Author: indurvaartha (ఇందూర్ వార్త)

ఇందూర్ వార్త బాన్సువాడ రూరల్ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పేదింటి ఆడబిడ్డల వివాహానికి లక్ష 116 వేల రూపాయలు అందిస్తు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడబిడ్డలకు మేన మామగా మారారని మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ అన్నారు. శనివారం బాన్స్ వాడ మున్సిపల్ కార్యాలయంలో జిల్లా రైతుబంధు అధ్యక్షుడు అంజిరెడ్డి తో కలిసి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, జిల్లా రైతుబంధు అధ్యక్షుడు అంజిరెడ్డి, ఆర్ఐ అశోక్, నాయకులు ఏజాస్, కౌన్సిలర్లు బాడీ శ్రీనివాస్, నార్ల నందకిషోర్ గుప్తా, మోతిలాల్, నాయకులు వహాబ్, అమిర్ ఛావుస్, హకీమ్, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Read More

-మాస్టర్ ప్లాన్ లో ఎమ్మెల్యే గంప గోవర్ధన్, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబోద్దీన్, మున్సిపల్ వైస్ చైర్మన్ భర్త గడ్డం చంద్రశేఖర్ రెడ్డిలకు భాగస్వామ్యం ఉందని ఆరోపన -మాస్టర్ ప్లాన్ విషయం ఇద్దరికి తెలుసు -బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి   కామారెడ్డి కొత్త మాస్టర్ ప్లాన్ విషయంలో ఎమ్మెల్యే గంప గోవర్ధన్, మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఇద్దరు తోడు దొంగలేనని బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. నూతన మాస్టర్ ప్లాన్ తో భూములు కోల్పోతున్న రైతులకు మద్దతుగా బీజేపీ ఆధ్వర్యంలో శనివారం మున్సిపల్ కార్యాలయం ముందు బీజేపీ నిరసన కార్యక్రమం చేపట్టింది. రైతుల భూములు కోల్పోయేలా రూపొందించిన మాస్టర్ ప్లాన్ నిర్ణయాన్ని తక్షణమే రద్దు చేయాలని నినాదాలు చేశారు. ప్రభుత్వానికి, ఎమ్మెల్యే గంపకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కాటిపల్లి…

Read More