- చల్లసముద్రంలో జోరుగా ఇందిరమ్మ ఇండ్ల సర్వే
- ఏజెన్సీ ప్రాంతాల్లో గౌడులకు న్యాయం చేయండి
- ఉచిత సిద్ధ వైద్య శిబిరాన్ని ప్రారంభించిన శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్
- ఆదివాసీ విద్యార్థుల ఉన్నత విధ్య కోసం ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలి
- ఘనంగా పాడి కౌశిక్ రెడ్డి జన్మదిన వేడుకలు.
- పృధ్వీరాజ్ చౌహాన్ విగ్రహ ప్రతిష్టకు స్థలం కేటాయించాలి
- అమిత్ షా ను అరెస్టు చేసి బర్తరఫ్ చేయాలి:
- తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవ సంస్థ ఆధ్వర్యంలో
Author: indurvaartha (ఇందూర్ వార్త)
డిసెంబర్ 1న జరిగే హైదరాబాద్ సభతో మాలలు సత్తా చాటాలి: మంద రంజిత్ కుమార్ ఇందూర్ వార్త నవంబర్ 11 జిల్లా ప్రతినిధి డిసెంబర్ 1 న హైదరాబాద్ లో వర్గీకరణకు వ్యతిరేకంగా జరిగే మాలల సింహ గర్జన సభను లక్షలాది మందితో జయప్రదం చేయాలని మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద రంజిత్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ రాష్ట్రంలో మాలలు 30 లక్షల మంది ఉన్నారని రాష్ట్ర జనాభాలో రెండో స్థానంలో ఉన్నా మాలలను తక్కువచేసి చూపుతూ అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారనీ చెప్పారు. మాలల ఐక్యతతో రాజకీయ పార్టీలకు తడాఖా చూపించాల్సిన సమయం వచ్చిందన్నారు. డిసెంబర్ 1న హైదరాబాద్ లో నిర్వహించే మాలల సింహ గర్జన సభతో మాలలు సత్తా చాటాలనీ ఈ సందర్భంగా మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద రంజిత్ కుమార్ పిలుపునిచ్చారు.
ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ గోల్డ్ మెడల్ సాధించిన గొంది శంకర్ శ్రీ నరసింహ ఇందూరు వార్త నవంబర్ 11 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి మంద లపల్లి గ్రామ నివాసి గోంది మురళి మోహన్ సంధ్యారాణి న్యాయవాదుల చిన్న కుమారుడు అయిన గొంధి శంకర్ శ్రీ నరసింహ , 13వయస్సు, నిన్న అనగా 10-11-2024నాడు గోవా లో జరిగిన ఇంటర్నేషనల్ కరాటే కాంపిటేషన్ లో గోల్డ్ మెడల్ సాధించారు..
పంటను నాశనం చేసిన దుండగులు ఇందూర్ వార్త నవంబర్ 11 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి · తొత్తులుగా మారుతున్న అధికారులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం పెద్ద గొల్లగూడెం గ్రామంలో 70 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్నాటువంటి మారుతి రామారావు అనే రైతు తన పొలాన్ని ఈరోజు కొంత మంది ఇతర కులస్తులు వచ్చి అధికారుల సహకారంతో తన పంట పొలాన్ని దున్ని,పంటనునాశనం చేసి తనను బెదిరించడం జరిగిందని బాధితులు మీడియాకు తెలపడం జరిగినది,ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుడు 70 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్నటువంటి పొలాన్ని ఇతర కులస్తులు చెప్పిన మాటలు నమ్మి అధికారులు వారికి తొత్తులుగా మారి పంట పొలం నాశనం చేయటం ఎంతవరకు సమంజసం అని ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై ఐటీడీఏ పీవో మరియు జిల్లా కలెక్టర్ స్పందించి మాకు న్యాయం చేయగలరని బాధితులు వాపోయారు స్థానిక ఎస్సై ని వివరణ కోరగా…
దక్షిణముఖ పంచలింగాల శివాలయం దర్శించుకున్న అధికారులు…. కార్తీక మాస ఉత్సవాలు…. సీఐ దంపతులను సన్మానించిన కమిటీ చైర్మన్ బుచ్చిరెడ్డి…… ఇందూర్ వార్త ఆత్మకూరు నవంబర్ 10 దక్షిణముఖ పంచలింగాల శివాలయమును అధికారులు, దాతలు దర్శించుకుని తన్మయం చెందారు. ఆత్మకూరు మండల కేంద్రంలో మూడు కోట్ల 50 లక్షలతో పున్న నిర్మాణం పూర్తి చేసుకొని అంగరంగ వైభవంగా పునర్ ప్రతిష్టాప మహోత్సవ వేడుకలు నిర్వహించుకున్న దక్షిణముఖ పంచలింగాల శివాలయంను ఆత్మకూరు సిఐ సంతోష్ కుమార్ దంపతులు, విరాళాలు ఇచ్చిన హైదరాబాద్ కు చెందిన ఊర్మిల రాఘవేంద్ర చారి దంపతులు పంచలింగాల శివాలయములో వేద పండితు లు రవీంద్ర శర్మ, శ్రవణ్ శర్మ మంత్రోచ్ఛరణలతో అభిషేకాలను నిర్వహించారు. అనంతరం ఉత్సవాలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉత్తమ సేవలు అందించిన ఆత్మకూరు సీఐ సంతోష్ కుమార్ ను, చైర్మన్ వంగాల బుచ్చిరెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు రవీంద్ర శర్మ, ఆలయ కమిటీ బృందం రేవూరి…
భద్రత లేని పామాయిల్ కర్మాగారం పామాయిల్ కర్మాగారంలో కార్మికులకు అందుబాటులో అంబులెన్స్ మరియు ఒక మెడికల్ ఆఫీసర్ నీ ఏర్పాటు చేయాలి మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ ఆదివాసీ నాయకులు తంబల్ల రవి ఇందూరు వార్త నవంబర్ 10 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి శనివారం రాత్రి ఫ్యాక్టరీలో వాహనం తగిలి ఒక కార్మికుడు మృతిపామాయిల్ కర్మాగారంలో కార్మికులకు అందుబాటులో అంబులెన్స్ మరియు ఒక మెడికల్ ఆఫీసర్ నీ ఏర్పాటు చేయాలని ఆదివాసీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం అప్పారావుపేటలో ఉన్న పామాయిల్ ఫ్యాక్టరీలో శనివారం అర్ధరాత్రి ఒక ప్రవేట్ కార్మికుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జీలుగుమిల్లి మండలం అంకంపాలెం గ్రామానికి చెందిన తోట వెంకటేశ్వర్లు (30) వ్యక్తి ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా వాహనం తగిలి కింద పడిపోగా హాస్పిటల్ కి తరలించే క్రమంలో మరణించడం జరిగిందనీ అని సమాచారం,ఫ్యాక్టరీలో పని చేసే కార్మికుల కోసం కనీసం…
దళారులను నమ్మి మోసపోవద్దు ఎమ్మెల్యే జారె ఇందూరు వార్త నవంబర్ 10 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి అన్నపురెడ్డిపల్లి మండలం గుంపెన గ్రామంలో జిసిసి ద్వారా వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బంది చూసే బాధ్యత అధికారులదేనని తెలిపారు అలాగే తరుగు తేమశాతం విషయంలో రైతులకు నష్టం జరగకుండా పారదర్శకంగా కొనుగోలు జరపాలన్నారు రైతు సోదరులు ధాన్యాన్ని దళారులకు మధ్యవర్తులకు అమ్మి మోసపోవద్దని ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పిస్తు పండించిన ప్రతి గింజను కొంటుందని సన్న రకం ధాన్యానికి 500 రూపాయల బోనస్ అందించడంతోపాటు కొనుగోలు చేసిన ధాన్యానికి చెల్లింపులు వెంటనే చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని రైతులు గమనించి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో విక్రయించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు..
దాతృత్వాన్నిచాటుకున్న అశ్వాపురం పోలీసులు. ఇందూరు వార్త నవంబర్ 10 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి అశ్వాపురం : పంచాయతీ కార్మికులకు జీతాలు రాక ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకొని … వారికీ నిత్యవసర సరుకులు అందజేసిన సీఐ అశోక్ రెడ్డి … ఎల్లప్పుడు మా సహాయ సహకారాలు ఉంటాయని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఎస్సైలు తిరుపతిరావు & రవూఫ్, పోలీస్ ఇబ్బంది పాల్గొన్నారు పోలీసుల అందించిన సహాయ సహకారాలను కృతజ్ఞతలు చెప్పిన పంచాయతీ కార్మికులు …
కులగణన సర్వేపై మాకు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఆదివాసి నాయకులు తంబళ్ల రవి ఇందూర్ వార్త నవంబర్ 10 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి అశ్వరావుపేట నియోజకవర్గం ఆదివాసీ నాయకులు తంబల్ల రవి మాట్లాడుతూ కులగణన సర్వే పై మాకు పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని ఏజెన్సీ ప్రాంతంలో ఇతర కులస్తులు దొంగ ఎస్టీ సర్టిఫికెట్లు పొందిన వారు చాలామంది ఉన్నారని ఖరీదైన కార్లు,బంగ్లాలు,వందల ఎకరాలు ఉన్నవారు కూడా లక్షల్లో ఆదాయం ఉందని మరియు తక్కువ భూములు ఉన్నవి అని చూపిస్తున్నారని సమాచారం…? ఏజెన్సీ ప్రాంతంలో సర్వే వివరాలు పంచాయతీ ఆఫీసులో ఓపెన్ గా బహిర్గతం చేయాలనీ డిమాండ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మంగా నిర్వహిస్తున్నటువంటి కులగణన సర్వే ఏజెన్సీ ప్రాంతంలో కొంతమంది ఇతర కులస్తులు దొంగ ఎస్టీ సర్టిఫికెట్లుతొ లబ్ధి పొందుతున్నరు,వారిని వెలికి తీయాలి,వందల ఎకరాలు,ఖరీదైన కార్లు,బంగ్లాలు ఉన్నవారు కూడా లక్షల్లోనే ఆదాయం…
‘మహిళా ఉద్యమ్ నిధి’ స్కీమ్ ద్వారా మహిళలకు రూ.10 లక్షల రుణం Nov 10, 2024, ‘మహిళా ఉద్యమ్ నిధి’ స్కీమ్ ద్వారా మహిళలకు రూ.10 లక్షల రుణం మహిళల స్వయం ఉపాధి లక్ష్యంగా ‘మహిళా ఉద్యమ్ నిధి స్కీమ్’ పేరుతో SIDBI (స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ స్కీం ద్వారా వ్యాపారం చేయాలనుకునే మహిళలకు రూ.10 లక్షల వరకు రుణం అందిస్తుంది. తీసుకున్న రుణాన్ని 10 ఏళ్లలోపు తిరిగి చెల్లించాలి. ఎంఎస్ఎంఈ, ట్రేడింగ్, మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల బిజినెస్‌లకు ఈ రుణం ఇస్తారు. ఈ పథకంలో భాగంగా రుణం పొందడానికి స్థానిక బ్యాంకులను సంప్రదించవచ్చు.
బీసీ అట్రాసిటీ చట్టం అమలు చేయాలి- మద్దిశెట్టి సామేలు ఇందూరు వార్త నవంబర్ 9 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం సరోజనాపురం గ్రామంలో ఆల్ ఇండియా దళిత్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో ప్రధానంగా బీసీలపై జరుగుతున్న దాడులను, అన్యాయాలన, అక్రమ కేసులను అరికట్టేందుకు బీసీ అట్రాసిటీ యాక్ట్ పార్లమెంట్ లో ప్రధాన మంత్రి గారు ప్రవేశ పెట్టాలని అదే విధంగా రాష్ట్రపతి కి మరియు జాతీయ బీసీ కమిషన్ కి లేఖ రాయాలని నిర్ణయించారు. దీంతో పాటు 1/70 యాక్ట్ ఉన్న ప్రాంతం గానీ లేదా మైదాన ప్రాంతంలో అర్హత కలిగిన బీసీ కీ కూడా 5 ఎకరాల లోపు ఉన్న భూమికి కూడా హక్కు పత్రాలు ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అర్హత ఉన్న ప్రతి బిసికి ప్రభుత్వమే స్థలం ఇచ్చి పక్కా ఇళ్లు నిర్మించాలని, విద్యా,…