- *ఆత్మీయ సమ్మేళనానికి అందరూ ఆహ్వానితులే*
*ముస్లింలకు షాదీఖానా నిర్మించిన ఘనత ఉత్తమ్ దే*
టి.పి.సి.సి రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ ఎండి. అజీజ్ పాషా.
నూతన సంవత్సర సందర్భంగా నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు కెప్టెన్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళన ఆహ్వాన కార్యక్రమాన్ని ఉద్దేశించి మహ్మద్ అజీజ్ పాషా మాట్లాడుతూ కుల,మత రాజకీయాలకు అతీతంగా ముస్లిం సోదరులందరూ పాల్గొనాలని కోరారు.
ఆత్మీయ సమ్మేళనం నూతన సంవత్సర జనవరి1వ,తేదీన కోదాడ కోమరబండలో జరగనున్న వేడుకల్లో హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలు అందరూ ఆహ్వానితులే అని అన్నారు.నల్లగొండ పార్లమెంటు సభ్యుడు,తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ పిసిసి అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి,కోదాడ మాజీ శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని ముస్లిం సోదరులకు,అన్ని వర్గాల ప్రజలకు ఆత్మీయ సమ్మేళననీకి రావాలని విజ్ఞప్తి చేస్తూ ఆహ్వానం అందించడం జరిగిందని,ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరారు.ఉత్తమ్ హయాం లోనే ముస్లింలకు షాదీఖానా మంజూరు చేసిన ఘనత ఆయనకే దక్కిందని ఎండి అజీజ్ పాషా అన్నారు.
ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు షేక్.జమాలుద్దీన్,డాక్టర్ ఖాసీం,జావీద్, అక్బర్,సలావుద్దీన్,బషీర్,జానీమియా, ఖాజా మొయినుద్దీన్,ఇస్మాయిల్,అఖిల్, గౌస్,ఇబ్రహీం,ముస్తఫా,అన్వర్,ఖాసీం సాబ్, రహీమ్,సైదా సాబ్,భాషా,సిరాజ్ తదితరులు పాల్గొన్నారు.