బాన్సువాడ మండలం పరిధిలో కేవ్ల నాయక్ తాండా, కొయ్యగుట్టా తండా లలోని అంగన్వాడీ కేంద్రాలను, తిర్మలపూర్ గ్రామంలో ని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాల లను బాన్సువాడ ఎంపిపి శ్రీమతి దొడ్ల నీరజా వెంకట్ రామ్ రెడ్డి, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా అక్కడ ఉన్న చిన్నారులు, బాలింతలు, విద్యార్థిని విద్యార్థులతో ఎంపిపి ముచ్చటించారు. మధ్యాహ్నం భోజనం రుచికరంగా ఉంటున్నయా, సమయానికి భోజనం అందిస్తున్నారా.. లేదా గుడ్లు మరియు పాలు చిన్నారులకు, బాలింతలకు అందిస్తున్నారని వివరాలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా పాఠశాల తరగతి గదులు, వంట గది పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని అంగన్వాడీ కేంద్రం సిబ్బంది కి మరియు పాఠశాల సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు బాన్సువాడ ఏం ఈ ఓ నాగేశ్వర రావు, ఇంఛార్జి ఎంపీడీఓ సత్యనారాయణరెడ్డి, సభాపతి వ్యక్తిగత సహాయకులు భగవాన్ రెడ్డి, గ్రామ సర్పంచ్ అంకితా సాయ గౌడ్, మాజీ సర్పంచ్ సాయిలు, ఆయా గ్రామాల నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.