- ఏజెన్సీ ప్రాంతాల్లో గౌడులకు న్యాయం చేయండి
- ఉచిత సిద్ధ వైద్య శిబిరాన్ని ప్రారంభించిన శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్
- ఆదివాసీ విద్యార్థుల ఉన్నత విధ్య కోసం ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలి
- ఘనంగా పాడి కౌశిక్ రెడ్డి జన్మదిన వేడుకలు.
- పృధ్వీరాజ్ చౌహాన్ విగ్రహ ప్రతిష్టకు స్థలం కేటాయించాలి
- అమిత్ షా ను అరెస్టు చేసి బర్తరఫ్ చేయాలి:
- తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవ సంస్థ ఆధ్వర్యంలో
- అమిత్ షా ,పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు..!
Author: ఇందూర్ వార్త
ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు కౌడిపల్లి మండల నూతన ఎస్ఐ రంజిత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కోట్టాల గ్రామ సర్పంచ్ నరహరి కాంగ్రెస్ నాయకుడు కొండాపురం రమేష్ మరియు మంగలి వీరేష్ మర్యాదపూర్వకంగా కలిసి సన్మానం చేయడం జరిగినది.
ఇందూర్ వార్త ప్రతినిధి రాజు పైడి శ్రీధర్ గుప్తా అరెస్టు చేసిన పోలీస్ శాఖ18/04/2024 నాడు తెలంగాణ ప్రభుత్వము మరియు సివిల్ సప్లై కార్పొరేషన్ మెదక్ జిల్లామోసం చేసి వడ్లను ప్రభుత్వము నుండి పైడి శ్రీధర్ గుప్తా తన రైస్ మిల్లర్ లు శ్రీపాద, శ్రీ వేంకటేశ్వర మరియు శివ సాయి రైస్ మిల్లులకు వడ్లను తీసుకొని దానికి బదులుగా తగిన బియ్యాన్ని ఇవ్వకపోగా , ప్రభుత్వానికి చెల్లించాల్సిన 47 కోట్ల రూపాయలను ఇవ్వకుండా ప్రభుతాన్ని మోసం చేసిన పైడి శ్రీధర్ గుప్తా నీ నర్సాపూర్ యస్.ఐ. జె శివకుమార్, జ్యుడీషియల్ రిమాండ్ కి మూడు కేసులకి సంబంధించి జైలుకి తరలించడం జరిగింది. అని ఎస్ఐ శివకుమార్ తెలిపారు
ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు విద్యుత్ అంతరాయంఈనెల 18న కౌడిపల్లి,సబ్ స్టేషన్ లో మెయింటెనెన్స్ వర్క్ ఉండడంతో కౌడిపల్లి, కొల్చారం, చిలిపిచెడ్ మండలాల్లో గురువారం ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ కోత విధించడం జరుగుతుంది. వినియోగదారులు సహకరించ గలరుAE కోటేశ్వరరావులైన్మెన్ శివకుమార్
ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గమైన కౌడిపల్లి మండలం తునికి గ్రామంలో వాటర్ ట్యాంక్ దగ్గర పైపుల నుండి లీకేజ్ వల్ల నీళ్లు మొత్తం వృధాగా రోడ్డుపై గుంతలలో నిలిచాయి. తునికి గ్రామంలో నల్ల పోచమ్మ తల్లి అమ్మవారి దర్శనం చేసుకోవడానికి చాలామంది భక్తులు ఆ దారి గుండా వెళ్తూ ఉంటారు భక్తులకు అక్కడ ఉండే గ్రామస్తులకు ఇబ్బందికరంగా మారింది. ఇప్పటికైనా అధికారులు అప్రమత్తమై నీటి లీకేజీని ఆపాలి
ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు అభయ హస్తం గ్యారంటీ ల పథకాలకు సంబందించిన గ్రామ సభ రెండు గంటల పాటు తీవ్ర ఉద్రిక్తత కు దారి తీసింది.ఈ కార్యక్రమానికి మండల తహశీల్దార్ గారు వారి టీం తో వచ్చిన సందర్భంగా సర్పంచ్ ఖాజీపేట రాజేందర్ మాట్లాడుతూ కౌడిపల్లి నుండి వెల్మకన్నే గ్రామానికి వచ్చే దారికి ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమి కబ్జాకు గురి అవుతున్న విషయం గతంలో ఉన్న సర్పంచ్ వడ్ల శ్రీనివాస్ మరియు నేను సర్పంచ్ అయిన తర్వాత కూడా వ్రాత పూర్వకంగా చాలా సార్లు ఇచ్చిన కూడా పట్టించుకోక పోవడం ఏంటని తహశీల్దార్ గారిని ప్రశ్నించారు. చాలా సార్లు మండల సర్వ సభ్య సమావేశంలో కూడా చెప్పినప్పటికీ ఎందుకు స్పందించడం లేదని వెల్మకన్నే సర్పంచ్ ఖాజీపేట్ రాజేందర్ అన్నారు. వెల్మకన్నే రెవెన్యూ పరిధిలో ఉన్న సర్వే నంబర్ 444, 447 లో ఉన్న విలువైన ప్రభుత్వ భూమి ప్రజల కోసం ముందు…
ఇందూర్ వార్త హైదరాబాద్ బ్యూరో, HP, BPCL, IOC కంపెనీలలో పెట్రోల్, డీజిల్ నింపుకొని ట్యాంకర్లతో డ్రైవర్లు బయలుదేరారు. కాసేపట్లో పెట్రోల్ బంకులకు ఆయిల్ ట్యాంకర్లు చేరుకోనున్నాయి. రాత్రిలోపు అన్ని బంకులలో యథావిధిగా ఇంధన నిల్వ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లు ధర్నా విరమించారు. HP, BPCL, IOC కంపెనీలలో పెట్రోల్, డీజిల్ నింపుకొని ట్యాంకర్లతో డ్రైవర్లు బయలుదేరారు. కాసేపట్లో పెట్రోల్ బంకులకు ఆయిల్ ట్యాంకర్లు చేరుకోనున్నాయి. రాత్రిలోపు అన్ని బంకులలో యథావిధిగా ఇంధన నిల్వ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.తెలంగాణలో పెట్రోల్‌కు ఎలాంటి సమస్య లేదు. మెటల్ వెకిల్ యాక్ట్ సవరణలో భాగంగా నిరసన తెలిపింది నిజం. కానీ రేపు ఎల్లుండి పెట్రోల్ బంక్ లు బంద్ అంటూ వస్తున్న వార్తలు సరికాదు. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది లేదు. అన్ని బంక్ లో పెట్రోల్ అందుబాటులో ఉంది. గాబరపడి ఎక్కువ మొత్తంలో ఎవరు పెట్రోల్, డీజిల్ కొనుగోలు…
ఇందూర్ వార్తా ప్రతినిధి రాజునర్సాపూర్ నియోజకవర్గం,వెల్దుర్తి మండల కేంద్రంగా అభయహస్తం గ్యారెంటీల దరఖాస్తు స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి వాకిటి సునితాలక్ష్మారెడ్డి బిఆర్ఎస్ కార్యకర్తలు
ఇందూర్ వార్త ప్రతినిధి రాజురైస్ మిల్ అసోసియేషన్ తరఫున 2024 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి వాకిటి సునితాలక్ష్మారెడ్డి అసోసియేషన్ నాయకులు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రజా ప్రతినిదులు పాల్గొన్నారు
ఇందూర్ వార్తా ప్రతినిధి రాజుమెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గమైన కౌడిపల్లి మండలం వెల్మకన్నె గ్రామంలో శ్రీ రాయగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. వారు వారి యొక్క మొక్కులను మొక్కుకున్నారు. భక్తుల మధ్య భజనలతో స్వామివారిని దర్శించుకుంటే కన్నులకు చూడనీకి కనువిందుగా ఉందివైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం.. ప్రత్యేకత ఏంటిమార్గశిర మాసం శ్రీమహావిష్ణువుకు అంత్యంత ప్రీతికరమైంది. ఈ నెల మధ్యలోనే ధనుర్మాసం ప్రారంభమవుతుంది. శ్రీరంగనాథునిగా అవతరించిన శ్రీహరిని గోదాదేవి ధనుర్మాసంలో భక్తితో పూజించి తన భర్తగా పొందింది. రోజుకో పాసురంతో శ్రీమన్నారాయణుని స్తుతించిన గోదాదేవి ఆయనను ప్రసన్నంగా చేసుకుంది. ఇక, పుష్యమాసంలో వచ్చే శుక్షపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, పుత్రదా ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజున ఉత్తర ద్వారంలో శ్రీమన్నారాయణుని దర్శించుకోవాలని భక్తులు ఎంతో ఆరాటపడతారు. ఏడాదికి వచ్చే ఇరవైనాలుగు ఏకాదశుల్లో ప్రతిదీ పవిత్రమైందే. కానీ, వీటిలో వైకుంఠ…
ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు రైతులు ఉచిత పశువైద్యశిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కౌడిపల్లి పశువైద్యాధికారి రాజు అన్నారు. బుధవారం కౌడిపల్లి మండలం బుజరంపేట గ్రామంలో విజయ డైరీ,పశుగణాభివృద్ది సంస్థమెదక్ మరియు కౌడిపల్లి పశువైద్య, పశుసంవర్ధక వారి అద్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా కౌడిపల్లి పశువైద్యదికారి రాజు మాట్లాడుతూ ఈ రోజు నిర్వహించిన శిబిరంలో 10 ఉచిత కృత్రిమ గర్భధారణ,28 దూడలకు నట్టాల నివారణకు మందులు త్రాగించడం,20 గర్భకోశ వ్యాధులను గుర్తించి చికిత్స,సాధారణ చికిత్సలు 30 పశువులకు చేయడం జరిగిందని తెలిపారు.పశుసంవర్ధక శాఖ అద్వర్యం లో ఏర్పాటు చేసిన పశువైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకుని తమ పశువులను కాపాడుకోవాలని,ఏవైనా సమస్యలు ఉంటే తమకు తెలియజేయాలని రైతులకు సూచించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ వనజ శ్యామ్ సుందర్,ఉప సర్పంచ్ సాయిలు,ఎంపిటిసి లింగం, జేవివో కృష్ణ కుమార్, వెటర్నరీ అసిస్టెంట్ చెన్నయ్య,పంచాయతీ సెక్రటరీ రాజిరెడ్డి, విజయ డైరీ భారత్ గోపాల మిత్ర సూపర్ వైసార్…