ఆదివాసీ విద్యార్థుల ఉన్నత విధ్య కోసం ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలి
ఇందూర్ వార్త డిసెంబర్ 22ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతి నిధి ఆర్ పోలయ్య
మంత్రి సీతక్క నేతృత్వంలో సీఎం రేవంత్ రెడ్డి కి ఆదివాసీ ఎమ్మెల్యేల వినతి పత్రం
మీడియా సమావేశంలో వివరించిన ఎమ్మెల్యే జారె
హైదరాబాద్ తెలంగాణ సచివాలయంలో మంత్రి సీతక్క ఆధ్వర్యంలో ఆదివాసీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలసి
ఆదివాసి విద్యార్థుల సమస్యలు విన్నవించి ముఖ్యంగా గత 70 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క ఆదివాసీ విద్యార్థికి కూడా ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ఉన్నత కేడర్లలో అవకాశం రాలేదని ఉన్నత చదువుల కోసం ఆదివాసీల ఆర్థిక పరిస్థితులు సహకరించటం లేదని ప్రభుత్వం పెద్ద మనసుతో ప్రత్యేక దృష్టి సారించి ఆదివాసీ విద్యార్థుల కోసం హైదరాబాదులో ప్రత్యేక సివిల్ కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం కనీసం 500 మంది విద్యార్థినీ విద్యార్థులు శిక్షణ పొందేలా చర్యలు తీసుకోవాలన్నారు అందుకోసం ప్రత్యేకంగా హాస్టల్లు కేటాయించాలన్నారు. అలాగే రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలలో జేఈఈ నీట్ కోచింగ్ సెంటర్లను ఆదివాసీలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. జాతీయస్థాయిలో ఎంబీబీఎస్ ఇంజనీరింగ్ తో పాటు ఉన్నత స్థానాలకు ఎంపికైన విద్యార్థులకు ఐటీడీఏ ద్వారా ఆర్థిక సహాయం అందించి ఆదివాసీ విద్యార్థులకు లబ్ధి చేకూరేలా కృషి చేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఐటీడీఏ బిల్డింగ్స్ రెనోవేషణ్ కోసం 15 కోట్ల చొప్పున నిధులు కేటాయించాలని కోరారు
పోడు పట్టాలు పొందిన రైతులకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందజేయాలన్నారు
పై విషయాలన్నింటినీ వినతి పత్రం రూపంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి అందించామని మీడియా సమావేశంలో ఎమ్మెల్యే
జారె ఆదినారాయణ వెడ్మ బొజ్జుపటేల్ వివరించారు.
ఈ కార్యక్రమంలో సహచర ఎమ్మెల్యేలు కోరం కనకయ్య , పాయం వెంకటేశ్వర్లు గ, జిహెచ్ఎంసి చీఫ్ మెడికల్ఆఫీసర్ డాక్టర్ పద్మజ , ప్రొఫెసర్ గుమ్మడి అనురాధ , ప్రొఫెసర్ కిషోర్ , రిటైర్డ్ అధికారి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు…