కెటీపీఎస్ యాష్ టెండర్ అర్హత కలిగిన గిరిజన కాంట్రాక్టర్లకు సెల్ ఆర్డర్ వెంటనే ఇవ్వాలి-
ఇందూర్ వార్త ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి నవంబర్ 16
సేవాలాల్ సేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ధరావత్ సురేష్ నాయక్
సేవాలాల్ సేన రాష్ట్ర కార్యదర్శి భూక్య శ్రీను నాయక్ డిమాండ్ చేశారు
ఈరోజు పాల్వంచ కెటీపీఎస్ యాష్ టెండర్ అర్హత కలిగిన గిరిజన కాంట్రాక్టర్ల రిలే నిరాహార దీక్షకు పాల్వంచ సేవాలాల్ సేన మండల కమిటీ ఆధ్వర్యంలో *మండల అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నాయక్ అధ్యక్షతన సంఘీభావం తెలపడం జరిగింది* ఈ కార్యక్రమానికి ఉద్దేశించి సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షులు ధరావత్ సురేష్ నాయక్. రాష్ట్ర కార్యదర్శి భూక్య శ్రీను నాయక్ మాట్లాడుతూ కేటీపీఎస్ యాజమాన్యం ఏజెన్సీ చట్టాలను తుంగల తొక్కి నిబంధనలకు విరుద్ధంగా నడుచుకుంటుందని అన్నారు ఐటీడీఏ పీవో మరియు కేటీపీఎస్ యాజమాన్యం వారు సెలక్ట్ చేసిన లిస్టు ప్రకారం అర్హత కలిగిన ఎస్టి గిరిజన కాంట్రాక్టర్లు అందరికీ ఫ్లైయాస్, బాటం యాష్, పాండ్ యాష్, తక్షణమే సెల్ ఆర్డర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు రాజకీయాలకు అతీతంగా టెండర్ దారులకు న్యాయం చేయాలని అన్నారు హైకోర్టు ఆదేశానుసారం టీజీ జెన్కో వారు ముగ్గురు పిటిషనర్లతో పాటు స్థానిక గ్రామాల ఎస్టి ఏజెన్సీలకు నామినల్ రేటు ప్రకారం సెల్ ఆర్డర్ ఇచ్చుటకు ఆదేశించిన ఈరోజుకి స్థానిక గిరిజన టెండర్ దారులకు టెండర్ ఆర్డర్ కాపీ ఇవ్వకపోవడం చాలా దారుణమని అన్నారు ఐ టి డి ఏ పి ఓ గారు కేటీపీఎస్ టెండర్ యాష్ పై దృష్టి సారించి స్థానిక గిరిజన టెండర్ దారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు లేనియెడల సేవాలాల్ సేన మరియు టెండర్ దారులతో కలిసి ఐటీడీఏ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన జిల్లా ప్రధాన కార్యదర్శి లావుడియా వెంకటేష్ నాయక్ జిల్లా అధికార ప్రతినిధి బానోతు నాగరాజు నాయక్ పాల్వంచ మండల కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు