పోతంగల్ లో ఇండియన్ బ్యాంక్ ప్రారంభము
ఇందూర్ వార్త / సెప్టెంబర్ 18 / కోటగిరి.
పోతంగల్ మండల కేంద్రంలోని ఇండియన్ బ్యాంకు ను హైదరాబాద్ ఫీల్డ్ జనరల్ మేనేజర్ రాజేశ్వర్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ… పోతంగల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేయడం ఇది 83వ బ్రాంచ్ అని అన్నారు.ఖాతాదారులు ఈ అవకాశాన్ని వినియోగించు కోవాలని సూచించారు. వ్యాపారం టెక్నీకల్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్,ఇవ్వడం జరుగుతుందని అన్నారు .కస్టమర్లకు సర్వీస్ ఇవ్వడంలో చాలా అవార్డులు వచ్చాయని అన్నారు. త్వరలో ఏటీఎం ప్రారంభం అవుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో కరీంనగర్ జోనల్ మేనేజర్ రాజ్ కుమార్, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ అశోక్ చౌహన్,బ్యాంకు మేనేజర్ అరవింద్, రమేష్ సెట్, గంధపు పవన్, శంకర్ పటేల్,మరియు కస్టమర్లు, గ్రామస్తులు, తదితరులు, పాల్గొన్నారు.