Author: indurvaartha (ఇందూర్ వార్త)

*రైతుల జోలికొస్తే కేసీఆర్ ను బొంద పెడతాం* -ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి రైతుల నోట్లో మట్టి కొట్టాలని చూసినా, రైతుల జోలికొచ్చినా కేసీఆర్ ను బొంద పెడతామని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు ఏనుగు రవీందర్ రెడ్డి హెచ్చరించారు. నలుగురి స్వలాభం కోసం 4 వేల మంది రైతులను రోడ్డున పడేస్తారా అని ప్రశ్నించారు. ఆదివారం సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలో కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ఇండస్ట్రియల్ జోన్ లో భూములు కోల్పోతున్న రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భూములు కోల్పోతున్న రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. రైతులంటే కేసీఆర్ కు చులకనగా ఉందన్నారు. రైతులు తలుచుకుంటే కేసీఆర్ ను బొంద పెడతారని, దానికోసం రైతులు రోడ్డుపైకి వచ్చే పరిస్థితి తీసుకురావద్దని హెచ్చరించారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేయకపోతే…

Read More

తెలంగాణ తిరుమల తిరుపతిని దర్శించుకున్న శాసనసభ స్పీకర్ఇందూరు వార్త : బీర్కూరు 24 డిసెంబర్  తెలంగాణ తిరుమల దేవస్థానం నందు శనివారం సందర్భంగా స్వామివారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు మరియు అదే విధంగా స్వామివారి సన్నిధానంలో జరుగు ధనుర్మాస ఉత్సవాలు తిరుప్పావై సేవ జనవరి 2 వైకుంఠ ద్వార దర్శనం వంటి కార్యక్రమాల ఏర్పాట్లు గురించి ఆలయంలో జరుగు పలు అభివృద్ధి కార్యక్రమా లు పరిశీలించారు అదేవిధంగా స్వామి వారి యొక్క హుండీ ఆలయ కమిటీ సభ్యులు భక్త మహాశయులు ఆధ్వర్యంలో లెక్కింపు నిర్వహించడం జరిగింది నాలుగు నెలల హుండీ ఆదాయం ఐదు లక్షల 46 వేల రూపాయలు మరియు 8 గ్రాముల బంగారం సుమారు 20 తులాల వెండి ఆలయ కమిటీ సభ్యులు మద్దినేని నాగేశ్వరావు గారు నరసరాజు గారు బోగవల్లి అప్పారావు గారు ఎంపిటిసి ఢీకొన్న మురళి గారు తిమ్మాపూర్ సర్పంచ్ మీనా…

Read More

టీపీసీసీ ఉప అధ్యక్షులు మదన్ మోహన్  అధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు: ఇందూర్ వార్త : డిసెంబర్ 24 ఎల్లారెడ్డి నియోజకవర్గం గాంధారీ మండలం గుడిమెట్ గ్రామస్థులు మదన్ మోహన్ ట్రస్ట్ సేవాకార్యక్రమలు మరియు నియోజకవర్గ ప్రజా సమస్యల పై ప్రజలతో కలిసి మదన్ మోహన్ గారు చేస్తున్న పోరాటాలు చూసి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గాంధారీ మండల అధ్యక్షులు తుర్పు రాజు, గ్రామ అధ్యక్షులు & ఉపాధ్యక్షులు మధుకర్ రావు, గణేష్, భాస్కర్, తాడ్వాయి మండల మైనారిటీ సెల్ అధ్యక్షులు శౌకత్ ఆల్లి, కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ సాజీధ్, మధన్ మోహన్ యూత్ ఫోర్స్ అధ్యక్షులు సర్దార్, సీతారాం, నరేందర్, నరేష్, భూమేష్ బీమార్, సాయిలు, దేమే శేఖర్, కరక్ వాడి శ్రీకాంత్, సాయిరాం, ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More

ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ ఇందూర్ వార్తదోమకొండ డిసెంబర్ 24ఈరోజు 24/12/22 దోమకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో క్రిస్మస్ సందర్భంగా బేతేలు యూత్ తరఫున పండ్ల పంపిణీ చేయడం జరిగింది.ఏసుక్రీస్తు జన్మించిన సందర్భంగా ఆయన బోధలకు స్పందించి ఆపదలో ఉన్న వారికి అనారోగ్యంతో బాధపడుతున్న వారిని పరామర్శించి వారికి పండ్లు పంపిణీ చేయడం జరిగింది అని పాస్టర్ సందీప్ చెప్పారుఇలాంటి కార్యక్రమాలు చేయడానికి యువకులు ముందుకు రావడం అభినందనీయమని డాక్టర్ గారు ప్రశంసించారు..ఈ కార్యక్రమంలో పాస్టర్ సందీప్ డాక్టర్ శరత్ కుమార్ , నర్సులు సిబ్బంది బెతల్ యూత్ సభ్యులు రఘుపతి, అక్షయ్,ప్రబాస్ , సుదీర్, పాల్గొన్నారు

Read More

మహాత్మ జ్యోతి పూలే గురుకుల పాఠశాల తనిఖీ చేసిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇందూర్ వార్తబీర్కూర్ 24 డిసెంబర్బీర్కూరు మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతీభా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల గురుకుల పాఠశాల (MJPTBCWREIS), (BC రెసిడెన్షియల్ స్కూల్ -బాలుర) ను ఈరోజు సాయంత్రం భోజన సమయంలో అకస్మీకంగా తనిఖీ చేసిన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి గారు.  వండిన ఆహార పదార్థాలను పరిశీలించిన స్పీకర్ పోచారం గారు. మేను ప్రకారం పప్పు దినుసులు, మసాలాలను వంటలలో వాడి నాణ్యమైన, రుచికరమైన భోజనం వండారా అని వార్డెన్, సిబ్బందిని ప్రశ్నించిన పోచారం గారు.అన్నం, కూరలు రుచిగా ఉన్నాయా, సరిపోయేంత పెడుతున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్న స్పీకర్ పోచారం గారు.నాణ్యమైన సరుకులు, కూరగాయలను కొనుగోలు చేసి రుచికరమైన ఆహారాన్ని వండాలి. మేను ప్రకారం ఆహార పదార్థాలు అందించాలని స్పీకర్ పోచారం గారు వార్డెన్, సిబ్బందికి సూచించారు.లేకపోతే చర్యలు తీసుకుంటాను.నూతనంగా నిర్మిస్తున్న…

Read More

డివైడర్ సెంటర్ లైటింగ్ కు 7.5 కోట్ల మంజూరుఇందూర్ వార్తబీర్కూర్ 24 డిసెంబర్ బీర్కూర్ గ్రామ ప్రజలు ఎన్నో రోజులు ఎదురు చూస్తున్న డివైడర్ సెంటర్ లైటింగ్ కు 7.5 కోట్ల రూపాయలు మంజూరు అయినట్లు శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ సెంటర్ లైటింగ్ బీర్కూర్ కామన్ నుంచి సిద్ధి వినాయక ఇండస్ట్రీస్ వరకు మంజూరైనట్లు తెలిపారు. ఈ సెంటర్ లైటింగ్ అందుబాటులోకి వస్తే లైటింగ్ తో కలకలాడుతుంది. ఈ సెంటర్ లైటింగ్ మంజూరు చేసినందుకు బీర్పూర్ గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు. 

Read More

మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్కామారెడ్డిలో కర్షకులు కదం తొక్కారు. మాస్టర్ ప్లాన్ వల్ల తమ బ్రతుకులు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో కామారెడ్డి మాస్టర్ ప్లాన్ బాధిత రైతులు ఆందోళన చేపట్టారు. చౌరస్థాను దిగ్బంధించారు. ధర్నా, రాస్తారోకో చేపట్టారు. రోడ్డుపై బైఠాయించారు. ఎమ్మెల్యే, గంప గోవర్ధన్, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అరగంటకు పైగా రైతులు ప్రధాన చౌరస్తాను దిగ్బంధించడంతో వాహనాల రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ సందర్బంగా రైతులు మాట్లాడుతూ.. మాస్టర్ ప్లాన్ ముసాయిదా ఎవరిని అడిగి తయారు చేసారని నిలదీశారు. నాయకులు కొనుగోలు చేసిన భూముల్లో చేస్తున్న రియల్ వ్యాపారం లాభాల కోసమే మాస్టర్ ప్లాన్ రూపొందించారని ఆరోపించారు. ఇండస్ట్రియల్ జోన్ లో పోతున్న తమ భూముల్లో కాయకష్టం చేసి పంట పండించుకుంటే జోన్ పేరుతో గద్దల్లా తన్నుకుపోతారా అని ప్రశ్నించారు.…

Read More

కాంగ్రెస్ నాయకుల సవాలుకు నేను సిద్ధం*-బీజేపీ నేత కాటిపల్లి వెంకట రమణారెడ్డికాంగ్రెస్ నాయకులు చేసిన సవాలుకు తాను సిద్ధమని బీజేపీ నేత కాటిపల్లి వెంకట రమణారెడ్డి తెలిపారు. కాంగ్రెస్ నాయకుల ప్రెస్ మీట్ అనంతరం ఆయన ఒక ప్రకటన విడుదల చేసారు. ఈ రోజు కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలకు తాను సమాధానం ఇస్తానన్నారు. వాళ్ళు చేసిన ఆరోపణలు ఏ ఒక్కటి నిరూపించిన వారు వేసే శిక్షకు తాను సిద్దమని ప్రకటించారు. తేదీ, సమయం చెప్తే వాళ్ళు చెప్పిన ప్రకారం సీఎస్ఐ గ్రౌండులో సిద్ధంగా ఉంటానన్నారు

Read More

*షబ్బీర్ అలీ భూములు బెదిరించి కబ్జా చేసినవి కాదు*-బాజాప్త డబ్బులు పెట్టి కొన్నారు-వెంకట రమణారెడ్డి ఆరోపణలు పసలేనివిమాజీ మంత్రి షబ్బీర్ అలీ భూములు బెదిరించి కబ్జా చేసినవి కాదని, బాజాప్త డబ్బులు పెట్టి కొన్నారని కాంగ్రెస్ నాయకులు అన్నారు. గురువారం షబ్బీర్ ఆలీకి చెందిన భూములపై బీజేపీ నేత కాటిపల్లి వెంకట రమణారెడ్డి చేసిన ఆరోపణలపై నేడు కాంగ్రెస్ నాయకులు జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. నిన్న బిజెపి నాయకుడు వెంకటరమణారెడ్డి మాజీ మంత్రి మహమ్మద్ అలీ షబ్బీర్ పై చేసిన ఆరోపణలు పసలేనివన్నారు. షబ్బీర్ అలీ, ఆయన కుటుంబ సభ్యులు బాజప్త డబ్బులు ఇచ్చి భూములు కొన్నారని, ఎవరిని బెదిరించి కబ్జా చేసి తీసుకున్న భూములు కావన్నారు. నీ విద్యాసంస్థ వద్ద రిటైర్డ్ ఉద్యోగుల భూమి కబ్జా చేసి ప్రహరీ గోడ కట్టుకుంటే వారు కోర్టుకు వెళ్లి ఆర్డర్ తెచ్చుకున్నా కోర్టు ఆర్డర్…

Read More

గర్భిణీలకు న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేసిన గ్రామ సర్పంచ్ బోనాల సుభాష్ఇందూర్ వార్తబాన్సువాడ రూరల్ : డిసెంబర్ 23తల్లులు క్షేమంగా ఉంటే సమాజం క్షేమంగా ఉంటుందని గర్భిణీలకు న్యూట్రిషన్ కిట్లు వరంగా మారనున్నాయని హన్మజిపేట్ గ్రామ సర్పంచ్ బోనాల సుభాష్ అన్నారు. శుక్రవారం బాన్సువాడ మండలంలోని హాన్మాజీపేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణీలకు న్యూట్రిషన్ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల అవసరాలను గుర్తించి అందుకు తగ్గట్టుగా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాయానికి నిదర్శనం అన్నారు. మాతా శిశు సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం మరో విప్లవప్తమైన పథకానికి శ్రీకారం చుట్టడంతో రాష్ట్రంలో గర్భిణీలు ఆరోగ్యకరంగా ఉండేందుకు న్యూట్రిషన్ కిట్ పథకాన్ని ప్రారంభించడం చారిత్రక ఘట్టమన్నారు. ఇందులో ప్రోటీన్స్ మినరల్స్ విటమిన్స్ ఐరన్ లను పోషకాహారం ద్వారా అందించి రక్తహీనత తగ్గించడం హిమోగ్లోబిన్ శాతం పెంచడమే న్యూట్రిషన్ కిట్ల లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బోనాల సుభాష్,…

Read More