- ఏజెన్సీ ప్రాంతాల్లో గౌడులకు న్యాయం చేయండి
- ఉచిత సిద్ధ వైద్య శిబిరాన్ని ప్రారంభించిన శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్
- ఆదివాసీ విద్యార్థుల ఉన్నత విధ్య కోసం ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలి
- ఘనంగా పాడి కౌశిక్ రెడ్డి జన్మదిన వేడుకలు.
- పృధ్వీరాజ్ చౌహాన్ విగ్రహ ప్రతిష్టకు స్థలం కేటాయించాలి
- అమిత్ షా ను అరెస్టు చేసి బర్తరఫ్ చేయాలి:
- తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవ సంస్థ ఆధ్వర్యంలో
- అమిత్ షా ,పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు..!
Author: rayala polayya
కెటీపీఎస్ యాష్ టెండర్ అర్హత కలిగిన గిరిజన కాంట్రాక్టర్లకు సెల్ ఆర్డర్ వెంటనే ఇవ్వాలి- ఇందూర్ వార్త ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి నవంబర్ 16 సేవాలాల్ సేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ధరావత్ సురేష్ నాయక్ సేవాలాల్ సేన రాష్ట్ర కార్యదర్శి భూక్య శ్రీను నాయక్ డిమాండ్ చేశారు ఈరోజు పాల్వంచ కెటీపీఎస్ యాష్ టెండర్ అర్హత కలిగిన గిరిజన కాంట్రాక్టర్ల రిలే నిరాహార దీక్షకు పాల్వంచ సేవాలాల్ సేన మండల కమిటీ ఆధ్వర్యంలో *మండల అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నాయక్ అధ్యక్షతన సంఘీభావం తెలపడం జరిగింది* ఈ కార్యక్రమానికి ఉద్దేశించి సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షులు ధరావత్ సురేష్ నాయక్. రాష్ట్ర కార్యదర్శి భూక్య శ్రీను నాయక్ మాట్లాడుతూ కేటీపీఎస్ యాజమాన్యం ఏజెన్సీ చట్టాలను తుంగల తొక్కి నిబంధనలకు విరుద్ధంగా నడుచుకుంటుందని అన్నారు ఐటీడీఏ పీవో మరియు కేటీపీఎస్ యాజమాన్యం వారు సెలక్ట్ చేసిన…
రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోలు చేపట్టాలి : అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్. ఇందూర్ వార్త నవంబర్16 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి ములకలపల్లి మండలం మాదారం గ్రామంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ శనివారం పరిశీలించారు. రైతుల నుంచి ఇప్పటివరకు సేకరించిన ధాన్యం నిల్వల గురించి కేంద్రాల నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతుల సౌకర్యార్థం కేంద్రంలో అందుబాటులో ఉంచిన సదుపాయాలను ఆయన పరిశీలించారు. కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చిన రైతులను పలకరించి,కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అని ఆరా తీశారు. రైతుల సౌకర్యార్థం కేంద్రాల్లో టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని,ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ.. ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి స్థాయి లక్ష్యానికి అనుగుణంగా సాఫీగా సాగేలా కృషి చేయాలని అన్నారు. రైతులు ధాన్యం తెచ్చిన వెంటనే…
మణుగూరు ఏజెన్సీ పరిధిలో ప్రైవేట్ పాఠశాలల డ్రైవర్లకు, క్లీనర్లకు చట్ట బద్ద హక్కులు అమలు చేయాలి ఇందూరు వార్త నవంబర్ 16 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి మండల విద్యాధికారిణి స్వర్ణ జ్యోతి మరియు కార్మిక శాఖ అధికారి బి నాగరాజు లకు వినతి పత్రాలు అందజేసిన సామాజిక సేవకులు మణుగూరు ఏజెన్సీ పరిధిలో ప్రైవేట్ పాఠశాలల డ్రైవర్లకు, క్లీనర్లకు చట్ట బద్ద హక్కులు అమలు చేయాలనీ కోరుతూ శనివారం నాడు మణుగూరు మండల విద్యాధికారిణి స్వర్ణ జ్యోతి మరియు కార్మిక శాఖ అధికారి బి. నాగరాజు లకు వినతి పత్రాలు అందజేసినట్లు సామాజిక సేవకులు కర్నె బాబురావు విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మణుగూరు ఏజెన్సీ పరిధిలోని ప్రైవేటు పాఠశాలల్లో స్కూల్ బస్సులపై పనిచేస్తున్న డ్రైవర్లకు క్లీనర్లకు చట్టబద్ధ హక్కులు అమలు కావడం లేదనీ. వీరికి తప్పనిసరిగా అమలు చేయాల్సిన ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ కూడా అమలు…
పోలీస్ బ్యాడ్జిల్లో మార్పు చేయాలని ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం ఇందూరు వార్త నవంబర్ 16 న్యూస్ బ్యాడ్జిల్లో టి ఎస్ పి స్థానంలో టీజీపీ , తెలంగాణ స్టేట్ పోలీస్ స్థానంలో తెలంగాణ పోలీస్, టి ఎస్ ఎస్ పి స్థానంలో టీజీ ఎస్పీ టిఎస్పిఎస్ స్థానంలో టి జి పి ఎస్ ఉండే విధంగా బ్యాడ్జిలను మార్చాలని హోంశాఖ కార్యదర్శి రవి గుప్తా ఆదేశాలు జారీ.
జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు ఇందూర్ వార్త నవంబర్ 16 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి నిజాన్ని నిర్భయంగా, నిస్వార్థంగా తమ గళంతో, కలంతో ప్రపంచానికి వినిపిస్తూ ప్రజలను చైతన్య పరుస్తు,పాత్రికేయ వృత్తిలో జీవనం కొనసాగిస్తూ ఎన్నో కష్ట,నష్టాలను అనుభవిస్తూ,నిజాయితీ గా పనిచేస్తున్న ఎందరో పాత్రికేయ మిత్రులకు, జర్నలిస్టులను ఆదరిస్తున్న పాఠకులకు, జాతీయ పత్రిక దినోత్సవ శుభాకాంక్షలు మద్దిశెట్టి సామెలు, ఆల్ ఇండియా దళిత్ యాక్షన్ కమిటీ జాతీయ ప్రధాన కార్యదర్శి.
జగమంత వర్ధిల్లాలి నీ రాతలతో పాత్రికేయ మిత్రులకు అభినందనలతో… నా కవిత అంకితం) శీర్షిక:జగమంతా వర్ధిల్లాలి నీ రాతలతో..!( కలం కార్మికులు) ఇందూరు వార్త నవంబర్ 16 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి కనపడని నిజాన్ని వెతుకుతూ కళ్ళతో పదే పదే పరిశీలిస్తూ వాస్తవాలను కళ్ళ ముందు ఉంచేందుకు నిజాన్ని నిర్భయంగా ప్రకటిస్తావు.. జగమంతా వర్ధిల్లాలి నీ రాతలతో అక్షరానికి నీవే అసలైన బలం వాస్తవాలకు నిలువెత్తు రూపం నీ అక్షరం లోక కళ్యాణం కాంక్షించే నిజమైన అస్త్రం.. అవినీతి లేని సమాజానికి అక్షర రూపంలో పోరాడుతూ కాలంతో నిత్యం పరిగెడుతూ నీదైనా భావాన్ని నేలంతా పంచుతావు.. కలాన్ని కాగితంపై ఉంచి లోకమంతా వినిపించేలా గర్జిస్తావు చీకటి రాత్రుల్లో జరిగే ఘోరాలను కలం నేత్రంతో వెలుగులోకి తెచ్చావు… వార్తలను అందించడంలో ప్రసవ వేదన సంఘటనను అక్షర రూపంలో చిత్రించి వార్తా పత్రికలో ప్రచురించే వరకు కష్టమంతా వర్షించే సిరా చుక్కల…
కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసిన ఆర్ఎం ప్రశాంత్ ఇందూరు వార్త నవంబర్ 15 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం పాత పాల్వంచ శ్రీ ఆత్మలింగేశ్వర శివాలయం కార్తీక పౌర్ణమి సందర్భంగా అద్భుతంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలవకుండా ఏర్పాట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు మచ్చ శ్రీనివాస్ రావు కి మరియు కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ శివ దర్శనం చేసుకోవడం అదృష్టంగా భావిస్తూ భక్తులకు అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అరేం ప్రశాంత్ సామాజిక సేవా కార్యకర్త జి ఎస్ ఎస్ రాష్ట్ర యువజన నాయకులు
తేమ, తరుగు పేరు తో రైతులను ఇబ్బంది పెట్టవద్దు ఇందూరు వార్త నవంబర్ 15 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి గొనె సంచులు అందుబాటులో ఉంచాలి. కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలి. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. పాల్వంచ మండలం సోములుగూడెం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె సాబీర్ పాషా, డిసిఏంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాథం, పాల్వంచ ఎంపీడీవో, ఎంపీవో, సొసైటీ ఉపాధ్యక్షుడు, డైరక్టర్లు, సీపీఐ, కాంగ్రెస్ జిల్లా నాయకులు, వివిధ శాఖల అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
జగ్గారంలో బిర్స ముండా 150వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఇందూరు వార్త నవంబర్ 15 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి జగ్గారం పంచాయతీ కార్యాలయంలో ఆదివాసి జాతి పోరాట వీరుడు బిర్స ముండా జన్మదినోత్సవం ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు గ్రామ ప్రజలతో గ్రామసభ ఏర్పాటు చేసి వేడుక నిర్వహించారు .. జన్మదినోత్సవం వేడుకని ఉద్దేశించి మాట్లాడుతూ గిరిజన జాతి పట్ల బ్రిటిష్ ప్రభుత్వం పాలనలో ఆదివాసి జాతికి అన్యాయం జరుగుతుంది అని అతి చిన్న వయసులోనే గుర్తించి పోరాట మార్గాన్ని ఎంచుకొని ప్రజలకి తెలియపరచి ఉద్యమం వైపు నడిపించిన వీరుడు బిర్స ముండా అనీ కొనియాడినారు. బిర్స ముండని రెండు సంవత్సరాలు జైలు లో నిర్బంధించినారు. బిర్స ముండా ఆదివాసులకు వైద్యుడు అడివిలో దొరికే అటవీ వనమూలికలతో వైద్యం అందించి నయం చేసేవారు. ఈ విధంగా చేస్తూ మద్యపాన నిషేధం. మతం మార్పు విధానంపై బలిదానాలపై మాంసాహరాలపై వ్యతిరేకమైన కార్యక్రమాలు…
కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీశ్రీ పృద్వి రామలింగేశ్వర స్వామి శివాలయం దర్శించుకున్న ములకలపల్లి మాజీ జడ్పిటిసి. సున్నం నాగమణి సున్నం సత్యనారాయణ దంపతులు. ఇందూరు వార్త నవంబర్ 15 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి అశ్వారావుపేట నియోజకవర్గ ములకలపల్లి మండల కేంద్రంలో శ్రీ శ్రీ పృద్వి రామలింగేశ్వర స్వామి శివాలయం దర్శించుకుని , కార్తీక పౌర్ణమి దీపాలు వెలిగించి , ప్రత్యేక పూజలు చేసిన ములకలపల్లి మాజీ జడ్పిటిసి. సున్నం నాగమణి- సున్నం సత్యనారాయణ దంపతులు మరియు ములకలపల్లి మాజీ ఎంపీటీసీ శనగపాటి మెహరమణి- శనగపాటి సీతారాములు దంపతులు.