- ఏజెన్సీ ప్రాంతాల్లో గౌడులకు న్యాయం చేయండి
- ఉచిత సిద్ధ వైద్య శిబిరాన్ని ప్రారంభించిన శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్
- ఆదివాసీ విద్యార్థుల ఉన్నత విధ్య కోసం ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలి
- ఘనంగా పాడి కౌశిక్ రెడ్డి జన్మదిన వేడుకలు.
- పృధ్వీరాజ్ చౌహాన్ విగ్రహ ప్రతిష్టకు స్థలం కేటాయించాలి
- అమిత్ షా ను అరెస్టు చేసి బర్తరఫ్ చేయాలి:
- తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవ సంస్థ ఆధ్వర్యంలో
- అమిత్ షా ,పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు..!
Author: indurvaartha (ఇందూర్ వార్త)
ఇలాంటి విషయాల్లో ప్రభుత్వాల నిర్ణయమే ముఖ్యమన్న కపిల్ దేవ్ తమలాంటి వ్యక్తుల అభిప్రాయాలతో పనిలేదని వ్యాఖ్య ఛాంపియన్స్ ట్రోఫీ ‘టూర్’ మ్యాచ్‌లను పీవోకేలో షెడ్యూల్ చేయడంపై ఆసక్తికర వ్యాఖ్యలు వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నమెంట్ భారత్ – పాకిస్థాన్ మధ్య దౌత్య సంబంధాలను మరింత అగాథంలోకి నెడుతోంది. పాక్ వేదికగా జరిగే ఈ టోర్నీకి భద్రతా కారణాల రీత్యా టీమిండియాను పంపించబోమని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసింది. బీసీసీఐ వైఖరి నచ్చని పాకిస్థాన్.. భారత్‌ను రెచ్చగొట్టేలా ‘ట్రోఫీ టూర్’ను పీవోకేలోని (పాక్ ఆక్రమిత కశ్మీర్) పలు వేదికల్లో నిర్వహించేందుకు షెడ్యూల్‌ను రూపొందించింది. దీనిపై బీసీసీఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ షెడ్యూల్‌ను ఐసీసీ నిలుపుదల చేసింది. పీవోకేలోని వేదికలు లేకుండా కొత్త టూర్ షెడ్యూల్‌ను శనివారం విడుదల చేసింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ దిగ్గజం కపిల్ దేవ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ…
ర్భవతి అని నిర్ధారించిన వైద్యులు గర్భంలో నాలుగు పిండాలు వృద్ధి అమెరికాలోని ఇల్లినాయిస్‌కు చెందిన యువతికి షాక్నర్సింగ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఓ 20 ఏళ్ల యువతి గొంతు నొప్పిగా ఉండడంతో చికిత్స కోసం హాస్పిటల్‌కు వెళ్లింది. సమస్య ఏమిటో తెలుసుకునేందుకు ఎక్స్-రే తీయించుకొని రావాలని వైద్యులు సూచించారు. అయితే ఒకవేళ గర్భవతి అయ్యుంటే రేడియేషన్ ప్రభావం పడుతుందేమోనన్న ఆందోళనతో ముందుగా ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకోవాలని సలహా ఇచ్చారు. దీంతో టెస్ట్ చేయించుకున్న యువతికి జీవితమే మారిపోయే విషయం తెలిసిందే. ఆమె గర్భవతి అని నిర్ధారణ అయింది. హ్యూమన్ కోరియోనిక్ గోనడోట్రోపిన్ (హెచ్‌సీజీ) స్థాయులను బట్టి ఆమె గర్భంలో ఏకంగా నాలుగు పిండాలు ఏర్పడ్డాయని వైద్యులు నిర్ధారించారు. అమెరికాలోని ఇల్లినాయిస్‌కు చెందిన 20 ఏళ్ల కాటెలిన్ యేట్స్ అనే యువతికి ఈ షాకింగ్ అనుభవం ఎదురైంది. యేట్స్ ఈ ఏడాది ఏప్రిల్ 1న హాస్పిటల్‌కు వెళ్లింది. దీంతో ‘ఏప్రిల్ ఫూల్’ సందర్భంగా…
ఎలక్ట్రిక్ వాహనాలపై రెండేళ్లపాటు రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఛార్జీల మినహాయింపు 100 శాతం ఉపశమనం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం డిసెంబర్ 2026 చివరి వరకు అవకాశం ద్విచక్రవాహనాలతో పాటు కార్లు, ట్యాక్సీలు, క్యాబ్‌లు సహా అన్ని ఎలక్ట్రిక్ వాహనాలకు వర్తింపు కాలుష్య నియంత్రణే లక్ష్యంగా రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం ఎలక్ట్రిక్ వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. 2026 చివరి దాకా అన్ని రకాల ఎలక్ట్రిక్ వాహనాలపై రోడ్ ట్యాక్స్‌ను మినహాయిస్తున్నట్టు ప్రకటించింది. రాష్ట్రంలో కొనుగోలు చేసే అన్ని ఎలక్ట్రిక్ వాహనాలపై రిజిస్ట్రేషన్ ఫీజు 100 శాతం మినహాయింపు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం కీలకమైన విధానపరమైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కాలుష్య నియంత్రణే లక్ష్యంగా ఈ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు గతంలో ఉన్న పరిమితులను రద్దు చేసి మరో రెండేళ్ల వరకు ట్యాక్స్‌లను రద్దు చేస్తూ జీవోను…
కరీంనగర్: రేపు (మంగళవారం) దివ్యాంగులకు ఆటల పోటీలు ఇందూర్ వార్త వెబ్ డెస్క్ మహిళలు, పిల్లలు, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 19న మంగళవారం దివ్యాంగులకు ఆటల పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి ఎం.సరస్వతి తెలిపారు. వచ్చే నెల 3న దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకొని ఈ ఆటల పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పోటీల్లో పాల్గొనాలనుకునే దివ్యాంగులు సదరం సర్టిఫికెట్, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ తో 19వ తేదీ ఉదయం 9 గంటలకు కరీంనగర్ లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్టేడియానికి హాజరుకావాలని సూచించారు. అక్కడే పేరు నమోదు చేసుకొని పోటీల్లో పాల్గొనవచ్చని తెలిపారు. 10 నుండి 17 సంవత్సరాల వారికి జూనియర్ విభాగంలో, 18 నుండి 54 సంవత్సరాల వారికి సీనియర్ విభాగంలో పోటీలు ఉంటాయని అన్నారు. చెస్, క్యారం, షాట్ పుట్, రన్నింగ్ పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. జిల్లాస్థాయి విజేతలకు రాష్ట్రస్థాయి పోటీల్లో అవకాశం…
నూతన వధూవరులను ఆశీర్వదించిన డా.పెసర విజయ్ చందర్ రెడ్డి ఇందూరు వార్త : బీజేపీ కామారెడ్డి పల్లి గ్రామ ఇంచార్జ్ ఎదునూరి లింగయ్య కూతురు వివాహ కార్యక్రమానికి హాజరై ఆశీర్వధించిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు &హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ మరియు ములుగు జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి డా. పెసరు విజయచందర్ రెడ్డి ప్రతీ కార్యకర్త అన్ని కార్యక్రమాలకు పాల్గొని కార్యకర్తల గుండెల్లో మనసులలో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటున్న విజయ్ చంద్ర రెడ్డి కార్యకర్తకు ఏ కష్టం వచ్చినా కంటికి రెప్పలా కాపాడుకుంటా వారి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటా అని అన్నారు.ఈ కార్యక్రమం లో బూత్ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
గాంధీ ఆస్పత్రిలో ఆర్నెళ్ళుగా పని చేయని ఎక్స్-రే యంత్రాలు Nov 17, 2024, ఇందూర్ వార్త వెబ్ డెస్క్ గాంధీ ఆస్పత్రిలో ఆర్నెళ్ళుగా పని చేయని ఎక్స్-రే యంత్రాలు సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో 6 నెలలుగా ఎక్స్-రే యంత్రాలు పని చేయట్లేదు. ఆస్పత్రి మొత్తం 5 యంత్రాలు ఉండగా.. అందులో నాలుగు మూలన పడ్డాయి. ఒకే యంత్రం పనిచేస్తుండటంతో ఐపీ, ఓపీ విభాగాలకు చెందిన రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఓపీకి వచ్చే రోగులు బయట ఎక్స్రేలు తీయించుకుంటున్నారు. హైదరాబాద్ లో అర్ధరాత్రి ప్రమాదాలకు గురైన వారు దాదాపు 150 మంది వరకు అంబులెన్స్ ల్లో గాంధీకి వస్తుంటారు.
డిసిహెచ్ఎస్ రవి బాబు పై విచారణ బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ *కొత్తగూడెం* డిసిహెచ్ఎస్ రవిబాబుపై హైదరాబాద్ లోని వైద్య విధాన పరిషత్ కమీషనర్ ను తను చేసిన ఫిర్యాదుపై శనివారం విచారణ జరిగినట్టు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ యెర్రా కామేష్ తెలిపారు.నోటిఫికేషన్ లేకుండా చేసిన అక్రమ నియామకాలు,నియామకాల్లో రూల్ ఆఫ్ రోస్టర్ విధానం పాటించకపోవడం,బదిలీలు, డిప్యూటేషన్లు,తన సమీప బంధువును అక్రమ పద్ధతిలో నియమించడం,టెండర్ ప్రక్రియ లేకుండా నిర్వహించిన పనులు మరియు సామాగ్రి కొనుగోలు తదితర అంశాలపై తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ కు ఆగస్టు 8వ తేదీన లిఖతపూర్వకంగా పిర్యాదు చేయగా కమీషనర్ ఆదేశాలపై విచారణ అధికారిగా సూపరింటెండెంట్ డి.హెచ్.క్యూ.హెచ్.ఎస్ ఖమ్మం.కె.రాజశేఖర్ గౌడ్ మరియు వారికి ఎం.సత్యనారాయణ,ఎల్.సునీల్ కుమార్,సి.ఏచ్.రత్నాకర్ రావు సహాయ సిబ్బంది గల అధికారులతో భద్రాద్రి జిల్లా డిస్ట్రిక్ హెడ్ క్వార్టర్ హాస్పటల్ కార్యాలయం నందు…
మొదటి బహుమతిని కైవసం చేసుకున్న ప్రభుత్వ పాఠశాల క్రీడా కారులు విద్యార్థులు ఆటల పోటీల్లో చురుకుగా పాల్గొనాలి- పిఈటి సంతోష్, శ్రీహరి గెలుపు ఓటమిలు విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించలేవు ఆటల పోటీలను విద్యార్థులు స్నేహితుల కలయికగా భావించాలి- ప్రధానోపాధ్యాయులు గణా జ్యోతి రాణి ఇందూర్ వార్త ప్రతినిది ధర్పల్లీ నవంబర్ 15 ధర్పల్లి మండల స్థాయి అంతర పాఠశాలల క్రీడోత్సవాలను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి, విద్యాధికారి అశోక్ 12 వ తారీఖున జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ క్రీడా పోటీలకు ధర్పల్లి మండల గ్రామాల ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలల విద్యార్థిని, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. క్రీడా పోటీల్లో గెలుపు ఓటమి జీవిత విజయాన్ని నిర్ణయించలేవనే సూచికగా కొనసాగుతున్న, ప్రక్రియలో గెలుపు విజయానికి సంకేతం అయితే, ఓటమి ప్రయత్నించడానికి మరో మెట్టుగా విద్యార్ధి భవిష్యత్తును నిర్ణస్తుందని, ఆటల పోటీలు శారీరక దృఢత్వాన్ని విద్యార్థుల్లో పెంపోందిస్తుందని, విద్యార్థులు ఆటల పోటీల…
ధర్పల్లి సి.హెచ్.సి లో ఆకస్మిక తనిఖీ డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ అంజన డిప్యూటీ డిఎంహెచ్ఓ మాస్ వార్నింగ్ నిలువెత్తు నిర్లక్ష్యం లోపించిన సేవ భావం ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రోగులు ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్యం అందక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరని దుస్థితి *పై అధికారులు వచ్చిన ప్రభుత్వ ఆస్పత్రుల్లో మారని తీరు అధికారులు వచ్చినప్పుడే దర్శనమిస్తున్న ఆసుపత్రి సిబ్బంది-రోగులు* విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు- డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ అంజన ఇందూరు వార్త ప్రతినిధి ధర్పల్లి నిజామాబాద్ జిల్లా ధర్పల్లి పిసిహెచ్ సిలో జరుగుతున్న బాగోతం… ఆస్పత్రి అధికారులు, ఆస్పత్రి సిబ్బంది వ్యాధిగ్రస్తుల పట్ల అ ఆస్పత్రికి వచ్చే ప్రజలకు అందుబాటులో ఉండి బాధ్యతలు నిర్వహించాల్సిన సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వచ్చిన ఆరోపణల మేరకు ధర్పల్లి మండల కేంద్రంలో 30 పడకల ప్రభుత్వాసుపత్రిని డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ అంజన…