జియో పెట్రోల్ బంక్ సేవలను సద్వినియోగం చేసుకోండి – రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ కొత్వాల
ఇందూర్ వార్త వెబ్ డెస్క్ 29
జియో సంస్థ తమ నిర్వహణలో ఉన్న పెట్రోల్ బంక్ లలో 1 లీటర్ పెట్రోల్ కు 3 రూపాయలు తగ్గించి విక్రయిస్తున్నారని, వారి సేవలను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని డీసీఎంఎస్ చైర్మన్, రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. పాత పాల్వంచ లోని జియో బి పి మొబైలిటీ లో మంగళవారం నుండి నవంబర్ 19 తేదీ వరకు పెట్రోల్ ధర ను లీటర్ కు 3 రూపాయలు తగ్గించునున్నది. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ రాయితీ ఉండనున్నది. మొదటి రోజు తగ్గింపు ధరల విక్రయాన్ని కొత్వాల ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జియో చేపట్టిన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జియో పెట్రోల్ బంక్ మేనేజర్ సంజీవ రెడ్డి, మాజీ జడ్పిటిసి లు యర్రంశెట్టి ముత్తయ్య, బరపటి వాసుదేవరావు, కాంగ్రెస్ నాయకులు కందుకూరి రాము, వై. వెంకటేశ్వరరావు, ఉండేటి శాంతి వర్ధన్, అజిత్, పెట్రోల్ బంక్ సిబ్బంది నాగరాజు, కిరణ్ కుమార్, గోపాల స్వామి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.