మీరు తక్కువ పెట్టుబడితో ఇంటి నుంచే బిజినెస్ ప్రారంభించాలని భావిస్తున్నారా? అయితే.. ఈ బెస్ట్ బిజినెస్ ఐడియాపై ఓ లుక్కేయండి.
కరోనా అనంతరం మనందరీ ఆలోచనా విధానంలో విపరీతమైన మార్పు వచ్చింది. సొంతంగా వ్యాపారం చేయాలనుకుంటున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. మీరు కూడా సొంతంగా బిజినెస్ చేయాలని ప్లాన్ చేస్తే ఈ వ్యాపారాన్ని ఎంచుకోవచ్చు.
ఈ వ్యాపారాన్ని పెద్దగా పెట్టుబడి కూడా అవసరం లేకపోవడం విశేషం. ఇంకా ఇంటి నుంచే ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఉల్లి ధరలు విపరీతంగా పెరియాన్న వార్తలు మనం ప్రతీ ఏడాది వింటూనే ఉంటాం.
ధరలు గరిష్ఠ స్థాయికి చేరినప్పుడు ప్రతీ వంటకంలోనూ ఉల్లి కనిపించడం అరుదుగా మారుతుంది. అటువంటి పరిస్థితితుల్లో ఉల్లి పేస్ట్ కోసం డిమాండ్ అధికమవుతుంది. మీరు కూడా ఈ అవకాశాన్ని క్యాచ్ చేయాలని భావిస్తే ఉల్లి పేస్ట్ వ్యాపారాన్ని ఎంచుకోవచ్చు.
ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (KVIC) ఉల్లి ముద్ద తయారీ వ్యాపారంపై ప్రాజెక్ట్ రిపోర్టును సిద్ధం చేసింది. దీని ప్రకారం రూ.4.19 లక్షలతో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.
వ్యాపారం ప్రారంభించడానికి మీ వద్ద డబ్బు లేకపోతే, మీరు ప్రభుత్వ ముద్ర పథకం నుండి రుణం తీసుకోవచ్చు. కెవిఐసి నివేదిక ప్రకారం ఉల్లి పేస్ట్ తయారీ యూనిట్ ఏర్పాటుకు అయ్యే మొత్తం ఖర్చు రూ.4,19,000.