ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు
మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణ ప్రాంతాలలోని తెలంగాణ స్టేట్ యూనియన్ గిరిజన ఆశ్రమ అకాడమిక్ అభ్యర్థన మేరకు 2015 నుండి 2023 వరకు ఆశ్రమ పాఠశాలలో చాలిచాలనిజీతాలతో విద్యార్థులకు విద్యను అందిస్తున్నప్పటికీ ప్రభుత్వం ఉపాద్యాయుల శ్రమను దోపిడీ చేస్తుంది. 1327 జి ఓ ను తీసుకువచ్చి 3rd పార్టీ ఉద్యోగులను గుర్తితిస్తున్నారని తమ శ్రమకు తగ్గ ప్రతిఫలం ప్రభుత్వం ఇవ్వలేక పోతుందన్నారు. వెంటనే 1327 G.O ను రద్దు చేసి, సుప్రీమ్ కోర్ట్ ఇచ్చిన తీర్పు ప్రకారం G.O 60 నీ అమలు చేసి CRT లుగా నియమించి పెండింగులో ఉన్న జీతాలను తక్షణమే విడుదల చేయాలని మెదక్ జిల్లా లో ఆశ్రమ పాఠశాలు కౌడిపల్లి,మహ్మదాబాద్,టెక్మాల్ గ్రామాలలోని తెలంగాణ స్టేట్ యూనియన్ గిరిజన ఆశ్రమ అకాడమీ ఉపాద్యాయులు సుధాకర్,రేణుక,మంజుల, స్వాతి, నరేందర్, బిక్షపతి విజయ్ కుమార్, రవి,తదితర ఉపాద్యాయ బృందం మెదక్ జిల్లా DTDO కి తెలియజేయడం జరిగింది.