ఉగ్రవాదులరా ఖబర్దార్..మీరు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే..!
_అఖండ భారతావనిలో చిచ్చుపెట్టాలనుకునే వాడెవ్వడు మిగలలేదు.
_కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఉగ్రవాదులను వెంటనే ఏరివేయాలి.
_ఉగ్రవాద దాడిలో మరణించిన ప్రతి ఒక్కరికి ఆత్మశాంతి కలగాలి
-బీజేపీ పట్టణ ఉపాధ్యక్షులు అంకతి శ్రీనివాస్
ఇందూర్ వార్త హుజురాబాద్ ఏప్రిల్ 24_
పహాల్గామ్ లో ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపి 27 మంది ప్రాణాలు తీసిన ఘటనను బీజేపి హుజరాబాద్ పట్టణ ఉపాధ్యక్షులు అంకతి శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు.ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అఖండ భారతావనిలో అన్ని మతాల వారు, అన్ని కులాల వారు సామరస్యంగా, సౌబ్రాతృత్వంగా కలిసిమెలిసి బ్రతుకుతుండడం చూసి ఓర్వలేక ముష్కర మూకలు దేశంపై కక్షగట్టి ఓరువలేని తనంతో దొంగ దెబ్బ తీయడానికి ప్రయత్నం చేసే దిశలో అమాయకుల ప్రాణాలు తీయడం సమంజసం కాదని, దీనికి తప్పకుండా వారు మూల్యం చెల్లించుకోవాల్సిందేనన్నారు. ఇప్పుడున్నది ఒకప్పటి భారతదేశం కాదని, ప్రస్తుతం దెబ్బకు దెబ్బతీసే భారతదేశమన్నారు. యావత్ భారతావని ఈ ఉగ్రవాదుల దుశ్చర్యలను ఖండించాలని ఆయన కోరారు. దమ్ము, ధైర్యం లేక, నేరుగా పోరాడే తత్వం లేక, నీచ నికృష్టపు ఆలోచనలతో దొంగల్లాగా దేశంలో చొరబడి అమాయకుల ప్రాణాలు తీయడం ఉగ్రవాదులకే చెల్లిందని, కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి కలుపు మొక్కల్లాంటి ఉగ్రవాదులను ఏరిపారేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.