Author: ఇందూర్ వార్త

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త కార్యక్రమానికి శ్రీకారం ప్రతి బుధ, శుక్రవారాలు మంత్రులు గాంధీభవన్‌ లో  అందుబాటులో ఉండాలి హైదరాబాద్‌:సెప్టెంబర్ 24 తెలంగాణ కాంగ్రెస్ సరికొత్త సాంప్రదాయానికి నాంది పలుకుతుంది, ఈనెల 25 నుంచి గాంధీభవన్ లో మంత్రులతో ప్రజలు ముఖాముఖి కార్యక్రమం ప్రారంభం కానుంది, వారంలో రెండు, మూడు రోజులపాటు గాంధీభవన్లో మంత్రులు అందుబాటులో ఉండేట్లు టీపీసీసీ అధ్యక్షు డు మహేష్‌కుమార్‌ గౌడ్‌ సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు తీసు కున్న తర్వాత ప్రజాపాలన ఇందిరమ్మ పాలన సాధనే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో పాటు అడుగులు వేస్తున్నారు. పార్టీ, గాంధీభవన్‌, కార్య కర్తలు లేకుండా ప్రభుత్వమే లేదని, కార్యకర్తలకు మంత్రులు అందుబాటులో ఉండాలని చేసిన సూచనల మేరకు బుధవారం నుంచి మంత్రులు గాంధీభవన్‌లో కార్యకర్తలకు అందుబాటు లో ఉండబోతున్నారు. ప్రతి బుధ, శుక్రవారాలు మంత్రులు గాంధీభవన్‌ రానున్నారు. పీసీసీ చీఫ్‌గా…

Read More

మీడియా సంస్థ అధిపతి ఇంట్లో ఐటీ సోదాలు… ఇందూరు వార్త బ్యూరో చీఫ్ టి రాజగోపాల్ ఇందూర్ వార్త సెప్టెంబర్ 24  హైదరాబాద్ కూకట్ పల్లి  రెయిన్ బో విస్తాస్ అపార్ట్ మెంట్ లో ఉన్న  ఐ బ్లాక్ లో 8 మంది ఐటి అధికారులు మంగళవారం ఉదయం 7 గంటల నుండి  మెరుపు దాడి చేసి సొధాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం ప్రముఖ వ్యాపారవేత్త ఓ మీడియా సంస్థకు చెందిన అధిపతి ఇంట్లో ఈ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం భారీ ఎత్తున నగదు బంగారం సీజ్ చేసినట్లు తెలుస్తోంది.

Read More

అన్నా విలేకర్ అన్న నీ బాధ్యత గొప్పది అన్న… మధుప్రియ గొంతులో ఆణిముత్యం పాట… విలేకరుల కష్టాలు నష్టాలు వివరించితూ సాగిన పాట.. ఇందూరు వార్త బ్యూరో చీఫ్ టి రాజ గోపాల్ వార్త హైదరాబాద్ సెప్టెంబర్ 23 ప్రముఖ గాయని చిన్న వయసులోనే అందరి మనసులు దోచుకున్న సింగర్ మధుప్రియ విలేకరుల కష్టాలు నష్టాలు తెలియజేస్తూ పాడిన పాట జర్నలిస్టులను ఎంతో ఆకట్టుకుంది. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఆమె పాడిన పాటలు ఆడపిల్లలపై ఆడపిల్లనమ్మా అని పాడిన పాటలు తెలుగు రాష్ట్రాలలో ప్రజల హృదయాలలో చిరకాల స్థాయిగా నిలిచిపోతాయి. ఏ గాయని గాయకులు విలేకరుల కష్టాలు బాధలు గమనించకపోయినా తను పాడిన అన్నా విలేకర్ అన్న పాట ఇప్పుడు రెండు రాష్ట్రాలలో చరిత్ర సృష్టించబోతుందని చెప్పవచ్చు.

Read More

కిష్టారెడ్డిపేటలో హైడ్రా కూల్చివేతలు… భారీ మూడు భవనాలు నేల మట్టం చేశారు ఇందూర్ వార్త సంగారెడ్డి జిల్లా బ్యూరో గోపాల కృష్ణ అమీన్పూర్ మున్సిపాలిటీ లోని కిష్టా రెడ్డి పేటలో లో హైడ్రా మళ్లీ దూకుడు పెంచింది. కొద్దిరోజులగా కూల్చివేత లకు దూరంగా ఉన్న హైడ్రా ఆదివారం మళ్లీ అక్రమ నిర్మాణాల కూల్చివేతల ప్రక్రియను మొదలు పెట్టారు. దీంతో చెరువులు, నాలాలు ఆక్రమించి నిర్మాణాలు చేసినవారి గుండెల్లో దడ మొదలైంది. ఈరోజు ఉదయo భూమిని ఆక్రమించి చేపట్టిన అక్రమణ నిర్మాణా లను కూల్చివేస్తున్నారు. నివాసం ఉన్న భవనాలను మినహాయించి మూడు భారీ అంతస్తులను హైడ్రా కూల్చివేసింది. కూల్చివేతల నేపథ్యంలో భారీగా పోలీసులు అక్కడ మోహరించారు అయితే, దీనిలో ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో ఏడు ఎకరాలు ఆక్రమణకు గురైంది. బఫర్ జోన్లోని నాలుగు ఎకరాల్లో 25 కు పైగా పక్కా భవనాలు, అపార్టు మెంట్లు నిర్మించారు. ఎఫ్టీఎల్ లోని మూడు ఎకరాల్లో 25…

Read More

కూకట్ పల్లి నల్ల చెరువులో నేడు హైడ్రా కూల్చివేతలు! హైదరాబాద్:సెప్టెంబర్ 22 హైదరాబాద్ మహా నగరం లో హైడ్రా మళ్లీ దూకుడు పెంచింది. కొద్దిరోజులగా కూల్చివేత లకు దూరంగా ఉన్న హైడ్రా బృందం.. ఆదివారం మళ్లీ అక్రమ నిర్మాణాల కూల్చివేతల ప్రక్రియను మొదలు పెట్టారు. దీంతో చెరువులు, నాలాలు ఆక్రమించి నిర్మాణాలు చేసినవారి గుండెల్లో దడ మొదలైంది. ఉదయాన్నే కూకట్ పల్లిలోని నల్ల చెరువు ప్రాంతానికి చేరుకున్న హైడ్రా బృందం.. చెరువు భూమిని ఆక్రమించి చేపట్టిన అక్రమణ నిర్మాణా లను కూల్చివేస్తున్నారు. నివాసం ఉన్న భవనాలను మినహాయించి 16 షెడ్లను హైడ్రా కూల్చివేస్తోంది. కూల్చివేతల నేపథ్యంలో భారీగా పోలీసులు అక్కడికి మోహరించారు.కూకట్ పల్లి లోని నల్లచెరువు మొత్తం విస్తీర్ణం 27 ఎకరాలు. అయితే, దీనిలో ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో ఏడు ఎకరాలు ఆక్రమణకు గురైంది. బఫర్ జోన్లోని నాలుగు ఎకరాల్లో 50కిపైగా పక్కా భవనాలు, అపార్టు మెంట్లు నిర్మించారు. ఎఫ్టీఎల్ లోని…

Read More

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన కీచక అధ్యాపకులు గంభీరావుపేట సెప్టెంబర్ 20 ఇందూర్ వార్త ప్రతినిధి గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న భౌతిక శాస్త్ర, ఇంగ్లీష్ అధ్యాపకులు విద్యార్థులకు మార్గదర్శకంగా ఉండి విద్యాబుద్ధులు నేర్పాల్సిన అధ్యాపకులు సమాజం తలదించుకునేలా విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. విద్యార్థినిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం శుక్రవారం వెలుగులోకి వచ్చింది, గత కొంతకాలంగా విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్లు మొబైల్ ఫోన్లో అసభ్యకరమైన మెసేజ్ లు పంపించడం, విద్యార్థిని లు తల్లిదండ్రులకు తెలపడంతో తల్లిదండ్రులు కళాశాలకు వెళ్లి అధ్యాపకులను నిలదీశారు, అధ్యాపక వృత్తిలో ఉండిఇలాంటి కార్యక్రమాల కు పాల్పడటం ఏమిటి అని మందలించారు, ఇకముందు అలాంటివి జరగవని అధ్యాపకులు తల్లిదండ్రులను క్షమాపణ కోరారు. విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన మాటవాస్తవమేఅనితప్పు,ఒప్పుకోవడంతోఇకముందు ఎటువంటి తప్పు జరిగిన, తాము పూర్తి బాధ్యత వహిస్తామని తల్లిదండ్రులతో రాతపూర్వకంగా అధ్యాపకులు విద్యార్థినుల తల్లిదండ్రులకు వ్రాసి…

Read More

ఇందూర్ వార్త : హనుమకొండ జిల్లా కేంద్రంలో  మండలం అడ్వకేట్స్ కాలనీ లో ఆకృతి ఇన్ఫ్రా డెవలప్మెంట్ ఆఫీసును గురువారం చైర్మన్ బానోతు రవీందర్ నాయక్ ప్రారంభించారు. ఈ  సందర్భంగా చైర్మన్  మాట్లాడుతూ ఆకృతి ఇన్ఫ్రో డెవలప్మెంట్ వారి ఆధ్వర్యం లో  సామాన్య మధ్య తరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండే విధంగా లే అవుట్ ఫ్లాట్స్ రింగ్ రోడ్ కి ఆనుకొని ఆరేపల్లి నుండి పెద్ద పెండ్యాల వరకు తక్కువ ధరలో సామాన్యులకు అందుబాటులో ఉంటాయని  తెలిపారు. ఈ కార్యక్రమంలో   బైరగోని ప్రభాత్ కుమార్ దండు భాస్కర్ రెడ్డి లా వుడియా రాజు నాయక్ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అట్రసిటీ మెంబర్ నూనవత్ జవహర్ లాల్ నాయక్,కృష్ణ ప్రసాద్, మోహన్ నాయక్,నవీన్, ప్రవీణ్, కరంటోత్ తిరుపతి నాయక్, లకావత్ సుమన్, తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా చైర్మన్  రవీందర్ నాయక్ ని శాలువాతో సన్మానించారు. 

Read More

మానవత్వం చాటుకున్న కుమారి ఆంటీ! సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చెక్కు అందించిన కుమారి ఆంటీ ఈ సాయంతో.. అందరికీ ఆదర్శంగా నిలుస్తూ..మరో మెట్టు ఎక్కేసిన కుమారి ఆంటీ   ఇందూర్ వార్త , వెబ్ డెస్క్ :సెప్టెంబర్ 19

Read More

జమిలి ఎన్నికలపై కేటీఆర్ అనుమానాలు వచ్చే ఎన్నికల్లో అన్ని ప్రభుత్వాలు రద్దు చేస్తారా అని అనుమానం పూర్తి క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ ఇందూర్ వార్త : వెబ్ డెస్క్ సెప్టెంబర్ 19 దేశంలో జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఒకే దేశం ఒకే ఎన్నికపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇచ్చిన నివేదికకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వచ్చేసారి నుంచే జమిలి ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ప్రకటించటం.. ఇప్పుడు దేశమంతా హాట్ టాపిక్‌గా మారింది. ఈనేపథ్యంలో.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. జమిలి ఎన్నికల గురించి పలు అనుమానాలు వ్యక్తం చేశారు. జమిలి ఎన్నికలపై కేంద్రం క్లారిటీ ఇవ్వాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. వచ్చేసారి నుంచి జమిలి ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించిన నేపథ్యంలో.. దేశంలోని అన్ని ప్రభుత్వాలను రద్దు చేస్తారా అని కేంద్రాన్ని కేటీఆర్ ప్రశ్నించారు. జమిలి…

Read More

మంత్రి  సీతక్క  ఇలాకాలో తొలి కంటైనర్  పాఠశాల ప్రారంభం ఇందూర్ వార్త , హైదరాబాద్:సెప్టెంబర్ 18 రాష్ట్రంలో తొలి కంటెయినర్ స్కూల్ అందుబాటులోకి వచ్చింది. తొలిసారిగా మలుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ప్రభుత్వ స్కూల్‌ను కంటెయినర్‌లో ఏర్పాటు చేశారు. ఈ పాఠ‌శాల‌ను పంచా య‌తీ రాజ్, గ్రామీణాభి వృద్ది, మ‌హిళా శిశు సంక్షేమ శాఖ‌ల మంత్రి సీత‌క్క ప్రారంభించారు.  ములుగు జిల్లా కన్నాయి గూడెం మండలంలోని కాంతనపల్లి అటవీ ప్రాంతంలో బంగారుపల్లి ఆవాస గ్రామం ఉంది. ప్ర‌స్తుతం గుడిసెలో న‌డుస్తున్న పాఠ‌శాల శిధిలావ‌స్త‌కు చేరుకుంది. అయితే అట‌వి ప్రాంతం కావ‌డంతో కొత్త పాఠశాల భవన నిర్మాణానికి అటవీ అధికారులు అనుమతులి వ్వలేదు. దీంతో ఇక్క‌డ కంటెయిన‌ర్ పాఠ‌శాల ఏర్పాటుకు మంత్రి సీత‌క్క శ్రీకారం చుట్టారు. ములుగు నియోజ‌క‌వ‌ర్గం లోని తాడ్వాయ్ మండ‌లం లో కంటైనర్ ఆసుప‌త్రిని మంత్రి సీత‌క్క అందుబా టులోకి తేవ‌డంతో స్థానిక ప్ర‌జ‌ల‌కు వైద్య సేవ‌లు అందుతున్నాయి. అదే…

Read More