ఇందూరు వార్తా ప్రతినిధి రాజు
1 ప్రయాణికులకు ఆర్టీసీ అందిస్తున్నటువంటి చిరు కానుక
2 మెదక్ ఆర్టీసీ డిపో నుండి ప్రయాణికులకు శుభవార్త
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలో ప్రయాణికులకు శుభవార్త కౌడిపల్లి బస్టాండ్ కంట్రోలర్ పాయింట్ నుండి మెదక్ ఆర్టీసీ డిపో నుండి ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా t9 టికెట్ ను ప్రయాణికుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. t9 టికెట్ యొక్క ప్రాధాన్యత 60 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించవచ్చు ఉదయం 9 గంటలకు తీసుకుని టికెట్ రాత్రి 9 గంటల వరకు అందుబాటులో ఉంటుంది ఈ టికెట్ ను ఒకసారి మాత్రమే ఉపయోగించుకోవచ్చు t9 టికెట్ వచ్చేసి వంద రూపాయలు మాత్రమే దీనివల్ల ప్రయాణికులకు చాలా ఉపయోగం ఉంది కౌడిపల్లి నుండి సూరారం షాపూర్ చింతల్ ఐడిపిఎల్ బాలానగర్ వరకు వంద రూపాయల t9 టికెట్ తీసుకోవడం వల్ల ప్రయాణికులకు పోవడానికి రావడానికి వచ్చేసి ₹100 మాత్రమే, టికెట్ ధర కంటే తక్కువ t9 టికెట్ ప్రయాణికులందరూ దీనిని వినియోగించుకోగలరు మిగతా సలహాలకి కౌడిపల్లి బస్టాండ్ లోని కంట్రోలర్ నీ సంప్రదించగలరు.
*ఈ బస్సు మనందరిదీ దీనిని పరిశుభ్రంగా ఉంచుదాం*
Medak depo