దామరంచలో అక్రమ మొరం తవ్వకాలు
ఇందూర్ వార్త
బీర్కూర్ 22 డిసెంబర్
బీర్కూరు మండలంలోని దామరచ గ్రామంలో అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా జెసిబి లతో మొరం తవ్వకాలు కొనసాగిస్తున్నారు, జెసిబి లతో మొరంతోవి టిప్పర్ లో లోడ్ చేసుకొని దామరంచ గ్రామంలోని ఇటుకబట్టిలో పోస్తున్నారు అలాగే టిప్పర్ ద్వారా పోచారం తండలో అలాగే తాడుకోల్లో పోయడం జరుగుతుంది, ఎమ్మార్వో పర్మిషన్ ఉందని అడిగితే డబ్బా ఇస్తున్నారు అలాగే బెదిరిస్తున్నారు, ఈ జెసిబి తాడిపల్ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించడం జరిగింది, ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి అక్రమ మొరం తవ్వకాలను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు, ఇప్పటికైనా అధికారులు స్పందించి జెసిబి యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు