Author: indurvaartha (ఇందూర్ వార్త)

ప్రజల ఆశీర్వాదం తో కోలుకున్నా…. ఏమ్మేల్యే తోట లక్ష్మీ కాంతారావు   జుక్కల్ నియోజకవర్గ శాసన సభ్యులు గా ఉండడం నా అదృష్టం  ప్రజల సేవ చేయడమే నా బాధ్యత.. నియోజకవర్గ అభివృద్ధి నా లక్ష్యం ఇందూర్ వార్త : జుక్కల్, కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం శాసన సభ్యులు సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు నియోజకవర్గ ప్రజాలందరికీ శుభం కలగాలని, మీరు ఆరోగ్యంగా మరియు సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నాను..మీకు సేవ చేయడమే నా భాగ్యం మరియు నా బాధ్యత.. నేను ఈ సందేశాన్ని నా పూర్ణ మనసుతో, కృతజ్ఞతతో మరియు వినయంతో రాస్తున్నాను..గత నెల 30న రాత్రి అనుకోని ఆరోగ్య సమస్యను ఎదుర్కొనీ.. తీవ్రమైన ఫుడ్ పాయిజనింగ్ కారణంగా నా కుటుంబ సభ్యులు హూటాహుటిన ఆసుపత్రిలో చేర్పించారు , కొన్ని రోజుల పాటు ఐ సి యు లో ఉంచి చికిత్స చేయించుకున్నాను జూన్ 6వ తేదీ వరకు నేను ఆసుపత్రిలో…

Read More

ఆదివాసుల బాధలు తీర్చే వారే లేరా…? ఇందూర్ వార్త, ఖమ్మం భద్రాద్రిజిల్లా బ్యూరో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఉమేష్ చంద్ర నగర్ లో ఒక మహిళ ఆదివారం నాడు పురిటి నోప్పులతో తీవ్ర ఇబ్బంది పడుతు ఉండగా అక్కడివారు మంచం సహాయంతో (డోలి) లాగా మోసుకుని వెళ్లిన సంఘటన ఇక్కడ చోటు చేసుకుంది. జడ్డి (డోలి) సహాయంతో ప్రధాన రహదారి వరకు తీసుకువచ్చి తర్వాత అంబులెన్స్ ఎక్కించారు. ఇక్కడ ప్రధాన రహదారి లేకపోవడం వల్ల ప్రజలు ఇలాంటివి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదివాసులు ఇలాంటివే కాకుండా పాము కాటుకు తేలు కాటుకు కూడా రహదారి లేకపోవడం వల్ల సరైన సమయంలో తీసుకు వెళ్లాక వైద్యం అందక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతూ ప్రాణాలు కూడా నష్టపోతున్నారు. ప్రభుత్వాలు మారిన ఆదివాసుల జీవితాలు మాత్రం మారడం లేదు ఐటిడిఏ లాంటి ఉన్నా కూడా ఇలాంటి జరగడం అనేది చాలా బాధాకరం…

Read More

మున్సిపల్ ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధం వార్డుల విభజనకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల రాష్ట్ర వ్యాప్తంగా 18 కొత్త మున్సిపాలిటీలు 5 కొత్త మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పాటు 7 మున్సిపాలిటీల్లో సమీప గ్రామాలు విలీనం మున్సిపల్ ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. కొత్త మున్సిపాలిటీలలో వార్డుల విభజనకు కసరత్తు చేసింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వార్డుల విభజనకు సంబంధించి నోటిఫికేషన్ మంగళవారం విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 18 కొత్త మున్సిపాలిటీలు, 5 కొత్త మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పాటు కానున్నాయి. 7 మున్సిపాలిటీల్లో సమీప గ్రామాలు విలీనం అయ్యాయి. కొత్త మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లలో వార్డుల విభజన ప్రక్రియకు మున్సిపల్ శాఖ అధికారి శ్రీదేవి షెడ్యూల్ విడుదల చేశారు. ఈ నెల 21 వరకు వార్డుల విభజన ప్రక్రియ పూర్తి చేసేలా అధికారులను ఆదేశించారు. త్వరలో రిజర్వేషన్‌లు ఖరారు.. ప్రభుత్వం ఇప్పటికే గ్రామాల్లో, పంచాయతీల్లో వార్డుల…

Read More

పామాయిల్ కూలీలకు తుమ్మల తీపి కబురు ఇందూర్ వార్త, ఖమ్మం భద్రాద్రి జిల్లా బ్యూరో – పామాయిల్ ఫైబర్ హార్వెస్టర్స్ కు 50% రాయితీ – హార్టికల్చర్ ద్వారా దరఖాస్తు చేయాలన్న మంత్రి పామాయిల్ కూలీలకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నాగేశ్వరరావు తీపి కబురు అందించారు..దమ్మపేట మండలానికి చెందిన పామాయిల్ కూలీలు ఆదివారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును గండుగులపల్లిలోని ఆయన నివాసంలో కలిశారు. పామాయిల్ గెలలు కోసేందుకు అవసరమైన ఫైబర్ హార్వెస్టర్ గడల కోసం విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల స్పందిస్తూ హార్టికల్చర్ శాఖ ద్వారా దరఖాస్తు చేస్తే 50 శాతం రాయితీపై గడలు(పామాయిల్ ఫైబర్ హార్వెస్టర్స్) అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పామాయిల్ కూలీలు మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ వైస్ ఛైర్మన్ కొయ్యల అచ్యుతరావు, కాసాని నాగప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

Read More

కేంద్ర కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ మంత్రి జేపీ నడ్డా కి లేఖ రాసిన మద్దిశెట్టి.  ఇందూర్ వార్త ఖమ్మం భద్రాద్రి జిల్లా బ్యూరో అనధికారిక మరియు లైసెన్స్ లేని విత్తనాలు మరియు ఎరువుల దుకాణాలు రైతులలో బాధ మరియు ఆత్మహత్యలకు కారణమవుతున్నాయని, ఈ కీలక సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఎన్సీపీ పార్టీ (ఎన్డీఏ కూటమి) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జ్ మద్దిశెట్టి సామేలు కేంద్ర రసాయనాలు మరియు ఎరువుల శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా కి లేఖ రాశారు. నకిలీ మరియు నాణ్యత లేని విత్తనాలు మరియు ఎరువులను అమ్మడం ద్వారా రైతులను దోపిడీ చేసే దుకాణాల సంఖ్య వేగంగా పెరగడాన్ని ఈ లేఖ హైలైట్ చేస్తుంది. ఇది పంట వైఫల్యాలు, దిగుబడి తగ్గడం మరియు గణనీయమైన ఆర్థిక నష్టాలకు దారితీస్తుంది, రైతులను అప్పులు మరియు నిరాశలోకి నెట్టివేస్తుంది, చివరికి ఆత్మహత్యల సంఖ్య పెరుగుతుంది.రాష్ట్ర వ్యవసాయ…

Read More

ఆ నలుగురికి మంత్రి పదవి ఫిక్స్..! ఆశావహులకు అధిష్టానం బిజిగింపులు..!! తెలంగాణ అన్నీ అనుకున్నట్లుగా జరిగితే 10 రోజుల్లో కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉన్నది. ప్రస్తుతం 4 స్థానాలను భర్తీ చేసి మిగతా రెండు పదవులను పెండింగ్‌లో పెట్టేందుకు అధిష్టానం మొగ్గుచూపినట్టు సమాచారం. సామాజిక సమీకరణల నేపథ్యంలో మంత్రి పదవులు ఇవ్వడం సాధ్యం కాని పలువురు ఆశావహులకు పార్టీ పదవులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ మేరకు సదరు లీడర్లను పార్టీ పెద్దలు బుజ్జగిస్తున్నారు. ఒక వేళ ఆ లీడర్లు సంతృప్తి చెందక పేచీ పెడితే.. విస్తరణ వాయిదా వేసి స్థానిక ఎన్నికల తర్వాత చేపట్టాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ఒకేసారి రెండు జాబితాలు ఏడాదిన్నర కాలంగా పలు కారణాల వల్ల కేబినెట్ విస్తరణ వాయిదా పడుతూ వస్తున్నది. రెండు రోజులుగా ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్.. కేసీ వేణుగోపాల్‌తో అటు పార్టీ పదవులు,…

Read More

పారదర్శకంగా పనిచేస్తున్న తెలంగాణ ఆయిల్. ఫేడ్ సంస్థ పై తప్పుడు ప్రచారం చేయిస్తున్న ప్రైవేట్ కంపెనీలు 1. ఆయిల్ ఫామ్ పై తప్పుడు ప్రచారం మానుకోండి.. కట్టం ఎర్రప్ప. సొసైటీ వైస్ చైర్మన్ 2. తెలంగాణ ఆయిల్ ఫామ్ మంచి మొక్కలనే పంపిణీ చేస్తుంది.. కొయ్యల అచ్యుతరావు ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ 3. ప్రైవేటు సంస్థల చెప్పుడు మాటలు వినకండి. ఆళ్ల జంగం మాజీ సర్పంచ్ ప్రతిష్టాత్మక సంస్థగా ఆయిల్ ఫామ్ రంగంలో కీలక పాత్ర పోషిస్తుంది ఆయిల్ ఫామ్ రైతుల్ని వివిధ కార్యక్రమాల ద్వారా ప్రోత్సహిస్తూ సాగు ప్రక్రియలో మార్గ నిర్దేశం నాణ్యమైన మొలకల పంపిణీ సబ్సిడీతో తాజా పండ్ల గుత్తులకు మార్కెట్ లింకేజీని కల్పించడం రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ సాగు విస్తరించాలని లక్ష్యంతో రైతులకు అత్యధిక ధరలు ప్రోత్సాహాలు సబ్సిడీలు అందిస్తుంది తెలంగాణ ఆయిల్ ఫెడ్ ఆయిల్ ఫామ్ నెలల్లో నూనె శాతం 19.42 శాతం…

Read More

ప్రజల ప్రాణాలతో చెలగాటం – అపరి శుభ్రంగా టిఫిన్ సెంటర్లు, హోటల్. అపరి శుభ్రంగా టిఫిన్ సెంటర్లు, హోటల్ -నిబంధనలు హుష్ కాకీ -అధికారుల పర్యవేక్షణ కరువు. నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలోనీ టిఫిన్ సెంటర్లు ఆపరి శుభ్రంగా మారాయి. నిఘా పెట్టల్సిన అదికారులు ఇటువైపు కన్నెత్తి చూడడం లేదు. దీంతో టిఫిన్ సెంటర్ల నిర్వాహకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. తయారు చేసే పదార్థాలపై ఈగలు వాలుతున్నాయి. వాడిని నూనెలు వాడడం, కడిగిన నీళ్లలోనే మళ్లీ కడగడం వంటివి కొనసాగిస్తున్నారు. పరిశుభ్రంగా లేని ప్లేట్లలో పదార్థాలను వినియోగదారులకు ఇస్తున్నారు. ఇవీ తిన్న వినియోగదారులు రోగాల బారిన పడే అవకాశం ఉంది, ఇదేంటి ప్రశ్నించిన వినియోగదారులకు నిర్వాహకులు దురుసుగా ప్రవర్తిస్తున్నారు. అధికారులు టిఫిన్ సెంటర్లు, హోటళ్ల పై తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. *పౌర సరఫరాల అధికారుల తనిఖీలు కరువు* పౌర సరఫరాల అధికారులు హోటళ్లు మరియు టిఫిన్ సెంటర్ల…

Read More

వరంగల్ సభకు బయలుదేరిన రాంపూర్ పార్టీ శ్రేణులుఇందూరు వార్త ప్రతినిధి ఆర్మూర్నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం రాంపూర్ గ్రామ బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు చలో వరంగల్ సభకు బయలుదేరడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ నాయకులు మాట్లాడుతూ అంతఃకరణ శుద్ధితో అభివృద్ధి చేసిన పార్టీ భారత రాష్ట్ర సమితి అని కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి అభివృద్ధి చెందిన తెలంగాణను అయోమయం చేసిన పార్టీ కాంగ్రెస్ అని తెలిపారు ఈ కార్యక్రమంలోసర్పంచ్ దయానంద్ గారితో పాటు ఉపఅధ్యక్షుడు వినయ్, అధ్యక్షుడు మూడ శేఖర్, మరియ రాంపూర్ గ్రామస్తులు…పాల్గొన్నారు…

Read More

నేడు అధిక సంఖ్యలో సభలో పాల్గొని విజయవంతం చేయండి….మండల పార్టీ అధ్యక్షులు వై రమణ గౌడ్… ఇందూర్ వార్త శివ్వంపేట,:నేడు చలో వరంగల్ ఎల్కతుర్తి రజతోత్సవ సభకు నర్సాపూర్ నియోజకవర్గం శివ్వంపేట మండలం నుండి బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని సభను జయప్రదం చేయాలని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వై రమణ గౌడ్ అన్నారు.సభకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు జరుగుతున్నాయని ఎవరికి ఇబ్బంది లేకుండా బిఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఏర్పాట్లు చేస్తుంది అని అన్నారు.ఆదివారం ఏప్రిల్ 27వ తేదీన వరంగల్ లోని ఎలుకతుర్తి ప్రాంతంలో జరగనున్న సభ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, తెలంగాణ బాపు తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆధ్వర్యంలో జరుగుతున్న పార్టీ రజితోత్సవ బహిరంగ సభకు నర్సాపూర్ నియోజకవర్గం శివ్వంపేట మండలం వ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో బిఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు ప్రజలు అధిక సంఖ్యలో తరలిరావాలని 10 లక్షల మంది…

Read More