కళ్యాణ లక్ష్మి చెక్కు కోసం డబ్బులు వసూల్ చేసిన కాంగ్రెస్ నేత
హోటల్లో పనిచేస్తూ బిడ్డ పెళ్లి చేసిన మహిళను కూడా వదలని వైనం
ఇందూర్ వార్త : సిరిసిల్ల జిల్లా
రెండు రుపాయల వడ్డీకి అప్పు తెచ్చి పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి చెక్కు ఇవ్వట్లేదు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటు గోడు వెళ్లబోసుకున్న మహిళ రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం ఇందిరమ్మ కాలనీకి చెందిన చంద్రకళ అనే మహిళ తన బిడ్డ పెళ్లి చేయగా ప్రభుత్వం ఇచ్చే లక్ష రూపాయల కళ్యాణ లక్ష్మి చెక్కు ఇప్పిస్తా అంటే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గడ్డం మధుకర్ (చోటు) అనే యువకుడికి రూ. 7000 ఇచ్చింది.
శనివారం కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం ఉండగా 178 లబ్దిదారుల లిస్టులో తన పేరు లేకపోవడంతో ఆగ్రహంతో అక్కడే ఉన్న ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వద్ద ఈ విషయం చెప్పి వాపోయింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే చోటును పిలిచి మందలించాడు.