దేశానికి, బీజేపీ పార్టీకి అటల్ బిహారీ వాజపేయి సేవలు మరువలేనివి
ఆ మహనీయుని అడుగుజాడల్లోనే ప్రతి బీజేపీ కార్యకర్త నడుస్తున్నాడు
ఆయన ఆశయాల సాధనకు మోదీ గారు కృషి చేస్తున్నారు
బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి
భారతీయ జనతా పార్టీ కామారెడ్డి జిల్లా శాఖ ఆద్వర్యంలో బహుముఖ ప్రజ్ఞాశలి రాజకీయ దురంధరుడు శత్రు దేశములకు చెమటలు పట్టించి భారతదేశమునకు వన్నెను తెచ్చిన భరతమాత ముద్దుబిడ్డ నిష్కలంక రాజకీయ జీవితంతో ప్రజలకు సుపరిపాలన అందించిన భారత పూర్వ ప్రధాని భారత రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పాయ్ గారి జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆ మహనీయుని చిత్ర పటానికి పూల మాల వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ పార్టీకి అటల్ బిహారీ వాజపేయి గారి సేవలు మరువలేనివనీ, ఆ మహనీయుని అడుగుజాడల్లోనే ప్రతి బీజేపీ కార్యకర్త నడుస్తున్నానీ,
అధికారం వస్తుంది పోతుంది, పార్టీలు వస్తాయి పోతాయి. కానీ ఈ దేశం ఎప్పటికీ నిలిచే ఉంటుంది. మేము అధికారాన్ని మాత్రమే వదిలేస్తున్నాము అంతేకానీ ఈ దేశం పట్ల మాకున్న బాధ్యతని కాదు, ఎన్నికల్లో ఓడిపోయినా మా జీవితం ఈ దేశ సేవకే అంకితమని హితోపదేశం చేసిన ఆ నాటి గొప్ప మాటలు ప్రతి బీజేపీ కార్యకర్త గుర్తుంచుకోవాలి అని, ఇలాంటి మహినీయుల ఎనలేని కృషి వల్లే నేడు మన భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించి నేడు భారత దేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు మోడి జీ నాయకత్వంలో ముందుకు సాగుతుందనీ అన్నారు.