- ఏజెన్సీ ప్రాంతాల్లో గౌడులకు న్యాయం చేయండి
- ఉచిత సిద్ధ వైద్య శిబిరాన్ని ప్రారంభించిన శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్
- ఆదివాసీ విద్యార్థుల ఉన్నత విధ్య కోసం ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలి
- ఘనంగా పాడి కౌశిక్ రెడ్డి జన్మదిన వేడుకలు.
- పృధ్వీరాజ్ చౌహాన్ విగ్రహ ప్రతిష్టకు స్థలం కేటాయించాలి
- అమిత్ షా ను అరెస్టు చేసి బర్తరఫ్ చేయాలి:
- తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవ సంస్థ ఆధ్వర్యంలో
- అమిత్ షా ,పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు..!
Author: indurvaartha (ఇందూర్ వార్త)
దోమకొండ గ్రంథాలయానికి దాతల సహకారంతో పుస్తకాలు అందజేత. (ఇందూరు వార్త) దోమకొండ డిసెంబర్ 29గ్రంధాలయ ఛైర్మెన్ పున్న రాజేశ్వర్ జెడ్పీటీసీ తీగల తిరుమల గౌడ్ అధ్వర్యంలో దోమకొండ గ్రంధాలయానికి 32000, రూపాయల జనరల్ నాలెడ్జ్ పుస్తకాలను డొనేషన్ గా అందించారు దాతలు పూన్నా లక్ష్మణ్ పోతుల రాజుకామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని గురువారం రోజున గ్రంధాలయ ఆవరణలో విద్యార్థులకు పుస్తక వితరణ చేసినటువంటి జిల్లా గ్రంధాలయ చైర్మన్ పున్న రాజేశ్వర్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మరి గ్రంధాలయానికి ముదిరాజ్ సంఘం అభివృద్ధి కమిటీ అధ్యక్షులు పున్న లక్ష్మణ్ అదేవిధంగా పోతుల రాజు దాతలుగా ముందుకు వచ్చి గ్రంధాలయానికి 32000, రూపాయలతో జనరల్ నాలెడ్జ్ పుస్తకాలను డొనేషన్ చేయడం చాలా సంతోష కరమని తెలిపారు.అలాగే గ్రంధాలయ ఛైర్మన్ పన్న రాజేశ్వర్ 27 డిక్షనరీ లను విద్యార్థులకు అందజేశారు.మానవత్వ దృక్పథంతో ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలని పున్నా…
ముదిరాజ్ భవన నిర్మాణం కొరకు అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ కి వినతి పత్రం అందజేత ఇందూరు వార్త:అందోల్ డిసెంబర్ 30మెదక్ జిల్లాలోని టేక్మాల్ మండల పరిధిలో ఉన్న బొడ్మట్ పల్లి గ్రామంనికి చెందిన ముదిరాజ్ సంఘం సభ్యులు, మత్స్య సహకార సంఘం సభ్యులతోపాటు అధ్యక్షులు నేడు వారి సమస్యలపై ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ స్వగృహమైన పోతులబోగుడ గ్రామంలో కలసి వినతి పత్రం అందజేయడం జరిగింది. ముదిరాజ్ సంఘ భవన నిర్మాణం, ప్రహరీ గోడ నిర్మాణానికి ఏర్పాటు చేయుటకు గురించి శాసనసభ సభ్యులు కలవడం జరిగింది అందోల్ శాసనసభ్యులు చంటి క్రాంతి కిరణ్ సానుకూలంగా స్పందిస్తూ వెంటనే భవన నిర్మాణానికి మరియుప్రవారీగోడ నిర్మాణం త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది .ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ స్వరూప దశరథ్ గౌడ్ ,BRS పార్టీ గ్రామ అధ్యక్షులు గటంగారి ఈశ్వరప్ప మరియు మండల ప్రధాన కార్యదర్శి అవినాష్ కుమార్ ,…
20ు2023 PRTU క్యాలెండర్ ఆవిష్కరణ ఇందూర్ వార్తబీర్కూర్ 30 డిసెంబర్ బీర్కూర్ ఉన్నంత పాఠశాలలో పిఆర్టియు బీర్కూర్ శాఖ 2023 క్యాలెండర్ను ఎంపీపీ టి రఘు ఆవిష్కరించారు. కార్యక్రమంలో బీర్కూర్ గ్రామ రైతు సమితి అధ్యక్షులు అవారి గంగారం, ఎంపీడీవో భాను ప్రకాష్, పి ఆర్ టి యు రాష్ట్ర సభ్యులు మేకల విట్టల్, రామకృష్ణ, జిల్లా అధ్యక్షులు విట్టల్ యాదవ్, బీర్కూరు మండలం పి ఆర్ టి ఓ అధ్యక్షులు రవీందర్ జెట్టి, సెక్రటరీ నాగరాజు, పి ఆర్ టి యు సభ్యులు, మండలంలోని వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
వినియోగదారుల సమావేశం ఏర్పాటు ఇందూర్ వార్త : మాచరెడ్డీ డిసెంబరు 30 వినియోగదరుల సంగం మాచారెడ్డి మండల శాఖ ఆధ్వర్యంలో నేడు సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమం లో కల్తీ విత్తనాలు కల్తీ మందు కల్తీ మద్యం కల్తీ ఫర్టిలైజర్ మరియు మాంసం విక్రయదారులకు చనిపోయినవి కోసిన ఏడలా 5000 జరిమానా విధించిభడునని ముక్యంగా ఆరోగ్యాంగా ఉన్న మేక, గొర్రె లను కోయాలని వినియోగదరుల సంగం తరుపున తీర్మానిచారు ఈ కార్యక్రమం లో మండల శాఖ అధ్యక్షులు తోకల కిషన్ జనరల్ సెక్రటరీ రావుల ప్రభాకర్ మరియు కార్య వర్గ సభ్యులు పాల్గొన్నారు
దోమకొండ పట్టణ బి ఆర్ ఎస్ పార్టీ మైనార్టీ సెల్ నూతన అధ్యక్షుని ఎన్నికaఇందూర్ వార్తదోమకొండ డిసెంబర్ 29దోమకొండ పట్టణ బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ సెల్ నూతన అధ్యక్షునిగా మహమ్మద్ నయీమ్ నియమించినట్లు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గౌ,,శ్రీ గంప గోవర్ధన్ తెలియజేశారు.వారి ఆదేశాల మేరకు దోమకొండ పట్టణ మైనార్టీ సెల్ నూతన అధ్యక్షులు మహమ్మద్ నయీమ్ పార్టీ తరపున పూర్తి బాధ్యతలు అప్పజెప్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ ప్రభుత్వం అందించే సంక్షేమ పతకాలు ప్రజలకు తెలియపరుస్తూ వారికి అందేలా చూస్తానని నూతనంగా ఎన్నికైన శుభ సందర్భంగా మహమ్మద్ నయీం మాట్లాడుతూ నన్ను నమ్మి నాకు ఈ బాధ్యతలు అప్పజెప్పిన ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మండల బి ఆర్ ఎస్ అధ్యక్షుడు గండ్ర మధుసూదన్ రావు లకు ధన్యవాదాలు తెలిపారు.
*అయ్యప్ప ఆలయానికి ఐదు లక్షల విరాళం ఇస్తానన్న మాచారెడ్డి ఎంపీపీ నర్సింగ్ రావు* కామారెడ్డి జిల్లా, మాచారెడ్డి మండలం, గజ్యనాయక్ తాండలో శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో, స్వాముల మండల కాలం నియమనిష్ఠలతో అయ్యప్పదీక్ష చేసి శబరిమల యాత్ర చేస్తున్న, మాచారెడ్డి అయ్యప్ప స్వాముల ఇరుముడి పూజకార్యక్రమం శ్రీ శ్రీనివాస్ గురుస్వామి అల్మస్ పూర్, అయ్యప్ప దేవస్థాన గురుస్వామి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మాచారెడ్డి మండల అధ్యక్షుడు ఎంపీపీ లోయపల్లీ నర్సింగ్ రావు మాట్లాడుతూ, అయ్యప్ప స్వాముల యాత్ర విజయవంతంగా పూర్తి చేసుకొని రావాలనీ కోరారు. మాచారెడ్డి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. మిగతా అన్ని మండలాలలో అయ్యప్ప స్వామి ఆలయాలు ఉన్నాయి. మన మాచారెడ్డి మండలంలో ఆలయం లేదని స్వాములతో గుర్తు చేశారు. ఈ అయ్యప్ప ఆలయం యొక్క నిర్మాణానికి మాల వేసుకున్న స్వాములు, పుర ప్రముఖులు, సంకల్పం చేసుకొని ఆలయం నిర్మించాలని, దానికి…
అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూములు ఇవ్వాలి.ఎంసీపీఐయు పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం.కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్థానిక కార్యాలయంలో భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ ఐక్య ఎం సి పి ఐ యు. ఏఐసిటియు కార్మిక సంఘం ఆధ్వర్యంలో పత్రిక విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి మాలోత్ జబ్బర్ నాయక్ మాట్లాడుతూ సర్వేల పేరుతో కాలయాపన చేయకుండా కట్టినటువంటి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పేద ప్రజలకు పంచాలని అన్నారు .అలాగే ఎవరైతే డబుల్ బెడ్ రూమ్ రాని పేద ప్రజలు ఉన్నారో వాళ్లకు ఎక్కడైతే గవర్నమెంట్ భూమి ఉందో ఆ భూముల్లో ఫ్లాట్లు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఇప్పటికే నిత్యవసరా సరుకులు ఆకాశం అంటున్న సందర్భంలో కొనడానికి ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఇల్లు అద్దె ఎలా కడతారు అని ప్రశ్నించారు అలాగే భవన నిర్మాణ కార్మికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని…
హక్కుల సాధన కోసం ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి జనవరి 27 నుండి ఇందిరాపార్క్ వద్ద ఆమరణ నిరాహార దీక్షబి సి ఏ సాధన కోసం అన్ని సంఘాలు కలిసి రావాలి ముదిరాజ్ నేతల పిలుపు. ఇందూర్ వార్త డిసెంబర్ 29:ముదిరాజుల బ్రతుకు చిత్రాన్ని ఆవిష్కరించే బీసీఏ సాధన కోసం రాష్ట్రంలోని ముదిరాజ్ సంఘాలన్నీ రాజకీయాల కతీతంగా ఏకం కావాల్సిన అవసరం ఉందని తెలంగాణ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు జగన్మోహన్ తో పాటు వివిధ ముదిరాజ్ సంఘాల నేతలు అల్లాదుర్గం సురేష్, సలేంద్ర శివయ్య, కొరివి లక్మన్ ,బుల్లెట్ వెంకన్న ,రవీందర్,దిగంబర్, నగేష్ తదితరులు పిలుపునిచ్చారు. గురువారం బీసీ సాధికారిత భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు నేతలు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు .సమావేశానికి అధ్యక్షత వహించిన తెలంగాణ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు జగన్మోహన్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్య ఉపాధి అవకాశాలు కోసం ముదిరాజుల బీసీ ఏ లో చేర్చాల్సిన అవసరం…
నిరుపేదలకు వంట సామగ్రి, బ్లాంకెట్లు అందజేత ఇందూర్ వార్త బాన్సువాడ రూరల్ : డిసెంబర్ 27 బీబీపేట్,డిసెంబర్:28 బీబీపేట్ మండలం కేంద్రంలో మంగళవారం రోజున ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లా వైస్ చైర్మన్ అంకన్నగారి నాగరాజ్ గౌడ్ ఎవరులేని నలుగురు నిరుపేదలకు వంట సామాను, బ్లాంకెట్లు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా నిరుపేదలకు తమ వంతు సహాయ సహాయకారాలు అందిస్తు అండగా నిలుస్తున్నామన్నారు జిల్లా వ్యాప్తంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యత్వ నమోదు నిరంతరం కొనసాగుతుందన్నారు ప్రతి ఒక్కరు రెడ్ క్రాస్ సొసైటీలో సభ్యత్వం పొంది,పలు సేవా కార్యక్రమాలలో భాగస్వామ్యం పంచుకోవాలన్నారు ముఖ్యంగా యువత రక్తదానానికి ముందుకు రావాలని కోరారు ఇట్టి కార్యక్రమంలో రెడ్ క్రాస్ మండల చైర్మన్ బాశేట్టి నాగేశ్వర్,సర్పంచ్ తేలు లక్ష్మీ సత్యనారయణ,ఎంపీటీసీలు దుంప పల్లవి భూమేష్, కొరివి నీరజ నర్సింలు,మండల రెడ్ క్రాస్ వైస్ ఛైర్మన్ పిడుగు స్వామి,మాజీ ఎంపిటిసి…
అంగన్వాడి కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎంపీపీఇందూర్ వార్త బాన్సువాడ రూరల్ : డిసెంబర్ 27బాన్సువాడ మండలం పరిధిలోని బుడిమి గ్రామం పరిధిలోని అంగన్వాడీ కేంద్రం, ఉన్నత పాఠశాల లను బాన్సువాడ ఎంపిపి దొడ్ల నీరజా వెంకట్ రామ్ రెడ్డి స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న చిన్నారులు బాలింతలు, విద్యార్థిని విద్యార్థులతో ఎంపిపి గారు ముచ్చటించారు. మధ్యాహ్నం భోజనం రుచికరంగా ఉంటున్నయా, సమయాని భోజనం అందిస్తున్నార, గ్రుడ్డు మరియు పాలు చిన్నారులకు బాలింతలకు అందిస్తున్నార అని వివరాలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా పాటశాల తరగతి గదులు, వంట గది, పాటశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని అంగన్వాడీ కేంద్రం సిబ్బంది కి మరియు పాటశాల సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు గ్రామ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.