నసూర్లబాదు
పోచారం సురేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు
నసుర్లబాద్ మండల కేంద్రంలో శనివారం బాన్సువాడ నియోజకవర్గ తెరాస పార్టీ ఇంచార్జ్ యువ నాయకులు పోచారం సురేందర్ రెడ్డి జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు మైలారం సింగిల్ విండో చైర్మన్ పెరిక శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేక్ ని కట్ చేసి పలువురికి పంచిపెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర యువ నాయకులు పోచారం సురేందర్ రెడ్డి ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతున్ని వేడుకొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కందిమల్లేష్ , ప్రభాకర్ రెడ్డి, తెరాస నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.