అన్నా విలేకర్ అన్న నీ బాధ్యత గొప్పది అన్న… మధుప్రియ గొంతులో ఆణిముత్యం పాట…
విలేకరుల కష్టాలు నష్టాలు వివరించితూ సాగిన పాట..
ఇందూరు వార్త బ్యూరో చీఫ్ టి రాజ గోపాల్
వార్త హైదరాబాద్ సెప్టెంబర్ 23 ప్రముఖ గాయని చిన్న వయసులోనే అందరి మనసులు దోచుకున్న సింగర్ మధుప్రియ విలేకరుల కష్టాలు నష్టాలు తెలియజేస్తూ పాడిన పాట జర్నలిస్టులను ఎంతో ఆకట్టుకుంది. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఆమె పాడిన పాటలు ఆడపిల్లలపై ఆడపిల్లనమ్మా అని పాడిన పాటలు తెలుగు రాష్ట్రాలలో ప్రజల హృదయాలలో చిరకాల స్థాయిగా నిలిచిపోతాయి. ఏ గాయని గాయకులు విలేకరుల కష్టాలు బాధలు గమనించకపోయినా తను పాడిన అన్నా విలేకర్ అన్న పాట ఇప్పుడు రెండు రాష్ట్రాలలో చరిత్ర సృష్టించబోతుందని చెప్పవచ్చు.