ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు
కౌడిపల్లి బస్టాండ్ లో త్రాగడానికి మినరల్ వాటర్ ఏర్పాటు
వేసవికాలంలో త్రాగునీరు ఏర్పాటు
రెండు సంవత్సరాలుగా మినరల్ వాటర్ సప్లై చేస్తున్న శ్రీధర్
ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ప్రతిరోజు మినరల్ వాటర్ సప్లై చేస్తాను
ధర్మసాగర్ గ్రామస్తుడైన శ్రీధర్ ముందుకు రావడం విశేషం
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం బస్టాండ్ పరిధిలో ప్రయాణికుల కోసం మినరల్ వాటర్ ను ఏర్పాటు చేయడం జరిగింది. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా నీటిని ఏర్పాటు చేయడం మంచి విశేషం అలాగే గత సంవత్సరం నుండి ధర్మసాగర్ గ్రామస్తుడైన శ్రీధర్ ఈ మినరల్ వాటర్ ని అందించడం ఎంతో గొప్ప విశేషం ప్రతిరోజు ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా మినరల్ వాటర్ ని ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుతానని శ్రీధర్ తెలియజేశాడు. మెదక్ డిపో మేనేజర్ సుధా
కౌడిపల్లి బస్టాండ్ కు విచ్చేసి ప్రయాణికుల కోసం ఏర్పాటుచేసిన త్రాగునీటిని కొబ్బరికాయ కొట్టి ప్రయాణికులకు వాటర్ అందించడం జరిగింది. అలాగే ఇలాంటి మంచి పనులు చేసినందుకు మినరల్ వాటర్ అందించిన శ్రీధర్ ని శాలువాతో సన్మానించి బహుమతి బహుకరించింది. ఇలాంటి మంచి పనులు చేయడం గొప్ప విశేషం అని తెలియజేసింది