పిల్లలే కాదు పెద్దలు కూడా సరైన వైద్యం అందక చనిపోతున్నారు
ఇందూరు వార్త నవంబర్ 18 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కమ్యూనిటీ హెల్త్ కేంద్రంగా మార్చండి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు
మండలంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ గా మారక మండల పరిధిలో ఉన్న పేదలకు సరైన వైద్యం అందక అనారోగ్యంతో ప్రజలు పిట్టల రాలుతున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కమ్యూనిటీ హెల్త్ కేంద్రంగా మార్చాలని బహుజన్ సమాజ్ పార్టీ మండల అధ్యక్షులు తంబర్ల నరసింహారావు డిమాండ్ చేశారు మండల పరిధిలో ఉన్న అనంతరం గ్రామానికి చెందిన సాహితి ఎనిమిది సంవత్సరాలనే పాప వారం రోజుల క్రితం జ్వరం వచ్చి సరైన వైద్యం అందక మృతి చెందింది అదేవిధంగా కొన్ని గ్రామాలలో పెద్దలు కూడా అనారోగ్యంతో సరైన వైద్యం అందక మృతి చెందిన దాఖలాలు చాలానే ఉన్నాయి ఇలా మండల పరిధిలో ఉన్నటువంటి పేదల ప్రాణాలు ఇకముందు పోకుండా ఉండాలి అంటే మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కమ్యూనిటీ హెల్త్ కేంద్రంగా మార్చాలని అలా మార్చకుంటే ఇంకా ఎంతోమంది పిల్లల పెద్దలు అనే తేడా లేకుండా ఎన్నో ప్రాణాలు పోవాల్సి వస్తుందని ఆయన అన్నారు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ గా అభివృద్ధి చేయాలని వారన్నారు