హైదరాబాద్ :ప్రతినిధి
హైదరాబాద్ :జులై 25
ఐఐటీ హైదరాబాద్ విద్యార్థి కార్తీక్ ఎనిమిది రోజుల క్రితం అదృశ్యమవ్వగా విషాదంతమైంది. కార్తీక్ వైజాగ్‌లో సూసైడ్ చేసుకున్నాడు. సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకోగా డెడ్ బాడీని కేజీహెచ్‌కు తరలించారు. నల్గొండ జిల్లా మిర్యాల గూడకు చెందిన కార్తీక్ ఐఐటీహెచ్‌లో బీటెక్ మెకానికల్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈనెల 17 క్యాంపస్ నుంచి వెళ్లిపోగా తల్లిదండ్రులు 19 న పోలీసు కంప్లైంట్ ఇచ్చారు. ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా కార్తీక్ విశాఖ పట్నం వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. విద్యార్థి కోసం తీవ్రంగా గాలించారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం విద్యార్థి మృతదేహాం లభ్యమైంది. చేతికందిన కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు, కార్తీక్ బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు…..