- ఏజెన్సీ ప్రాంతాల్లో గౌడులకు న్యాయం చేయండి
- ఉచిత సిద్ధ వైద్య శిబిరాన్ని ప్రారంభించిన శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్
- ఆదివాసీ విద్యార్థుల ఉన్నత విధ్య కోసం ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలి
- ఘనంగా పాడి కౌశిక్ రెడ్డి జన్మదిన వేడుకలు.
- పృధ్వీరాజ్ చౌహాన్ విగ్రహ ప్రతిష్టకు స్థలం కేటాయించాలి
- అమిత్ షా ను అరెస్టు చేసి బర్తరఫ్ చేయాలి:
- తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవ సంస్థ ఆధ్వర్యంలో
- అమిత్ షా ,పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు..!
Author: indurvaartha (ఇందూర్ వార్త)
సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మెకు సంపూర్ణ మద్దతు ఇందూర్ వార్త : కామారెడ్డి పిఎస్ హెచ్ఎం అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఇందూరు రమేష్ కుమార్ గౌడ్ తమ న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం కామారెడ్డి జిల్లా కేంద్రంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్న పిఎస్ హెచ్ఎం అసోసియేషన్ తెలంగాణ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఇందూరు రమేష్ కుమార్ గౌడ్ తెలిపారు . ప్రభుత్వం వారి న్యాయపరమైన సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పందిరి. రాజేశ్ సమగ్ర శిక్ష ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు
అక్రమ నిర్మాణాలంటూ కూల్చివేయడం ఏంటన్న కోర్టు అధికారుల తీరుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం! నిర్మాణాలను కూల్చివేసినందుకు నష్టపరిహారాన్ని అధికారుల నుంచి రాబట్టాలని ఘాటు వ్యాఖ్య వారి ఆస్తులను జప్తు చేయాలని ఆదేశించాల్సి ఉంటుందన్న హైకోర్టు ఇందూర్ వార్త అక్రమమని తెలిసి కూడా అనుమతులు ఇచ్చి.. ఆ తర్వాత అక్రమ నిర్మాణాలంటూ కూల్చివేయడం ఏంటని తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాంటప్పుడు ఆ అనుమతులు ఇచ్చిన అధికారులే నష్టపరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుందని న్యాయస్థానం ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇకపై అక్రమ నిర్మాణాల కూల్చివేతల విషయంలో వాటికి అనుమతులు ఇచ్చిన అధికారుల ఆస్తుల జప్తుకు ఆదేశించాల్సి ఉంటుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. రంగారెడ్డి జిల్లా పరిధిలోని శంషాబాద్ మండలం నర్కుడ గ్రామంలోని మంగర్షి కుంట ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉన్న నిర్మాణాలను తొలగించాలంటూ ఇరిగేషన్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులను…
సమాజంలో సామాజిక సేవలు అందించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం స్థానిక రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న 25 మంది బాలికలకు సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రోటరీ వరంగల్ సెంట్రల్ క్లబ్ రోటేరియన్ జూలూరు కృష్ణమూర్తి సహకారంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థినులకు సైకిళ్లను పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. సామాజిక సేవా దృక్పథంతో రోటరీ క్లబ్ ద్వారా విద్య, వైద్యం, పర్యావరణం వంటి అంశాలలో సమాజ చేయడం జరుగుతున్నాయని కొనియాడారు. మున్ముందు కూడా రోటరీ క్లబ్ ద్వారా సమాజ సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖాధికారి రాజు, రొటీరియన్ కోరే చంద్రమౌళి వరంగల్, జి.జ్ఞాన ప్రకాష్ అసిస్టెంట్ గవర్నర్, క్లబ్ సెక్రటరీ సత్యనారాయణ, కోశాధికారి సబ్బని కృష్ణ హరి, సీనియర్ రోటీరియన్ శ్రీశైలం, ప్రోగ్రాం చైర్మన్ పి.సత్యం, ధనుంజయ, బాలకిషన్, నాగభూషణం,…
బెతేలు న్యూ లైఫ్ చేర్చి లో సెమీ క్రిస్మస్ వేడుకలు ఇందూర్ వార్త కల్లూరు ప్రతినిధి గౌతమ్ డిసెంబర్:12 కల్లూరు: పేరువంచ గ్రామ పంచాయితీ లో గల బెతేలు న్యూ లైఫ్ చేర్చి లో ఈ రోజు సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం లో దైవ జనులు సంఘ కాపరి కె. ఏసుపాదం సూర్యాపేట గారిచే ప్రత్యేక ప్రార్ధన కూడిక సువార్త నా ప్రసంగాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో కోర్లగూడెం సొసైటీ డైరెక్టర్, కల్లూరు మండల యూత్ కాంగ్రెస్ నాయకులు జోనబోయిన గోపాల్ రావు పాల్గొని సెమీ క్రిస్మస్ వేడుకలో కేక్ కట్ చేసి సంఘస్తులకు మరియు పెద్దల కు స్విట్స్ పంచి పెట్టి అందరికి ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియ చేసారు. దైవజనులు,సంఘస్తులు,తదితరులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.
Free Laptop Scam: విద్యార్థులకు కేంద్రం ఉచిత ల్యాప్‌టాప్.. ఇది మీరు గమనించారా? ఇందూర్ వార్త కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం చాలా రకాల పథకాలు తెచ్చింది. ఎన్నో రకాల స్కాలర్‌షిప్‌లు కూడా ఉన్నాయి. చాలా మంది విద్యార్థులు వాటిని పొంది, ఉన్నత విద్యను చదువుకోగలుగుతున్నారు. ఈ క్రమంలో విద్యార్థులకు కేంద్రం ఉచిత ల్యాప్‌టాప్ ఇస్తోంది అనే అంశంపై పూర్తి వివరాలు తెలుసుకుందాం. విద్యార్థుల కోసం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం చాలా రకాల పథకాలు, స్కాలర్‌షిప్‌లు, క్విజ్‌ల వంటివి నిర్వహిస్తూ, పేద విద్యార్థులు బాగా చదువుకునేందుకూ, ఉన్నత స్థాయికి చేరేందుకు కృషి చేస్తోంది. ఒక్కోసారి విదేశాలకు వెళ్లి కూడా చదవడానికి ఇంటర్న్‌షిప్ లాంటివి ఇస్తోంది. ఐతే.. కొంతమంది ప్రజలను తప్పుదారి పట్టించేందుకు అసత్య పథకాలను ప్రచారం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ల్యాప్‌టాప్ ఇస్తోంది అనేది కూడా అందులో భాగమే సోషల్ మీడియాలో ఈ తప్పుడు ప్రచారం జరుగుతోంది. కేంద్రం…
పంచాయతీ లో అవకతవకల మీద సీ సీ ఆర్ రిపోర్ట్ కలెక్టర్, డీపీవో కి అందజేత ఇందూర్ వార్తా ప్రతినిధి కామారెడ్డి నాగుల్ గావ్ గ్రామపంచాయతీలో అవకతవకలు జరుగుతున్నాయని గ్రామస్తులు కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ (సీసీఆర్) సంస్థను సంప్రదించారు. దీనిపై స్పందించిన సీసీఆర్ సభ్యులు రికార్డు వెరిఫికేషన్ నిర్వహించారు. తనిఖీలలో అనేక లోటుపాట్లు కనిపించాయి. నాగుల్ గావ్ గ్రామపంచాయతీలో ఉండాల్సిన రిజిస్టర్లలో సగం కంటే ఎక్కువ రిజిస్టర్లు లేవని పంచాయతీ సెక్రటరీ రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. లభించిన రిజిస్టర్లలో అనేక తప్పులు క్షుణంగా పరిశీలించారు. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా గత 10 సంవత్సరాల రికార్డులను పరిశీలించాలని కోరినా, కేవలం 3-4 సంవత్సరాల రికార్డులు మాత్రమే లభించాయి. పైగా, లభించిన రిజిస్టర్ల నిర్వహణ సరిగ్గా లేవు . ఈ వివరాల ఆధారంగా CCR డ్రాఫ్టింగ్ కమిటీ సభ్యులు ఫైనల్ రిపోర్ట్ రూపొందించి, ఈరోజు కామారెడ్డి జిల్లా కలెక్టర్, డిపిఓ…
విగ్రహాలపై ఉన్న ధ్యాస విద్యార్థుల మీద లేదా – సీఎం రేవంత్రెడ్డికి మాజీమంత్రి హరీశ్రావు ప్రశ్న ఇందూర్ వార్త మెదక్ జిల్లా డిసెంబర్ 11 ప్రతినిధి మెదక్ జిల్లా విగ్రహాల మీద ఉన్న ధ్యాస విద్యార్థుల మీద లేదా?అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే టి హరీశ్రావు ప్రశ్నించారు. ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకో వడంపై ఉన్న ధ్యాస, పిల్లల భవిష్యత్తుపై లేదా?అని మంగళవారం ఒక ప్రకటనలో అడిగారు. రాష్ట్ర వ్యాప్తంగా కాదు, కనీసం సొంత జిల్లా ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలను సైతం పట్టించుకోని నిర్లక్ష్యపు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్లు జరిగి విద్యార్థులు ఆస్పత్రుల పాలవుతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు?అని ఆయన ప్రశ్నించారు. పది రోజులు కాకముందే వికారాబాద్ జిల్లా తాండూరు గిరిజన బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగి 15…
జనవరి నుండి కార్ల ధరలు పెంచేందుకు టాప్ కంపెనీలు రెడీ రా మెటీరియలు పెరగడంతో నిర్ణయం ఇందూర్ వార్త వెబ్ డెస్క్, కార్ల తయారీ కంపెనీలు రేట్లు పెంచడానికి సిద్ధమ వుతున్నాయి.వచ్చే నెల ఒకటి నుంచి ధరలు పెంచు తామని మారుతి సుజుకీ, హ్యుందాయ్, మహీంద్రాఅండ్ మహీంద్రా, జేఎస్ డబ్ల్యూ ఎంజీ మోటార్,మెర్సి డెజ్ బెంజ్, ఆడి, బీఎండబ్ల్యూ వంటి టాప్ కంపెనీలు ప్రకటించాయి. ఇతర కంపెనీలు కూడా ధరలు పెంచే ఆలోచనలో ఉన్నాయి. రామెటీరియల్స్ ధరలు పెరి గాయని, కార్యకలాపాల ఖర్చులు ఎక్కువయ్యాయనే కారణాలను చూపుతున్నాయి. కార్ల కంపెనీలు ప్రతీ ఏడాది డిసెంబర్లో ధరలు పెంచుతున్నాయని, దీంతో రేట్లు పెరిగే ముందే కార్ల సేల్స్ పుంజుకుం టాయని భావిస్తున్నాయని ఇండస్ట్రీ వర్గాలు వెల్లడిం చాయి. కొత్త ఏడాదిలో బండ్లు తీసుకుందామనుకునే కస్టమర్లు డిసెంబర్లోనే కొనుగోలు జరుపుతారని పేర్కొన్నాయి. ఏడాది ప్రారంభంలో లేదా ఆర్థిక సం వత్సరం ప్రారంభంలో బండ్ల రేట్లు…
5జీ సామర్థ్యంతో మోటో జీ35 ఆవిష్కరించిన కంపెనీ ధర రూ.9,999గా ప్రకటించిన కంపెనీ డిసెంబర్ 16 నుంచి ప్రారంభం కానున్న విక్రయాలు ఫోన్ల తయారీ దిగ్గజం మోటరోలా కంపెనీ భారత్‌లో మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. 5జీ సామర్థ్యంతో మోటో జీ35 ఫోన్‌ను మంగళవారం నాడు ఆవిష్కరించింది. ‘జీ సిరీస్’ ఫోన్లకు కొనసాగింపుగా దీనిని తీసుకొచ్చింది. లీఫ్ గ్రీన్, మిడ్‌నైట్ బ్లాక్, గువా రెడ్ రంగులలో ఈ ఫోన్ లభిస్తుంది. 4జీబీ మెమొరీ, 128జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.9,999గా మోటరోలా ప్రకటించింది. డిసెంబర్ 16 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్, మోటరోలా అధికారిక వెబ్‌సైట్‌పై ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ ప్రత్యేక ఫీచర్ల విషయానికి వస్తే 6.72-అంగుళాల డిస్‌ప్లేతో ఈ ఫోన్ తయారైంది. ఎఫ్‌హెచ్‌డీ+ 120హెర్ట్జ్ ఎల్‌సీడీ స్క్రీన్‌తో 1000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో వచ్చింది. యూనిసాక్ టీ760 ప్రాసెసర్ ఎస్‌వోసీ(సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్)…
చెరువులను కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్నట్లు ఫిర్యాదు కంపెనీల పేర్లను ఫిర్యాదులో ప్రస్తావించిన కామారెడ్డి ఎమ్మెల్యే ప్రభుత్వం స్పందించకుంటే కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరిక ఇందూర్ వార్త కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఈరోజు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను హైదరాబాద్‌లోని బుద్ద భవన్‌లో కలిశారు. చెరువులను కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్న పలు కంపెనీలపై ఆయన ఫిర్యాదు చేశారు. ఆయా కంపెనీల పేర్లు ఏమిటో కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ… ఈ అక్రమ నిర్మాణానికి సంబంధించి రెండు నెలల క్రితమే తాను మాట్లాడానని వెల్లడించారు. దీనిపై ప్రభుత్వం ఇప్పటికీ స్పందించకుంటే కోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. రెండు నెలల క్రితం తాను మాట్లాడానని, ఆ తర్వాత పది రోజులకు… అనుమతులు ఇచ్చిన నిర్మాణాల జోలికి వెళ్లబోమని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారని గుర్తు చేశారు. కానీ చెరువులను కబ్జా చేసి అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్న వారిపై…