగిన బాలల దినోత్సవ వేడుకల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కలేక్టర్ బాలల సైకాలజీ పై సాదిక్ పాషా రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ విథ్య చందన, జిల్లా సంక్షేమ అధికారి లేనినా స్వర్ణలత, ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఛైర్పర్సన్ జీ.భారతరాణి, ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యురాలు యస్.సుమిత్ర దేవి, సేవ్ మున్సిపాలిటీ సేవ్ కొత్తగూడెం కన్వీనర్ మహమ్మద్ జలాల్ తదితరులు పాల్గొన్నారు.
స్థానిక రైతులతో కలిసి తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన అశ్వరావుపేట నియోజక వర్గం ఆదివాసీ నాయకులు తంబళ్ల రవి ఇందూరు వార్త నవంబర్ 14 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి అధికారులు నిర్లక్ష్యంతొ తడిసిన ధాన్యం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మార్కెట్ యార్డులో తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన ఆదివాసీ నాయకులు తంబల్ల రవి,అధికారుల నిర్లక్ష్యంతో నిన్న కురిసి వర్షానికి వడ్లు తడిచినవి,సిబ్బంది అందుబాటులో లేకపోవడం,బరకాలు అందించకపోవడం వల్ల ధాన్యం తడిసిందని రైతులు తీవ్ర అవేదన వ్యక్తం చేశారు,అధికారులకు ముందు జాగ్రత్త ఉండి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు అని,ఇకనైనా అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలని తంబల్ల రవి కోరారు,ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు పాల్గొన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి జర్నలిస్టుల పట్ల మాట మార్చడం సరికాదు – టిడబ్ల్యూజేఎఫ్ కామారెడ్డి జిల్లా నాయకులు ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం అర్హులైన ప్రతి జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలనీ టి డబ్ల్యూ జేఎఫ్ కామారెడ్డి జిల్లా నాయకులు అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చి, ఇండ్లు నిర్మించి ఇస్తామని చేసిన వాగ్దానాన్ని కచ్చితంగా నెరవేర్చాలనీ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కామారెడ్డి జిల్లా కమిటీ డిమాండ్ చేశారు. గురువారము కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాతీయ కౌన్సిల్ సభ్యుడు కృష్ణమాచారి మాట్లాడుతూ ఎన్నికలు అయిన తర్వాత అధికారంలోకి వచ్చిన పది నెలల తర్వాత ఈ నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని, మళ్లీ జరిగే ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తే ఇండ్ల స్థలాలు, ఇండ్లు ఇస్తామనడం సమంజము కాదన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల…
మణుగూరు ఏరియా సింగరేణి వైద్యశాల ప్రసూతి వైద్య నిపుణురాలిగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ జె. మౌనిక ఇందూర్ వార్త నవంబర్ 14ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతి నిధి ఆర్ పోలయ్య హర్షం వ్యక్తం చేసిన సింగరేణి ఉద్యోగులు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం పట్ల సింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్ (సి ఎం ఓ) కి కృతజ్ఞతలు తెలిపిన సామాజిక సేవకులు కర్నె బాబురావు మణుగూరు ఏరియా సింగరేణి కార్మికుల తరపున తమ అభ్యర్థనను మన్నించి మణుగూరు ఏరియా సింగరేణి ఆసుపత్రిలో ప్రతి గురువారం సింగరేణి ఉద్యోగుల కుటుంబాలకు చెందిన గర్భిణీ స్త్రీలకు వైద్య సేవలు అందించేందుకు అందుబాటులో ఉండే విధంగా డిప్యూటేషన్ పై ప్రసూతి వైద్య నిపుణురాలిని బాలల దినోత్సవం రోజున నియమించడం పట్ల ప్రముఖ సామాజిక సేవకులు కర్నె బాబురావు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్ పి. సుజాత కి పత్రికా ముఖంగా…
అమృత్ 2.0 కార్యక్రమం లో పాల్గొన్న ఎంపీ,ఎమ్మెల్యే జగిత్యాల నవంబర్ 14 ఇందూర్ వార్త ప్రతినిధి జగిత్యాల పట్టణం లో అమృత్ 2.0 కార్యక్రమం లో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త నిదులు 38 కోట్ల 60 లక్షలతో జగిత్యాల పట్టణానికి మంచి నీటి సరఫరా కార్యక్రమానికి ఎంపి ధర్మపురి అరవింద్ గారితో కలిసి భూమిపూజ చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్,మున్సిపల్ చైర్మన్ జ్యోతి లక్ష్మణ్. ఈ కార్యక్రమంలో కమిషనర్ చిరంజీవి,ఈ ఈ సంపత్ రావు,వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్,మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం,DE వరుణ్,AE లు,కౌన్సిలర్ లు,కో ఆప్షన్ సభ్యులు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.
జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను విజయవంతం చేయాలి – ఈనెల నవంబర్ 14 నుండి 20 తేది వరకు 57వ వారోత్సవాలు – హాజరుకానున్న మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లా కలెక్టర్ తదితరులు – సిద్ధిపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడెం లింగమూర్తి సిద్ధిపేట జిల్లా/టౌన్/నవంబర్14 ఇందూరు వార్త(ప్రతినిధి ఇన్యాలపు హరికృష్ణ) ఈనెల నవంబర్ 14 నుండి 20 తేది వరకు 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు సిద్ధిపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడెం లింగమూర్తి తెలిపారు. సిద్ధిపేటలో గ్రంథాలయం కార్యాలయంలో సిద్ధిపేట పట్టణ అధ్యక్షుడు అత్తుఇమామ్ తో కలిసి సిద్ధిపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడెం లింగమూర్తి మాట్లాడుతూ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా ఈనెల నవంబర్ 14 నుండి 20 తేది వరకు ప్రతిరోజూ పలు కార్యక్రమలు చిత్రలేఖనం వ్యాసరచన సుడోకో క్విజ్ పోటీ పుస్తక ప్రదర్శన ముగ్గుల పోటీ కవి సమ్మేళనంలను గ్రంథాలయంలో…
కొండాపూర్ మండలంలోని వివిధ పెళ్లి వేడుకలకు హాజరైన జననేత సతీష్ ముదిరాజ్ ఇందూర్ వార్త :సంగారెడ్డి జిల్లా :బ్యూరో గోపాలకృష్ణ: కొండాపూర్ మండలంలోని తీర్పు గ్రామ వాసి రుద్రారం నారాయణ మనవరాలు వివాహ వేడుకలో పాల్గొన్న సతీష్ ముదిరాజ్ మరియు అదే గ్రామానికి చెందిన కొండాపూర్ మండలానికి చెందిన జి యాదగిరి ఆర్టిఏ సంగారెడ్డి జిల్లా మాజీ మెంబర్ బి ఆర్ ఎస్ పార్టీ నాయకుని కుమారుడి వివాహం విందులో పాల్గొన్న సతీష్ ముదిరాజ్
సదరం కోసం తిప్పలు — స్లాట్ దొరకాలంటే నెలలపాటు — వెయిటింగ్ రిజక్ట్ అయితే మళ్లా బుకింగ్ అయితలే — ప్రభుత్వ ఆసుపత్రిలో సదరం శిబిరం ఇందూర్ వార్త నవంబర్ 13, కామారెడ్డి : జిల్లాలో సదరం సర్టిఫికెట్ కోసం స్లాట్ బుకింగ్ సమస్యగా మారుతోంది. స్లాట్ కోసం నెలల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. ఒకసారి రిజక్ట్ అయితే మళ్లీ బుక్ కాకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్ కీలకం. గతంలో జిల్లా హస్పిటల్లో వారానికి ఒక సారి స్పెషల్ క్యాంపు నిర్వహించి సర్టిఫికెట్ జారీ చేసేవాళ్లు. కానీ ఇటీవల ఆన్లైన్ బుకింగ్ తో స్లాట్స్ తీసుకొని క్యాంపునకు రావాలని రూల్ పెట్టారు. మీ సేవాలో స్లాట్ బుక్ చేసుకుంటే క్యాంపుకు రావాల్సిన డేట్ వస్తుంది. ఆ రోజునే దివ్యాంగులు జిల్లా హస్పిటల్కు రావాలి. అయితే వారానికి 50 స్లాట్లు మాత్రమే ఇస్తున్నారు. వందల మంది స్లాట్ల కోసం…
జగ్గారం గ్రామంలో ప్రశాంతంగా జరుగుతున్న సమగ్ర కుటుంబ సర్వే ఇందూరు వార్త నవంబర్ 14 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి జగ్గారం గ్రామంలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి రాజకీయ,కుల సర్వే (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే )ను ఎన్యుమరేటర్ ఇంటింటికి తిరిగి వివరాలు అడిగి నమోదు జరుగుతుంది..జగ్గారం (గుర్వాయిగూడెం) మారుమూల గిరిజన గ్రామ ప్రజలు సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ఎన్యుమరేటర్ లోకేశ్వరరావు కు పూర్తి సహకారం గ్రామ ప్రజలు అందించారు. ఈ యొక్క కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజక వర్గ సీనియర్ నాయకులు కారం శ్రీరాములు మరియు మడకం నరసింహారావు ,కారం మహేష్ తదితరులు ఉన్నారు.
శేషవాహనుడైన వేణుగోపాలుడు ఇందూర్ వార్త : వెబ్ డిస్క్ పిఠాపురం : రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి వారి వార్షిక కళ్యాణ వేడుకలకు సందర్భంగా స్వామి వారి కళ్యాణ ఉత్సవ విగ్రహాలను శేష వాహనంపై ఉంచి గ్రామోత్సవం జరిపించారు. ఆలయం వద్ద నుండి పెద్ద బజారు, కోటగుమ్మం సెంటర్, సినిమా సెంటర్ మీదుగా తిరిగి ఆలయం వరకు ఈ గ్రామోత్సవం సాగింది. దారి పొడవునా మహిళలు స్వామికి హారతులు అందించి, భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో అర్చకులు విజయ జనార్ధనాచార్యులు పూజాదికాలు జరిపించగా, కార్యనిర్వాహణాధికారి నున్న శ్రీరాములు ఏర్పాట్లు పర్యవేక్షించారు. దేవస్థానం సిబ్బంది సత్యనారాయణ, వేణుగోపాల స్వామి ఆలయ అభివృద్ధి సేవా సమితి ప్రెసిడెంట్ చెరుకుపల్లి శ్రీనివాస్, శ్రీరాంమోహన్, కొల్లూరి లక్ష్మీ ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.