Author: ఇందూర్ వార్త

ఇందూర్ వార్త ప్రతినిధి రాజుఇందూర్ వార్తా ప్రతినిధి రాజు: మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం, కుల్చారం మండలం చిన్న ఘన్‌పూర్ గ్రామానికి చెందిన శాంసన్ గారు అనారోగ్యంతో బాధపడుతుండటంతో వారికి హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో అత్యవసర చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు చేయించిన 3,50,000/- రూపాయల LOC (Letter Of Credit) పత్రాలను ఈ రోజు హైదరాబాద్ క్యాంప్ కార్యాలయం లో వారి కుటుంబసభ్యులకు అందజేసిన తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునితా లక్ష్మారెడ్డి

Read More

‌మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తహసిల్దార్ కార్యాలయం చుట్టూ కుల వృత్తుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లక్ష రూపాయలు రుణం కోసం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు గత వారం పది రోజులుగా కౌడిపల్లిలోని మీసేవ తాసిల్దార్ కార్యాలయాని చెప్పులు అరిగేలా తిరుగుతున్నారు ఒకవైపు భానుడీ ప్రతాపం మరోవైపు సర్వర్ రాకపోవడంతో మీసేవ దగ్గర తాసిల్దార్ ఆఫీస్ దగ్గర ప్రజలు పడిగాపులు కాస్తున్నారు. ఉదయం తాసిల్దార్ ఆఫీస్ తీసిన నుండి సాయంత్రం ఆఫీస్ మూసి వేసేంతవరకు ఆకలితో అలమటిస్తూ ఎండలో నిలబడుతూ దాహానికి ఓపికతో ఉంటూ తాసిల్దార్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు సర్వర్ రాకపోవడంతో ప్రజలు తాసిల్దార్ ఆఫీస్ ముందు కూర్చున్నారు నర్సాపూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాలలో ఇదే పరిస్థితి అలాగే కాల వ్యవధిని పెంచాలని కోరుతున్నారు

Read More