బాన్సువాడ అయ్యప్ప ఆలయానికి చేరుకున్న అఖండ జ్యోతి రథం
శబరిమలలో ఉన్న పంపానదిని పరిశుభ్రంగా ఉంచుతూ ప్లాస్టిక్ వస్తువులు వాడకుండా అడవులను కాపాడాలని సదుద్దేశంతో రాష్ట్రంలో ఉన్న అయ్యప్ప ఆలయాలను సందర్శిస్తూ అవగాహన కల్పించేందుకు అయ్యప్ప స్వామి అఖండ జ్యోతి రథం సోమవారం బాన్సువాడ పట్టణానికి చేరుకుంది. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి భక్తి అఖండ జ్యోతి కి స్వాగతం పలుకుతూ పట్టణంలోని తహాసిల్దార్ కార్యాలయం నుండి పట్టణంలోని అయ్యప్ప ఆలయాన్ని చేరుకొని భక్తులు అఖండ జ్యోతి దర్శనం చేసుకున్నారు. అఖండ జ్యోతి రథానికి రాష్ట్ర అధ్యక్షులు సుశీల్ కుమార్ స్వామి, సుధీర్ స్వామి ఆధ్వర్యంలో కార్యక్రమానికి నిర్వహిస్తూ అయ్యప్ప మాలధారణ స్వామి అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప సేవా సమితి గురుస్వామి గురు వినయ్, ఆలయ కమిటీ అధ్యక్షుడు విట్టల్ రెడ్డి, కమిటీ సభ్యులు, మాలధారణ స్వాములు, తదితరులు పాల్గొన్నారు.