Author: indurvaartha (ఇందూర్ వార్త)

ఎంఎల్ఏ సాబ్ ఇంటిపట్టాల హామీ ఏమైంది!!?? డీడీలు కట్టిన వారు నష్టపోవాల్సిందేనా!!?? బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ ఇందూరు వార్త నవంబర్ 12 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి కొత్తగూడెం: జీ.ఓ.నెం 76 ద్వారా ఇంటి పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతీ ఒక్కరికీ ఎన్నికల సమయంలో ఇంటి పట్టాలు ఇస్తానని ఎంఎల్ఏ ఇచ్చిన హామీ ఏమైందని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ యెర్రా కామేష్ ప్రశ్నించారు??.మంగళవారం పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొత్తగూడెం పట్టణంలో ఎన్నో ఏళ్ళుగా నివాసముంటున్న వారికి యాజమాన్య హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం జీ.ఓ.76 ప్రవేశ పెట్టగా సుమారు 2 వేల మందికి పైగా దరఖాస్తులు చేసుకున్నారని దరఖాస్తుతో పాటు డబ్బులు కూడా కట్టారని ఎన్నికల కోడ్ అమలులోకి రాగానే పట్టాల పంపిణీ ప్రక్రియను నిలిపివేశారని ఎన్నికలు జరిగి 11 నెలలు…

Read More

ఫార్మా సిటీపై పట్టింపులకు, పంతాలకు పోవద్దని సీఎంకు ఇదివరకే చెప్పానన్న అరుణ ప్రాణాలు పోయినా సరే ఫార్మా సిటీని అడ్డుకుంటామని రైతుల చెబుతున్నారని వ్యాఖ్య ఎంత ప్యాకేజీ ఇచ్చినా భూములిచ్చేందుకు వారు ససేమిరా అంటున్నట్లు వెల్లడి     ఇందూర్ వార్త నవంబర్ 12   ఫార్మా సిటీకి సంబంధించి పట్టా భూముల జోలికి వెళ్లొద్దని తాను గతంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హెచ్చరించానని బీజేపీ ఎంపీ డీకే అరుణ అన్నారు. వికారాబాద్ కలెక్టర్ మీద దాడి ఘటనపై ఆమె స్పందించారు. ఈ మేరకు వికారాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… ఫార్మా సిటీపై పంతాలకు, పట్టింపులకు వెళ్లవద్దని సీఎంకు గతంలోనే సూచించినట్లు చెప్పారు.ఫార్మా సిటీ తనకు వద్దని రైతులు గతంలోనే ధర్నా చేశారన్నారు. ఆ ధర్నాకు తాను మద్దతుగా వెళ్లినప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారన్నారు. ప్రాణాలు పోయినా సరే ఫార్మా సిటీని అడ్డుకుంటామని రైతులు చెప్పారన్నారు. ప్రభుత్వ భూముల్లో ఏవైనా పరిశ్రమలు…

Read More

కాంగ్రెస్ చేసిన మోసాలు చెప్పేందుకే తాను వచ్చానన్న కిషన్ రెడ్డి ఆరు గ్యారెంటీలు, 420 హామీలు కాంగ్రెస్ అమలు చేయలేదన్న కేంద్రమంత్రి మహారాష్ట్ర ప్రజలను కూడా మభ్యపెట్టాలనుకుంటున్నారని విమర్శ ఇందూర్ వార్త నవంబర్ 12 తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహారాష్ట్రకు వచ్చి అబద్ధాలు చెప్పారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఈరోజు ముంబైలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కిషన్ రెడ్డి, ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ… కాంగ్రెస్ చెప్పిన మోసాలను వెల్లడించేందుకే తాను మహారాష్ట్రకు వచ్చానన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 99 శాతం హామీలు నెరవేర్చలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని మండిపడ్డారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిందన్నారు. ఇచ్చిన ఏ హామీని అమలు చేయలేదన్నారు.ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో కాంగ్రెస్ ప్రజలను మభ్యపెట్టిందన్నారు. యువత, రైతులు, మహిళలు, కార్మికులు, ఉద్యోగులు ఇలా అందరూ మోసపోయారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ…

Read More

రోడ్డు ఉంది కాని దారే లేదు. ఇందూర్ వార్త నవంబర్ 12 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి భద్రద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట // పేట పట్టణంలో సీసీ రోడ్లు నిర్మాణం తల నెప్పిగా మారింది గ్రామలో సీసీ రోడ్డు నిర్మాణం చేసినందుకు సంతోష పడాలో లేక ఉన్న రోడ్డుని తొలగించి సీసీ రోడ్డు పేరుతో నడిచే దారిని నాశనం చేశారని బాధపడలో అర్ధం కాని పరిస్థితుల్లో గ్రామస్థులు తలలు బాదుకుంటున్నారు.అసలు విషయానికి వస్తే అశ్వారావుపేట పట్టణంలో దూదేకుల బజార్,దొంతికుంట బజారులో నాటి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా లక్షలాది రూపాయలు వెచ్చించి గత మూడు సంవత్సరాల క్రితం సీసీ రోడ్లు నిర్మాణం చేశారు, కానీ రోడ్లు అంచుల్లో టెపర్ వేయకపోవడంతో తరచు ప్రమాదనిలయలుగా మారుతున్నాయని కొన్ని చోట్ల తమకు కొంత వరకు మాత్రమే అనుమతులున్నాయని రోడ్ల నిర్మాణం సగంలో ఆపివేశారని పలువురు ఆరోపిస్తున్నారు మరికొందరు సదరు కాంట్రాక్టర్లు బిల్లులకోసమే రోడ్లు నిర్మించారు…

Read More

భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. స్మితా సబర్వాల్‌కు రేవంత్‌ రెడ్డి ప్రమోషన్‌..!! ఇందూర్ వార్త వెబ్ డెస్క్ పరిపాలనపై పట్టు సాధిస్తున్న క్రమంలో తెలంగాణలో అధికారుల బదిలీలు అనూహ్యంగా జరుగుతున్నాయి. వారాల వ్యవధిలోనే అధికారుల బదిలీలు జరుగుతుండడంతో పరిపాలన అస్తవ్యస్తంగా సాగుతోంది.తాజాగా మరోసారి రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఐఏఎస్‌ అధికారుల బదిలీలు చేపట్టింది. ఈ బదిలీల్లో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిణి స్మితా సబర్వాల్‌కు పదోన్నతి లభించడం గమనార్హం. ఈ బదిలీల్లో జీహెచ్‌ఎంసీ తాత్కాలిక కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన ఇలంబర్తి పూర్తిస్థాయి కలెక్టర్‌గా ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది.తెలంగాణ రాష్ట్రంలో 13 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీల్లో స్మితా సబర్వాల్‌తోపాటు అనితా రామచంద్రన్‌, ఇలంబర్తి వంటి అధికారులు ఉన్నారు. యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శిగా స్మితను.. మహిళా, శిశు సంక్షేమం, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా అనితా రామచంద్రన్‌ను బదిలీ చేశారు. జీహెచ్‌ఎంసీ…

Read More

ఇందిరమ్మ రాజ్యంలో 1/70 చట్టం పరిహాసం, దోపిడీ వర్గాలకు దోచుకున్నంత ఇందూరు వార్త నవంబర్ 12 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి • లేబర్ యాక్ట్ ప్రకారం ఉపాధి అందరికి కల్పించాలి • ఉపాధి కోల్పోతున్న బీసీ సామజిక కుల వర్గం • ఉపాధి కోల్పోతున్న ఇతర కుల బీద కుటుంబాలు • అధికారులు విధి నిర్వహణలో నిద్ర పోతున్నారుభద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం సి కత్తిగూడెయం గ్రామ పంచాయతిలో బినామీ కాంట్రాక్టర్ (రెడ్డి )వ్యవహారం తో ఉపాధి కోల్పోతున్న బీసీ ( వాడబలిజ కులస్థులు ) ఇసుక ర్యాంపులో నది (గోదావరి )మధ్యలో మధ్య రాత్రినుంచి జె సి బి తో అక్రమంగా తవ్వి టిప్పర్ లతో తొలకలు జరిపి, అక్రమ నిల్వలు చేసి, అధిక లోడ్ చేసి పిసా కమిటీని మోసం చేస్తున్న బినామీ కాంట్రాక్టర్, రాత్రి పూట ప్రత్యేక నిఘా కమిటీని నిర్వహిస్తూ, వారికీ మధ్యం,…

Read More

గ్రంధాలయన్ని సందర్శించిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి – సమస్యలు అడిగి తెలుసుకున్న – దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి .. సిద్దిపేట్ జిల్లా/దుబ్బాక మండల్/ నవంబర్11 /ఇందూరు వార్త (ప్రతినిధి ఇన్యాలపు హరికృష్ణ): దుబ్బాక పట్టణ కేంద్ర పరిధిలోని గ్రంధాలయన్ని సోమవారం సందర్శించి గ్రంధాలయనికి సంబందించిన అవసరాలు అడిగి తెలుసుకున్న *దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి*. ఈ సందర్భంగా మాట్లాడుతూ దుబ్బాక మండల్ లో గల విద్యార్థులందురూ ఈ గ్రంధాలయం ఉపయోగించుకొని ఉద్యోగం సంపాదించాలి అని తెలిపారు….

Read More

ఇందూర్ వార్త : వెబ్ డెస్క్  భారతీయ జనతా పార్టీ మండల కార్యవర్గ సమావేశం మండల అధ్యక్షులు పేర్వాల లక్ష్మణరావు ఆధ్వర్యంలో మండల కేంద్రంలో నిర్వహించడం జరిగింది… ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ గురించి చర్చించడం జరిగింది.. ఇట్టి సమావేశానికి ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు  హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి రోజురోజుకు ఆదరణ పెరుగుతుందన్నారు.. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను అమలు చేయకుండా రోజుకొక కొత్త ప్రకటనతో ప్రజలను మభ్యపెడుతుందన్నారు.. రైతులకు ఇప్పటివరకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయలేదన్నారు… వానాకాలం రైతుబంధు ఇవ్వని ఈ ప్రభుత్వం రైతులు ఆరుకాలం పండించిన పంటను అమ్ముకోవడానికి వెళ్తే మద్దతు ధర కూడా రావడం లేదు.. క్వింటాకు 500 బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం అసలు రైతుకు మద్దతు ధర కూడా ఇవ్వట్లేదు… ప్రభుత్వం వెంటనే మిల్లర్లతో మాట్లాడి రైతుల నుంచి మద్దతు ధరకు…

Read More

ఇందూర్ వార్త : వెబ్ డెస్క్  ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలో పౌరసరఫరాలు, మార్కెటింగ్, తదితర అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని సంబంధిత రైస్ మిల్లులకు తరలించాలని, ట్యాబ్ ఎంట్రీలు త్వరగా చేయాలని తెలిపారు. రైతులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా కొనుగోలు చేసిన ధాన్యానికి త్వరగా చెల్లింపులు జరిగేలా చూడాలన్నారు. టార్పాలిన్, గోనె సంచులు ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ధాన్యం కొనుగోళ్లు విషయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంకు వచ్చిన ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ విక్టర్, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ రాజేందర్, ఇన్ ఛార్జి జిల్లా పౌర సరఫరాల అధికారి నరసింహరావు, జిల్లా సహకార అధికారి రాంమోహన్, డీపీఎం రమేశ్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Read More

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ గా మార్చాలి ఇందూరు వార్త నవంబర్ 11 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు జూలూరుపాడు మండల కేంద్రంలో ఉన్న  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ గా మార్చాలి అంటూ భద్రాచలం ఐటిడిఏ పిఒ కి వినతిపత్రం అందించడం జరిగినది కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ జూలూరుపాడు మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ గా మారిస్తే ఎన్నో ఆరోగ్య సేవలు ప్రజలకు అందుతాయని వారన్నారు అదేవిధంగా జూలూరుపాడు మండలం పూర్తి ఏజెన్సీ మండలం అలాంటి ఏజెన్సీ మండలంలో పేద దళిత గిరిజనులకు మెరుగైన ఆరోగ్య సేవలు అందక వారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కావున జూలూరుపాడు మండల ఆరోగ్య కేంద్రాన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్గా చేయాలని వారు కోరారు వాటితో పాటుగా డయాలసిస్ సెంటర్ను కూడా ఏర్పాటు చేయాలని కోరటం…

Read More