ఇందుర్ వార్త ప్రతినిధి రాజు
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గమైన కౌడిపల్లి మండలం తునికి గ్రామ శివారులో వెలసిన నల్ల పోచమ్మ ప్రత్యేకత ఆపద ఉంది అంటే ఆ భక్తుడికి కొండంత అండనిస్తుంది నమ్ముకున్న వారికి సకల సౌభాగ్యాలను చేకూరుస్తుంది.
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తునికి లోని నల్లపోచమ్మ ఆలయం జాతరకు ముస్తాబైంది. ఏటా హోలీ పండగ తర్వాత మూడో రోజు నుంచి వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. దీని ప్రత్యేకత ఏంటో తెలుసా మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తునికి లోని నల్లపోచమ్మ ఆలయం జాతరకు ముస్తాబైంది. ప్రతి ఏటా హోలీ పండగ తర్వాత మూడో వ రోజు నుంచి వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. భక్తులకోరిన కోరికలు తీరుస్తూ భక్తుల కొంగుబంగారంగా నిలిచిన నల్లపోచమ్మ వెలిసిన ఈ పుణ్యక్షేత్రాన్ని జాతర సమయంలో దర్శించుకోవడానికి స్థానికులే కాకుండా ఇతర జిల్లాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. ఈజాతర కోసం నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మొదలై నుండి నాలుగు రోజుల పాటు జాతర కొనసాగనుంది.
వందేళ్ల చరిత్ర కలిగిన ఆలయం
ఈ ఆలయాన్ని వందేళ్ల కిందట నిర్మించినట్లు చరిత్ర ఉంది. తునికి గ్రామానికి చెందిన ముచ్చర్ల లింగారెడ్డి అనే భక్తుడికి గ్రామ శివారులోని పురాతన శివాలయం వద్ద అమ్మవారి విగ్రహం కనిపించగా విషయాన్ని గ్రామ పెద్దలకు చెప్పారు. దీంతో అందరు కలిసి అమ్మవారి మను ఎడ్లబండిపై గ్రామంలోకి తీసుకొస్తుండగా కొద్దిదూరం వచ్చి గెగ్గ ఇప్పచెట్టు వద్ద ఆగిపోయిందట. అక్కడే విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేయడం మొదలు పెట్టారు. ఇదే గ్రామానికి చెందిన నాయబాబ్, మాచర్ల బొంతయ్య, లింగారెడ్డి జాతర నిర్వహణకు శ్రీకారం చుట్టారు.
అదే సంప్రదాయంగా మారింది
ఈ జాతర మహోత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని జాతరను విజయవంతంగా పూర్తి చేస్తారు అమ్మవారికి ముక్కులు చెల్లించుకుని తమ యొక్క కోరికలను కోరుకుని మళ్ళీ వచ్చే సంవత్సరం అమ్మవారి జాతర మహోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి నైవేద్యం సమర్పించి అగ్నిగుండాలు అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి భక్తులకు ఇలాంటి ఇబ్బందులు కలవకుండా అన్ని ఏర్పాటు చేశామని తెలియజేశారుమరియు కార్యనిర్వాహణాధికారి మోహన్ రెడ్డి ఆలయ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి
వి ప్రభాకర్ చారి డైరెక్టర్ ఆర్ మహేందర్ నాయక్ డైరెక్టర్ తల్లా శ్రీకాంత్ రెడ్డి డైరెక్టర్ నారాయణరెడ్డి డోనర్ సెల్ల పర్వతాలు డైరెక్టర్ కె లక్ష్మీనారాయణ గౌడ్ డైరెక్టర్ అనుమొల రాములు డైరెక్టర్ తలారి బిక్షపతి డైరెక్టర్ శివప్ప పూజారి జూనియర్ అకౌంట్ వెంకట్ డైరెక్టర్ జాతర మహోత్సవానికి సహకరించిన ఆలయ కమిటీ సిబ్బందికి మా పేపర్ తరపు నుండి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.