ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో అర్హత కలిగిన అభ్యర్థుల నుండి బోధనా సిబ్బంది పోస్టుల కొరకు దరఖాస్తులకు ఆహ్వానం
ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి బి రాహుల్
ఇందూరు వార్త ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి డిసెంబర్ 20
ఖమ్మం మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో నడపబడుతున్న తెలంగాణ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో పనిచేయుటకు అర్హత కలిగిన అభ్యర్థులను నుండి బోధన సిబ్బంది పోస్టుల కొరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ ఒక ప్రకటనలో తెలిపారు.
బోధన సిబ్బందిని తాత్కాలిక ఉపాధ్యాయుల (ఔట్ సోర్సింగ్)గా ఉద్యోగ నియామకం చేయటం జరుగుతుందని, బోధన సిబ్బంది గా పని చేయుటకు అభ్యర్థుల యొక్క విద్యార్హతలతో పొందిన మార్కుల ఆధారంగా మరియు డెమో ద్వారా ఎంపిక చేయబడునని ఆయన అన్నారు.
పోస్ట్ గ్రాడ్యుయేట్ బోధన సిబ్బంది కెమిస్ట్రీ ఆరు పోస్టులు, ఫిజిక్స్ లో ఒక పోస్టు కలదని, ఏదైనా యూనివర్సిటీ నుండి 50 శాతం మార్పులతో సంబంధిత పిజీ పూర్తి చేసి ఉండాలని, మరియు బిఈడి పూర్తి చేసి ఉండాలని, CTET పేపర్-2 పాస్ లేక TET పాసై ఉండాలని, సీబీఎస్ఈ ఇంగ్లీష్ మీడియం లో బోధించగలిగి ఉండాలని అన్నారు. స్టూడెంట్స్ కౌన్సిలర్ పోస్ట్ లు నాలుగు కలవని, సైకాలజీలో PG పిజీ చేసి ఉండాలని, లేదా గుర్తించబడిన యూనివర్సిటీ నుండి గైడెన్స్ & కౌన్సిలింగ్ లో డిప్లొమా చేసి ఉండాలని, రాష్ట్రస్థాయిలో లేదా జాతీయస్థాయిలో ఒక సంవత్సరం పని చేసిన అనుభవం ఉండాలని అన్నారు.
అభ్యర్థులు ఈనెల 21 నుండి 27వ తేదీలోగా ప్రాంతీయ సమన్వయ అధికారి కార్యాలయము (RCO) ఐటీడీఏ భద్రాచలం నందు స్వయంగా సమర్పించాలని, అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలించిన అనంతరం వారి విద్యార్హతల ఆధారంగా మెరిట్ ప్రాతిపదికన మరియు డెమో ఆధారంగా పోస్టుల వారీగా ఎంపీక చేయబడునని తెలుపుతూ, ఇతర వివరములకై ప్రాంతీయ సమన్వయ అధికారి కార్యాలయము (RCO) ఐటీడీఏ భద్రాచలం కార్యాలయం నందు సంప్రదించాలని, దరఖాస్తులను కార్యాలయ పని వేళల్లో మాత్రమే స్వీకరించ బడునని, ఇంకా ఏదైనా సమాచారం కొరకు 8074335630 నెంబర్లకు ఫోన్ ద్వారా తెలుసుకోవాలని ఆయన కోరారు.
-అదనపు పౌర సంబంధాల అధికారి కార్యాలయము భద్రాచలం నుండి జారీ చేయడమైనది–