ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు
———-ఇందూర్ వార్త మెయిన్ పేజీ———
దళిత సీఎం అంటివి దళితులను దరిదాపులకు రానీయకుండా ఉంచితివి
దళితులకు మూడెకరాల పొలం ఇస్తా అంటివి మూడు అడుగుల జాగైనా ఇప్పటివరకు ఇవ్వకపోతివి
రైతును రాజు చేస్తాను అంటివి రైతులందరూ తమ పొలాలు అమ్మి తమ పొలాలలో కూలి పని చేసుకుని బతుకుతున్నారు
రైతుకు ధరణి తెచ్చిన మోసం
ఇంటికొక ఉద్యోగం జాడే లేదు కానీ మీ ఇంట్లో అందరికీ ఉద్యోగాలు ఉన్నాయి తెలంగాణ సాధించింది అందుకేనేమో
బంగారు తెలంగాణ అంటివి
దళిత బంధు అంటివి నామమాత్రంగా దళిత బంధు లో టిఆర్ఎస్ కార్యకర్తలకు ఎమ్మెల్యేలకు కమిషన్లు
2014 నుండి 2024 వరకు ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు
ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వక పోతివి కొత్త పింఛన్లు ఇయ్యకనే పోతివి
పదవిలో ఉన్నప్పుడు గుర్తుకు రానివి మళ్లీ పదవి కోసం గుర్తుకు వస్తున్నాయా
నర్సాపూర్ నియోజకవర్గమైన కౌడిపల్లి మండలం లోని మిని టాంక్ బండ్ ను కాలేశ్వరం యొక్క జలాలతో నింపుతానంటివి ఇప్పటివరకు చుక్క నీరు కూడా రాలేదు
ఇండ్లు లేని వారికి డబల్ బెడ్ రూమ్ అంటివి డబల్ బెడ్ రూమ్ ఇండ్ల జాడే లేదు ఇంకా పూరి గుడిసెలలో బ్రతికే వాళ్ళు చాలా మంది ప్రజలు ఉన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం దళితుల కు, వారి భూముల కు పట్టాలను ఇచ్చింది
కొత్త రేషన్ కార్డులు ఇచ్చింది
ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవటానికి ఆర్థిక సహాయం కూడా చేసింది
కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులు వంతెనలు డ్యాములు వాగులు ఎక్కడ కూడా కుంగిపోలేదు
కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు రుణమాఫీ ఒకేసారి సాఫీగా సాగిపోయింది
తిరిగి మళ్లీ రుణాలను రైతులకు సహకాలం లో అందించింది
టిఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు రుణమాఫీ సంపూర్ణంగా కాకపోవడం గమనార్హం
ఇప్పుడు కాంగ్రెస్ వాళ్లు 500 రూపాయలకు సిలిండర్ అంటే టిఆర్ఎస్ ప్రభుత్వం 400 రూపాయ లకు అందుబాటులోకి తీసుకొస్తానని మరి పదవిలో ఉన్నప్పుడు ఏం చేసావ్ సిలిండర్ ధర తగ్గించరాదా సామాన్యుడి పై భారం ఇంకా ఎందుకు
ఇన్ని రోజులు పదవిలో ఉండి చెయ్యలేని పనులు ఇప్పుడు చేస్తా అంటే నమ్మే స్థితిలో ఎవరు లేరు
ఆట పాటల తో తెచ్చుకున్నా తెలంగాణా అదే ఆట పాటల తో తెలంగాణ ను నాశనం చేస్తున్నావ్
తెలంగాణ ఆత్మ బలిదానాల వల్ల వచ్చింది కానీ నీ నిరాహార దీక్ష వల్ల కాదు తెలంగాణ తల్లి సోనియమ్మ ఆ త్యాగాలను గుర్తించి తెలంగాణ ను ఇచ్చింది
తెలంగాణ ఇచ్చిన పార్టీతో కయ్యానికి కాలు దువ్వుతున్నావు