జనవరి నుండి కార్ల ధరలు పెంచేందుకు టాప్ కంపెనీలు రెడీ
రా మెటీరియలు పెరగడంతో నిర్ణయం
ఇందూర్ వార్త వెబ్ డెస్క్,
కార్ల తయారీ కంపెనీలు రేట్లు పెంచడానికి సిద్ధమ వుతున్నాయి.వచ్చే నెల ఒకటి నుంచి ధరలు పెంచు తామని మారుతి సుజుకీ, హ్యుందాయ్, మహీంద్రాఅండ్ మహీంద్రా, జేఎస్ డబ్ల్యూ ఎంజీ మోటార్,మెర్సి డెజ్ బెంజ్, ఆడి, బీఎండబ్ల్యూ వంటి టాప్ కంపెనీలు ప్రకటించాయి. ఇతర కంపెనీలు కూడా ధరలు పెంచే ఆలోచనలో ఉన్నాయి. రామెటీరియల్స్ ధరలు పెరి గాయని, కార్యకలాపాల ఖర్చులు ఎక్కువయ్యాయనే కారణాలను చూపుతున్నాయి. కార్ల కంపెనీలు ప్రతీ ఏడాది డిసెంబర్లో ధరలు పెంచుతున్నాయని, దీంతో రేట్లు పెరిగే ముందే కార్ల సేల్స్ పుంజుకుం టాయని భావిస్తున్నాయని ఇండస్ట్రీ వర్గాలు వెల్లడిం చాయి. కొత్త ఏడాదిలో బండ్లు తీసుకుందామనుకునే కస్టమర్లు డిసెంబర్లోనే కొనుగోలు జరుపుతారని పేర్కొన్నాయి. ఏడాది ప్రారంభంలో లేదా ఆర్థిక సం వత్సరం ప్రారంభంలో బండ్ల రేట్లు పెరగడం చూస్తు న్నామని, కొన్ని కంపెనీలైతే కొత్త మోడల్స్ లాంచ్ చేసే ముందు ధరలు పెంచుతున్నాయని డెలాయిట్ ఇండియా పార్టనర్ రజత్ మహాజన్ పేర్కొన్నారు. ధరలు పెంచడానికి చాలా కారణాలు ఉండొచ్చని, కానీ ముఖ్యమైన కారణం ఈ ఏడాది సెప్టెంబర్ క్వా ర్టర్లో కొన్ని వెహికల్ కంపెనీల లాభాలు పడిపోవ డమేనని అంచనా వేశారు. ఫెస్టివల్ సీజన్లో రేట్లు మారలేదని, వచ్చే ఏడాది జనవరి-మార్చి క్వార్టర్లో రేట్లు మార్పు ఉంటుందని అన్నారు. ‘రామెటీరియ ల్స్ ధరలు పెరగడం, కన్జూమర్లు అడ్వాన్స్డ్ ఫీచర్ల కు చెల్లించడానికి ఆసక్తి చూపకపోవడం, నిల్వలు తగ్గించుకోవడానికి పండుగ టైమ్లో డీలర్లు భారీగా డిస్కౌంట్లు ప్రకటించడంతో ఈ ఏడాది సెప్టెంబర్ క్వార్టర్లో కంపెనీల లాభాలు పడిపోయాయి’ అనిరజత్ వివరించారు.ఈ కంపెనీల కార్ల రేట్లు పైకి మార్కెట్ లీడర్ మారుతి సుజుకీ వచ్చే నెల ఒకటి నుంచి తమ కార్ల రేట్లను 4 శాతం వరకు పెంచు తామని ప్రకటించింది. ఎంట్రీ లెవెల్ కార్ ఆల్టోకే 10 నుంచి యుటిలిటీ వెహికల్ ఇన్విక్టో వరకు వివిధ మోడల్స్న ఈ కంపెనీ అమ్ముతోంది. హ్యుందాయ్మోటార్స్ తమ కార్ల ధరలను రూ.25 వేల వరకు పెంచుతామని పేర్కొంది. ఈ కంపెనీ క్రెటా, వెర్నా వంటి పాపులర్ ఎస్ యూవీలను అమ్ముతోంది. మహీంద్రా అండ్ మహీంద్రా తమ ఎస్ఆూవీలు, కమర్షియల్ వెహికల్స్ ధరలను జనవరి 1 నుంచి 3 శాతం వరకు పెంచుతామని ప్రకటించింది. అన్నిరకాల కార్ల రేట్లను 3 శాతం వరకు పెంచుతామని జేఎస్ డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా ప్రకటించ గా, హోండా కార్స్ ఇండియా కూడా కార్ల ధరలు పెంచాలని చూస్తోంది. లగ్జరీ కార్ల కంపెనీ మెర్సిడెజ్ బెంజ్ ఇండియా జనవరి 1 నుంచి బండ్ల రేట్లను 3 శాతం వరకు పెంచుతామని ప్రకటించింది. మెర్సిడెజ్ జీఎల్సీ రేట్లు రూ.2 లక్షల మేర, మేబ్యాచ్ ఎస్ 680 లగ్జరీ లిమోజైన్ రేటు రూ.9 లక్షల మేర పెరుగుతుందని అంచనా. ఆడి, బీఎండబ్ల్యూ కూడా తమ కార్ల రేట్లను 3 శాతం మేర పెంచడానికి రెడీ అయ్యాయి. రామెటీరియల్స్ ధరలు పెరగడంతో నే రేట్లను పెంచాల్సి వస్తోందని ఈ కార్ల తయారీ కంపెనీలు చెబుతున్నాయి.