Author: లింగాల నవీన్ గౌడ్

నేటి నుండి అయ్యప్ప ఆలయంలో నిత్య అన్న ప్రసాదం….. బిక్కనూరు మండల ఇందూర్ వార్త / భిక్నూర్ , వెబ్ డెస్క్ కేంద్రంలో గల హరిహరపుత్ర అయ్యప్ప ఆలయంలో శుక్రవారం నుండి నిత్య అన్నదాన ప్రసాద కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుందని అన్నదాన సేవా సమితి అధ్యక్షులు వెంకట సుబ్బారావు చెప్పారు. గురువారం అయ్యప్ప ఆలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అయ్యప్ప మాల ధరించిన భక్తులతోపాటు శివమాల హనుమాన్ మాలలు ధరించిన భక్తుల సౌకర్యార్థం ఇట్టి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. వచ్చే ఏడాది జనవరి 20 వరకు నిత్య అన్నప్రసాద కార్యక్రమం కొనసాగుతుందని ఆయన చెప్పారు .ఇట్టి కార్యక్రమాన్ని మాల ధరించిన భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అయ్యప్ప స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. భక్తుల సహకారంతో మండల కేంద్రంలో గల అయ్యప్ప స్వామి ఆలయాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి…

Read More

పకృతి విపత్తుల నుంచి మానవ, వృక్ష , జంతు జాతులను కాపాడిన మహనీయుడు కౌండిన్య మహర్షి జై గౌడ ఉద్యమం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు రంగోల్ల మురళి గౌడ్ ఘనంగా కౌండిన్య మహర్షి జయంతి ఇందూర్ వార్త వెబ్ డెస్క్ పకృతి విపత్తుల నుంచి మానవ, వృక్ష , జంతు జాతులను కాపాడిన మహనీయుడు కౌండిన్య మహర్షి అని జై గౌడ ఉద్యమం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు రంగోల్లు మురళి గౌడ్ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జై గౌడ ఉద్యమం కార్యాలయంలో కౌండిన్య మహర్షి జయంతి ఉత్సవాలను శుక్రవారం ఘనంగా నిర్వహించి మాట్లాడారు .దేశవ్యాప్తంగా కౌండిన్య వారసులు పర్యావరణ రక్షణకై, ప్రజారక్షణకై నిరంతరం పోరాడుతున్నారు అని అన్నారు. కౌండిన్య ధర్మం ప్రకారం గౌడ్ లంతా పర్యావరణ పరిరక్షణకు, మానవ ధర్మ పరిరక్షణకు, బహుజన వర్గాలంతా ఐకమత్యంగా ఉండేలా కృషి చేయాలని రంగోల మురళి గౌడ్ అన్నారు.కౌండిన్య జయంతిని వాడవాడలా నిర్వహించి…

Read More

డబ్బులు తిరిగి ఇవ్వలేదని వృదుడి హత్య బాన్సువాడ ఇందూర్ వార్త నవంబర్ 15 బాన్సువాడ పట్టణంలో సరస్వతి టెంపుల్ కాలనీలో మంగళవారం రాత్రి జరిగిన సంఘటన కొండ వెంకన్న అనే వృద్ధుడి హత్య కేసుని పోలీసులు ఛేదించి, ఈ హత్యకు పాల్పడిన నిందితులని పోలీసులు కష్టానికి తీసుకున్న విషయం తెలిసిందే, వివరాల్లోకి వెళితే పాత బాన్సువడ్కు చెందిన కొండ వెంకన్న అనే వృద్ధుడు సరస్వతి మందిర్ పరివాహక ప్రాంతాల్లో నూతనంగా నిర్మిస్తున్న భవనం సబ్బాని ప్రకాష్ ఇంటికి వాచ్మెన్ గా పనిచేస్తూ ఉన్నట్టు తెలిఅయింది, అదే ప్రాంతంలో పక్కన ఉన్న అపార్ట్మెంట్లో వాచ్మెన్ గా పనిచేస్తున్నటువంటి పోల్కం వీరయ్య అనే వ్యక్తి 25000 వేలు వృద్ధుడికి అవసర నిమిత్తము ఇవ్వగా, వృద్ధుడు తిరిగి ఇవ్వకపోవడంతో అతన్ని హత్య చేసినట్టు హంతకుడు వీరయ్య నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది, గొడ్డలితో వృద్ధున్ని గొంతుపై, తలపై,ఎడమ చేతికి గాయం చేసి చంపినట్టుగా నిందితుడు వీరయ్య ఒప్పుకోవడం…

Read More