ప్రజలను బురిడీ కొట్టిస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు
ఇందూర్ వార్తా : వెబ్ న్యూస్ (మార్చి 02 ) కామారెడ్డి
-ప్రివెనషు ఆఫ్ మనీ లందరింగ్ యక్తి 2002 లో అమలులో ఉన్న
స్కీం ల పేరుతో వెనచ్చారలు నాడుస్తున్నా పట్టించుకోని అడికారులు
-కొందారు విలేకర్లు కూడా వెంచర్లలో పాత్రదారులే
– ఎక్కడో పట్టణానికి 5 నుండి పది కిలోమీటర్ల దూరంలో వెంచర్లు
– ప్రజలను ఆకర్షించేందుకు స్కీములు
– నష్టపోతున్న మధ్యతరగతి ప్రజలు
– కొన్ని వెంచర్ల లో ప్రభుత్వ స్థలాలు ఉన్నా – పట్టించుకోని ప్రభుత్వ యంత్రాంగం
భారతదేశంలో మనీలాండరింగ్ నిరోధించడానికి 2002లో భారత పార్లమెంట్ ద్వారా మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రివెనషు ఆఫ్ మనీ లందరింగ్ (PMLA) రూపొందించబడింది. దీనికి వ్యతిరేకంగా
కామారెడ్డి జిల్లా కేంద్రం పరిసర ప్రాంతాలలో ఉనా ప్రబుత్వ బూమి ఎక్కడ ఉంటే ఆకడ రాజకీయ నాయకుల వెంచర్స్ వేస్తున్న చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న ప్రబుత్వ అడికారులు వెంచర్లు చేస్తూ స్కీమ్ల పేర్లతో ప్రజలను మోసం చేస్తునా కూడా పట్టించుకోని ఉన్నత అడికారులు మాత్రం మాకెందుకు లే అని చూసి చూడనట్లుగా ఆ వెంచర్ల వైపు కన్నెత్తి కూడా చూడారు. ప్రజలను మభ్యపెట్టి వారి నుండి పట్టణనికి ఐదు నుంచి పది కిలోమీటర్ల వరకు చివరలో గ్రామ శివారులో వెంచర్లు వేస్తూ ఆకర్షణీయమైన స్కీముల పెడుతూ మధ్యతరగతి ప్రజలను ఆకర్షిస్తూ స్కీముల రూపంలో వాయిదాల పద్ధతి నా చెల్లించాలంటూ ప్రజల వద్ద నుండి డబ్బులు వసూలు చేసి రిజిస్ట్రేషన్లు చేయడం లేదని పలువురు వెంచర్ల బాధితులు ఆరోపిస్తున్నారు. నాలుగు ఎకరాల పట్టా భూమి ఉంటే పక్కన 10 ఎకరాల అసైన్మెంట్ భూమి ఉన్న దానిని కలుపుకొని వెంచర్ వేస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారులు అమాయకులకు అంటగడుతున్నారు. రాజంపేట మండలం పొందుర్తి చౌరస్తా వద్ద శ్రీ పద్మావతి నగర్ గా కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కలిసి రైతుల వద్ద కొంత భూమి తీసుకుని డిటిసిపి లేఅవుట్ చేసి, అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయకున్నా వారు తయారుచేసిన కరపత్రాలపై మాత్రం బ్లాక్ టాప్ రోడ్లు, సిసి డ్రైనేజీలు,
కరెంట్ స్తంభాలు, మంచినీటి సౌకర్యం, రోడ్డుకు ఇరువైపులా మొక్కల పెంపకం, ( ఇది మాత్రం చేశారు ) పిల్లల కొరకు పార్కు సదుపాయం, బుగర్బా నీటివసతి పుష్కలంగా కలదనీ, వెంటనే ఇండ్లు కట్టుకోవడానికి అనువైన స్థలం, ( ఏలాంటి వసతి లేదు ) 100 శాతం వాస్తు ప్రకారం చేయబడిన వెంచర్ అని ప్రకటన చేస్తూ, చెల్లింపు విధానాన్ని సైతం ఆ కరపత్రంలో పొందుపరిచారు. 111 గజముల ఫ్లాట్ విలువ 4,80,000 అని, సభ్యత్వము 30000 రూపాయలు, ప్లాట్ రిజర్వేషన్ 10,000, 30 నెలలు ఒక నెల చొప్పున 4000, ఐదు నెలలకు ఒకసారి 40,000 పాయల చొప్పున రెండు లక్షలు రిజిస్ట్రేషన్ సమయంలో చివరి వాయిదా అంటూ ఒక లక్ష ఇరవై వేలు తీసుకొని మొత్తంగా నాలుగు లక్షల ఎనభై వేలు తీసుకొని రిజిస్ట్రేషన్లు చేశారు.( కొందరికి మాత్రమే ) మరికొందరికి అదిగో ఇదిగో అంటూ తింపుత్తున్నరని బాధితులు వాపోతున్నారు. ఒకటవ నెల నుండి 30 నెల వరకు ప్రతినెల డ్రాలో గెలుపొందిన సభ్యునికి ఒక ప్లాటు ఇస్తామని చెప్పి ప్లాటు డ్రాలో వచ్చినప్పటికీ, ఇప్పటివరకు అతనికి రిజిస్ట్రేషన్ చేయలేదని బాధితులు వాపోతున్నాడు. మధ్యతరగతి ప్రజలను ఆకర్షించేందుకు ఒకటవ మరి 30 నెల డ్రాలో ఒక బైకు 52,000 విలువగల బైకు ఇస్తామని, ప్రతి ఐదు నెలలకు ఒక బంపర్ డ్రా లో ఒక తులం బంగారం ఇస్తామని, ప్రకటనలు చేస్తూ మధ్యతరగతి ప్రజలను ఆకర్షించి వారిని మభ్యపెట్టి మోసం చేస్తున్నారని, శ్రీ పద్మావతి నగర్ వెంచర్లో కొనుగోలు చేసిన బాధితులు వాపోతున్నారు. రాజంపేట మండలం పొందుర్తి గ్రామ చౌరస్తాలో ఉన్న భూమిని వారి కరపత్రంలో మాత్రం కామారెడ్డి టౌన్ కు దగ్గర అని సర్వేనెంబర్ 145, 146, 149 లలో సులభమైన వాయిదాల పద్ధతిలో శ్రీ పద్మావతి నగర్ లో ప్లాట్లను విక్రయానికి ఏర్పాటు చేయనైనదని ప్రకటించారు. పద్మావతి నగర్ డిటిసిపి లేఅవుట్ అని కరపత్రం పై ఉంచారు. కానీ ఆ భూమి మాత్రం వ్యవసాయదారుల పేరు మీదనే ఉంది. ఇందులో పట్టాదారులుగా కామారెడ్డి పట్టణంలోని అశోక్ నగర్ కాలనీకి చెందిన గండే నర్సింలు, దేవునిపల్లి కి చెందిన తిప్పిరిశెట్టి బాల శేఖర్, కామారెడ్డి పట్టణంలోని విద్యానగర్ కాలనీకి చెందిన కైరా రవీందర్ గౌడ్, గోడౌన్ రోడ్లో ఉండే జి ఆంజనేయులకు చెందిన ఈ భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్లాట్లుగా చేసి విక్రయించి లబ్ధిదారులకు మాత్రం మొండిచేయి చూపెడుతున్నారని,శ్రీ పద్మావతి నగర్ వెంచర్లో ప్లాట్ల కోసం డబ్బులు చెల్లించిన ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏజెంట్లతో ప్లాట్లు విక్రయాలు. ఏజెంట్లను బాధ్యులను చేస్తూ తప్పించుకుంటున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు.
వెంచర్లో రిపోర్టర్లు యాజమానుల ఏజెంట్ల అర్థం కాకా భదితుల ఆందోళన
శ్రీ పద్మావతి వెంచర్లో ఉన్న భూమి పట్టాదారు లు కొందరు అయితే సదరు వ్యాపారులు మాత్రం మా వెంచర్లో కొందరు పత్రిక రిపోర్టర్లు కూడా ఉన్నారని మేము మెడియా రంగంలో ఉన్నాం మమ్మలని ఎవరు కూడా ఈఏఎం చేయలేరని అమాయకపు ప్రజలను మోసం చేస్తూ వెంచర్ యాజమనులతో మాకెలాంటి సంబందం లేదని చెప్పి పిస్తున్నారని భదితులు ఆరోపిస్తున్నారు సదరు పత్రిక విలేకరి మాత్రం నేను ఆ వెంచర్లో పాట్నానరగా లేనని నేను వెంచర్లో ఒక ఏజెంట్ గానే పని చేశాని ఎగేనట గా పనిచేసినందుకు నాకు అందులో నుండి కమిషం రావాలని అందుకనే నేను కొన్ని డబ్బులు మాత్రమే కట్టలేదని వెంచర్ యాజమనులే కావాలని భదితులను ఇబ్బంది పెడుతున్నారని సదరు రిపోర్టర్ ఏజెంట్ బడుతులకు ఎన్నిసార్లు చెప్పిన వెంచర్ ఓఎనర్లు స్పందించలేదని పేర్కొంటున్నారు .
శ్రీ పద్మావతి నగర్ లో కామారెడ్డి జిల్లాలోని పలు గ్రామాలకు చెందిన ఆరుగురు వ్యక్తులు ఆరు ప్లాట్లను కొనుగోలు చేశారు. వాయిదాల పద్ధతిన క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లిస్తూ వచ్చారు. ప్రతి నెల డ్రాలో వీరి పేర్లను వేశారు. 4,80,000 పూర్తిగా చెల్లించిన మూడు సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటివరకు వారికి వారి పేరుమీద రిజిస్ట్రేషన్ చేయడం లేదని, మీకు అమ్మిన ఏజెంట్ మాకు డబ్బులు చెల్లించలేదని, సదరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు వీరిని బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. చివరికి ఆ ఏజెంట్ కు సంబంధించిన ప్లాట్ కొనుగోలు చేస్తే మిగతా ఐదు ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని చెప్పడంతో అక్కడ 4,80,000 కాదు కదా ప్రస్తుతం రెండు లక్షల కూడా ప్లాటు అమ్మదు, అయినప్పటికీ సదర్ బాధితులు తమ ఐదు ప్లాట్లు ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసి కావు అని ఆ ప్లాట్ ను కూడా కొనుగోలు చేశారు. చివరికి ఆ ప్లాట్ తో మరో ఫ్లాట్ మరమే రిజిస్టేషన్ చేసి ఇచ్చారని భదితులు వాపోతున్నారు. డ్రాలో గెలుపొందిన ప్లాటు తో పాటు ఇంకా మూడు ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయవలసి ఉందని గత మూడు సంవత్సరాల నుండి ఇదిగో అదిగో అంటూ తింపుతున్నరని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మధ్యతరగతి ప్రజలు కామారెడ్డి లో ప్లాట్లు కొనే ముందు ఆలోచించాలి.
మధ్యతరగతి ప్రజలు కామారెడ్డిలో ప్లాట్లు కొనాలంటే చాలా ఆలోచించాలని కామారెడ్డి లో ఏ వెంచర్ చూసినా ఇదే బాగోతం గా కనిపిస్తోందని పలువురు మేధావులు పేర్కొంటున్నారు. ఏదో రకంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు పాడుచేసిన ప్లాట్లను కొనుగోలు చేసిన వ్యక్తులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.