ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు
మెదక్ జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న బస్టాండ్లు వాడుకలో లేవు వాటిని అధికారులు పట్టించుకోవడం లేదు
గ్రామీణ ప్రాంతాలంటే అధికారులకు ఎప్పుడు చులకనే
మెదక్ నుండి హైదరాబాద్ వెళ్లే మార్గంలో కొల్చారం మండలంలోని అప్పాజీపల్లి కొల్చారం దగ్గర ఉన్నటువంటి బస్టాండ్లను అధికారులు పట్టించుకోకపోవడం వల్ల రాత్రి సమయాలలో జూదంకు అడ్డాగా మారుతున్నాయి అలాగే కౌడిపల్లి మండలంలోని ధర్మసాగర్ గేట్ అంతారం గేట్ వెంకట్రావుపేట్ వెంకట్రావుపేట్ గేట్ దగ్గర ఉన్నటువంటి బస్టాండ్ తొలగించారు అదే స్థలంలో ఇప్పటివరకు కొత్త బస్టాండుకు పునాది కూడా వేయలేదు
ఇలా మెదక్ జిల్లా వ్యాప్తంగా అధికారులు పట్టించుకోకుండా వదిలివేసిన బస్టాండ్లు చాలా ఉన్నాయి ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకొని బస్టాండ్లను ప్రయాణికులకు వాడుకలోకి తీసుకురావాలని ప్రయాణికులు కోరుతున్నారు