ముత్యంపేట కామరతి బీరప్ప పండక్కు విచ్చేసిన అసెంబ్లీ ఇంచార్జ్ కటిపల్లి వెంకట రమణ రెడ్డి
ఇందూర్ వార్త
దోమకొండ డిసెంబర్ 26
కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం ముత్యంపేట గ్రామంలో సోమవారం రోజున కామరాతి బీరప్ప పండుగ మహోత్సవ వేడుకలు ఈ నెల 23 న నుండి 30 వ తేది వరకు కమరాతి బీరప్ప పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు సోమవారం రోజున కామరాతి బీరప్ప పండుగ మహోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కామారెడ్డి అసెంబ్లీ ఇంచార్జ్ కాటిపల్లి వెంకట రమణారెడ్డి కల్యాణ మహోత్సవానికి విచ్చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీరప్ప కామరాతి బీరప్ప కల్యాణ మహోత్సవానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా స్వాగత సుమాంజలి చెప్పడం జరిగింది కురుమ సోదరులు అందరికీ కూడా ధన్యవాదములు తెలిపారు బీరప్ప కామరాతి వేడుకలకు నన్ను ఆహ్వానించడం నాకెంతో సంతోషకరంగా ఉందని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో దోమకొండ బిజెపి మండల అధ్యక్షులు చింతల రాజేష్, ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు మహేందర్ గౌడ్ ,రవి గౌడ్, ముత్యంపేట గ్రామ బిజెపి టౌన్ ప్రెసిడెంట్ బుచ్చి రాజు, అదేవిధంగా కురుమ సంఘం చింపల బిరయ్య, ముత్తీ ఆశయ్య, ధరిణి బిరయ్యా, ముత్తి లక్ష్మణ్, చిగుళ్ల దేవరాజ్, దొందరి కాంతు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగినది