కుల గణన సమగ్ర సర్వే అవగాహన సదస్సు ఇందూరు వార్త ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి
ఇందూరు వార్త ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి
జిల్లా అధ్యక్షులు పోదెం వీరయ్య ఆదేశానుసారం కొత్తగూడెం లో KCOA క్లబ్ లో కులగణన సమగ్ర సర్వే అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది
ఇందూరు వార్త నవంబర్ 3 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి
ఈ సదస్సుకు అశ్వరావుపేట నియోజకవర్గం శాసనసభ్యులు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆదేశానుసారం మరియు మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న ఆదేశానుసారం అశ్వరావుపేట నియోజకవర్గం మహిళా కాంగ్రెస్ పాల్గొనడం జరిగింది.
డిసిసి అధ్యక్షులు మరియు ఫారెస్ట్ డెవలప్మెంట్ చైర్మన్ అయినటువంటి వీరయ్య ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించడం జరిగింది. ఈ సదస్సులో వివిధ నియోజకవర్గాల శాసనసభ్యులు కూడా పాల్గొనడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు జిల్లా మహిళా కాంగ్రెస్ సెక్రటరీ పొదిలి జ్యోతి, మరియు బి బ్లాక్ అధ్యక్షురాలు సున్నం లక్ష్మి దమ్మపేట మండల మహిళా కాంగ్రెస్ సెక్రటరీ పార్వతి, తదితరులు పాల్గొనడం జరిగింది.