- ఏజెన్సీ ప్రాంతాల్లో గౌడులకు న్యాయం చేయండి
- ఉచిత సిద్ధ వైద్య శిబిరాన్ని ప్రారంభించిన శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్
- ఆదివాసీ విద్యార్థుల ఉన్నత విధ్య కోసం ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలి
- ఘనంగా పాడి కౌశిక్ రెడ్డి జన్మదిన వేడుకలు.
- పృధ్వీరాజ్ చౌహాన్ విగ్రహ ప్రతిష్టకు స్థలం కేటాయించాలి
- అమిత్ షా ను అరెస్టు చేసి బర్తరఫ్ చేయాలి:
- తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవ సంస్థ ఆధ్వర్యంలో
- అమిత్ షా ,పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు..!
Author: indurvaartha (ఇందూర్ వార్త)
సివిల్ సప్లై అమాలీల డిమాండ్ పరిష్కరించాలని అంబేద్కర్ కు వినతి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సివిల్ సప్లై అమాలీలు చేస్తున్న నిరవధిక సమ్మెలో భాగంగా బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హమాలీలకు క్వింటాలుకు ఎగుమతి దిగుమతికి 30 రూపాయలు, మరణించిన అమాలి కార్మికునికి 10 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేశియా చెల్లించి హమాలీలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షుడు దుబాస్ రాములు, డివిజన్ కన్వీనర్ శంకర్, భూమయ్య, హన్మండ్లు, సాయిలు, షాబుద్దీన్, హమాలీలు తదితరులు పాల్గొన్నారు.
పాఠశాలలను తనిఖీ చేసిన బాన్సువాడ ఎంపీపీకామారెడ్డి జిల్లా/బాన్సువాడ ( ఇందూర్ వార్త) డిసెంబర్ 20బాన్సువాడ మండలం పరిధిలోని దుంకుడు మొర్రి తాండా, మోగులాన్ పల్లి గ్రామాలలోని అంగన్వాడీ కేంద్రం, ప్రాథమీక పాఠశాల లను బాన్సువాడ ఎంపిపి దొడ్ల నీరజా వెంకట్ రామ్ రెడ్డి స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా అక్కడ ఉన్న చిన్నారులు బాలింతలు, విద్యార్థిని విద్యార్థులతో ఎంపిపి ముచ్చటించారు. మధ్యాహ్నం భోజనం రుచికరంగా ఉంటున్నయా, సమయాని భోజనం అందిస్తున్నార, గ్రుడ్డు మరియు పాలు చిన్నారులకు బాలింతలకు అందిస్తున్నార అని వివరాలను అడిగి తెలుసుకున్నారు.అదేవిధంగా పాటశాల తరగతి గదులు, వంట గది, పాటశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని అంగన్వాడీ కేంద్రం సిబ్బంది కి మరియు పాటశాల సిబ్బందికి సూచించారు.ఈ కార్యక్రమంలో వారితో పాటు సభాపతి వ్యక్తిగత సహాయకులు భగవాన్ రెడ్డి, గ్రామ సర్పంచ్లు, గ్రామ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబానికి ఎక్స్ గ్రేషియా అందజేత ఇందూర్ వార్తబీర్కూర్ 20 డిసెంబర్గతంలో ఉపాధి హామీ పని చేస్తూ ప్రమాదశత్తు పాముకాటుకు గురైన దూలిగా లింగమయ్య అనే ఉపాధి కూలీ మరణించడం జరిగింది. ఉపాధి హామీ కూలి చేస్తూ మరణించడంతో అతనికి 2, 00000 రూపాయల ఎక్స్ గ్రేషియా ను అతని భార్య ధూళిగా యాదమ్మకు మాజీ జడ్పిటిసి సభ్యులు ద్రోణవల్లి సతీష్ అందజేయడం జరిగింది. అలాగే ధూళిగా లింగమయ్యకు ప్రైవేట్ హాస్పిటల్ లో వైద్య ఖర్చులకు అయినా73223 రూపాయల మంజూరు పత్రాలను అందజేయడం జరిగింది. కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి సభ్యులు ద్రోణవల్లి సతీష్, ఎంపీడీవో భాను ప్రకాష్ , ఎమ్మార్వో రాజు, బీర్కూర్ గ్రామ రైతుబంధు అధ్యక్షులు అవారి గంగారం, జడ్పిటిసి స్వరూప, ఎంపిటిసి సందీప్, కిష్టాపూర్ సర్పంచ్ పుల్లేని బాబురావు, అన్నారం సర్పంచ్ కృష్ణారెడ్డి, ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
ఉత్తమ ఫలితాలు కనపరిచిన విద్యార్థులకు ప్రశంసపత్రాలు అందించిన కొమ్మనేని రవీందర్(ఇందూర్ వార్త) దంతాలపల్లి:డిసెంబర్ 2౦ దంతాలపల్లి మండలం దాట్ల గ్రామపంచాయతీ యందు ఇటీవల ఎంపీపీ ఎస్ దాట్ల పాఠశాల విద్యార్థులు జిల్లా స్థాయి జూనియర్ అథ్లెటిక్స్ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ పోటీలలో ఎంపికై హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియం యందు ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నేడు దాట్ల గ్రామపంచాయతీ కార్యాలయం నందు గ్రామ సర్పంచ్ గౌరవనీయులు శ్రీ కొమ్మినేని రవీందర్ గారి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందజేయడం జరిగింది ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గారు మాట్లాడుతూ భవిష్యత్తులో ఇంకా మెరుగైన ప్రతిభ కనబరిచి జాతీయస్థాయిలో కూడా ఎంపిక కావాలని గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారి సహకారం తో వీరికి స్పోర్ట్స్ స్కూల్స్ నందు అడ్మిషన్ కొరకు నా వంతుగా ప్రయత్నం చేస్తానని ప్రకటించారు అదేవిధంగా గత మూడు రోజుల క్రితం దంతాలపల్లి మండల…
పేదల ఆరోగ్య సేవలకు పెద్ద పీఠదోమకొండ లో అల్ట్రా సౌండ్ స్కానింగ్ ప్రారంభం (ఇందూరు వార్త) దోమకొండ, డిసెంబర్ 20 పేదల ఆరోగ్య సేవలకు తెలంగాణ లో కేసీఆర్ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని ప్రభుత్వ విప్ కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు దోమకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో అల్ట్రా సౌండ్ స్కానింగ్ మిషన్ మంగళ వారం ప్రారంభంచారు ముఖ్యమంత్రి కేసీఆర్ హాయంలో పేదల ఆరోగ్య సేవలకు, గర్భిణీ స్త్రీలకు మెరుగైన వైద్యం, రోగాల నిర్దారణ కు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తెలిపారు.కామారెడ్డి లో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు సకల ఏర్పాట్లు పూర్తి చేయాలనీ కోరారు. కామారెడ్డి లో వచ్చే ఏడాది ఎంబిబిఎస్ సీట్ల అడ్మిషన్లు ప్రారంభిస్తామన్నారు.100 బెడ్ల హాస్పిటల్ పనులు చురుకుగా సాగుతున్నాయన్నారు.23 కోట్ల రూపాయల తో కామారెడ్డి లో మరో 50 బెడ్ల హాస్పిటల్ ఇద్దరు మంత్రులు బుదవారం శంకుస్థాపన చేస్తారన్నారు. హాస్పిటల్ శంకుస్థాపనకు ఇద్దరు మంత్రులు స్పీకర్ పోచారం…
పేదల ఆరోగ్య సేవలకు పెద్ద పీఠదోమకొండ లో అల్ట్రా సౌండ్ స్కానింగ్ ప్రారంభం (ఇందూరు వార్త) దోమకొండ, డిసెంబర్ 20 పేదల ఆరోగ్య సేవలకు తెలంగాణ లో కేసీఆర్ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని ప్రభుత్వ విప్ కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు దోమకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో అల్ట్రా సౌండ్ స్కానింగ్ మిషన్ మంగళ వారం ప్రారంభంచారు ముఖ్యమంత్రి కేసీఆర్ హాయంలో పేదల ఆరోగ్య సేవలకు, గర్భిణీ స్త్రీలకు మెరుగైన వైద్యం, రోగాల నిర్దారణ కు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తెలిపారు. కామారెడ్డి లో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు సకల ఏర్పాట్లు పూర్తి చేయాలనీ కోరారు. కామారెడ్డి లో వచ్చే ఏడాది ఎంబిబిఎస్ సీట్ల అడ్మిషన్లు ప్రారంభిస్తామన్నారు.100 బెడ్ల హాస్పిటల్ పనులు చురుకుగా సాగుతున్నాయన్నారు.23 కోట్ల రూపాయల తో కామారెడ్డి లో మరో 50 బెడ్ల హాస్పిటల్ ఇద్దరు మంత్రులు బుదవారం శంకుస్థాపన చేస్తారన్నారు. హాస్పిటల్ శంకుస్థాపనకు ఇద్దరు మంత్రులు స్పీకర్…
గంప, షబ్బీర్ రైతు ద్రోహులు -ఇద్దరి దిష్టిబొమ్మలతో శవయాత్ర, దహనంకామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్, మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఇద్దరు రైతు ద్రోహులని కామారెడ్డి మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ భూ బాధిత రైతులు ఆరోపించారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని, తమకు న్యాయం చేయడంలో ఎమ్మెల్యే గంప గోవర్ధన్, మాజీ మంత్రి షబ్బీర్ అలీ విఫలమయ్యారని ఆరోపిస్తూ రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే గంప గోవర్ధన్ దిష్టిబొమ్మలతో శవయాత్ర నిర్వహించారు. కొత్త బస్టాండ్ వద్ద గలా సీఎస్ఐ గ్రౌండ్ నుంచి మున్సిపల్ కార్యాలయం మీదుగా నిజాంసాగర్ చౌరస్తా వరకు దిష్టిబొమ్మలతో శవయాత్ర చేపట్టారు. ఎమ్మెల్యే గంప, షబ్బీర్ అలీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.నిజాంసాగర్ చౌరస్తా వద్ద దిష్టిబొమ్మలను రోడ్డు మధ్యలో ఉంచి అంత్యక్రియలు చేపట్టి దహనం చేశారు. అనంతరం రేపు ఇద్దరికి పిండాలు పెట్టడం జరుగుతుందని ప్రకటించారు. ఈ సందర్భంగా…
మైనారిటీ రిజర్వేషన్ కొరకు వినతి పత్రం ఇచ్చిన రిజర్వేషన్ సాధన సమితి బాన్సువాడ పట్టణంలో సోమవారం మైనారిటీ రిజర్వేషన్ సాధన సమితి నాయకుడు అంజత్ ఖాన్ ఆధ్వర్యంలో రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయంలో పాలనాధికారికి మైనారిటీ రిజర్వేషన్ కొరకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సంధర్బంగా మైనారిటీ రిజర్వేషన్ సాధన సమితి నాయకులు అంజత్ ఖాన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మైనారిటీలకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 12% రిజర్వేషన్ ప్రకటించాలని అంజత్ ఖాన్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా రాష్ట్రంలోనే ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రత్యేకంగా జిఓ విడుదల చేసి మైనారిటీ రిజర్వేషన్ ఇవ్వాలని కోరారు. ఇప్పుడు జరుగుతున్న అన్ని ఉద్యోగ నియామకాలలో మైనారిటీ రిజర్వేషన్ 12% వర్తింపచేయాలని ఆయన డిమాండ్ చేశారు.
బాన్సువాడ ఎంపీపీ ఆకస్మికంగా తనిఖీ బాన్సువాడ మండలం, తాడకొల్ గ్రామ పంచాయితీ పరిధిలోని రాజారామ్ దుబ్బ ఏరియా లోని అంగన్వాడీ కేంద్రం ను బాన్సువాడ ఏంపిపి శ్రీమతి దొడ్ల నీరజా వెంకట్ రామ్ రెడ్డి, జెడ్పీటీసీ శ్రీమతి పద్మా గోపాల్ రెడ్డితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రం కు వచ్చే బాలింతలను, చిన్న పిల్లలను అడిగి భోజనం వసతి సదుపాయల గురించి వివరాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు గ్రామ సర్పంచ్ కుమ్మరి రాజమణి రాజు, మాజీ సర్పంచ్ గంగుల గంగారాం, ఎంపిటిసి ఇందిరా రాజు, గ్రామ పంచాయితీ కార్యదర్శి ప్రశాంతి, వార్డ్ మెంబర్లు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.