ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు
రైతులు ఉచిత పశువైద్యశిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కౌడిపల్లి పశువైద్యాధికారి రాజు అన్నారు. బుధవారం కౌడిపల్లి మండలం బుజరంపేట గ్రామంలో విజయ డైరీ,పశుగణాభివృద్ది సంస్థ
మెదక్ మరియు కౌడిపల్లి పశువైద్య, పశుసంవర్ధక వారి అద్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా కౌడిపల్లి పశువైద్యదికారి రాజు మాట్లాడుతూ ఈ రోజు నిర్వహించిన శిబిరంలో 10 ఉచిత కృత్రిమ గర్భధారణ,28 దూడలకు నట్టాల నివారణకు మందులు త్రాగించడం,20 గర్భకోశ వ్యాధులను గుర్తించి చికిత్స,సాధారణ చికిత్సలు 30 పశువులకు చేయడం జరిగిందని తెలిపారు.పశుసంవర్ధక శాఖ అద్వర్యం లో ఏర్పాటు చేసిన పశువైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకుని తమ పశువులను కాపాడుకోవాలని,ఏవైనా సమస్యలు ఉంటే తమకు తెలియజేయాలని రైతులకు సూచించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ వనజ శ్యామ్ సుందర్,ఉప సర్పంచ్ సాయిలు,ఎంపిటిసి లింగం, జేవివో కృష్ణ కుమార్, వెటర్నరీ అసిస్టెంట్ చెన్నయ్య,పంచాయతీ సెక్రటరీ రాజిరెడ్డి, విజయ డైరీ భారత్ గోపాల మిత్ర సూపర్ వైసార్ శ్రీనివాస్ రెడ్డి,గోపాలమిత్రాలు శ్రీకాంత్,మనయ్య,ప్రవీణ్, కవిత,దీపక్,విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు