- 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ
- కామారెడ్డి న్యూస్ పేపర్ ఎడిటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు
- సెలవులు రద్దు చేస్తూ ప్రకటన -ఆరోగ్య శాఖ మంత్రీ
- రాఖీ కట్టి తిరిగి వస్తూ మహిళ మృతి
- పంతులు తండాలో ఘనంగా తీజ్ ఉత్సవాలు..!
- చింతకుంట గురుకులంలో ఇంటర్ స్పాట్ అడ్మిషన్లు
- గ్రామ శాఖ అధ్యక్షులుగా కల్లేపల్లి రమేష్ ఏకగ్రీవం ఉపాధ్యక్షులుగా మెరుగు బద్రి
- కరీంనగర్-జగిత్యాల రోడ్ విస్తరణకు మళ్లీ ఊపిరి: కేంద్రానికి బండి సంజయ్ వినతి
Author: indurvaartha (ఇందూర్ వార్త)
79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణఆర్మూర్, నమస్తే ఇందూర్ ఆగస్టు 15, ఈరోజు 79 వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఆర్మూర్లోనూ మున్సిపల్ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ నిర్వహించిన మున్సిపల్ కమిషనర్ రాజు మరియు కౌన్సిలర్ ఖందేశ్ సంగీత మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, పండిత్ పవన్ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అలాగే బి ఆర్ ఎస్ ఇంచార్జి రాజేశ్వర్ రెడ్డి, బి ఆర్ ఎస్ ఆర్మూర్ పట్టణం ఇన్చార్జి పూజ నరేందర్ తదితరులు బి ఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఆర్మూర్ ఎస్ ఎస్ కె సమాజ్ అధ్యక్షుడు రెడ్డి ప్రకాష్, ఉపాధ్యక్షుడు గంగా మోహన్ మరియు ఎస్ ఎస్ కే సమాజ్ సభ్యులు పాల్గొన్నారు.ఎస్ ఎస్ కె యూత్ సభ్యులు గుండం పైన స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు.
ఇందూర్ వార్త , డెస్క్ 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని న్యూస్ పేపర్ ఎడిటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం యూనియన్ కార్యాలయం వద్ద మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి కొబ్బరికాయ కొట్టి, జాతీయ త్రివర్ణ పథకాన్ని అధ్యక్షుడు బొక్కల వేణు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ లాండే భాస్కర్, మహమ్మద్ , సెక్రెటరీ చెట్టబోయిన స్వామి, జెయింట్ సెక్రటరీ కుక్కల రాజు, పుట్ట రమేష్ కామారెడ్డి జిల్లాలోని పలువురు కంట్రిబ్యూటర్ లు పాల్గొన్నారు
సెలవులు రద్దు చేస్తూ ప్రకటన నమస్తే ఇందూర్ వార్త/ సంగారెడ్డి జిల్లా/ ఆగస్టు 14.తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో వైద్య సిబ్బందికి 3 రోజులపాటు ప్రభుత్వం సెలవులు రద్దు చేసింది. రానున్న మూడ్రోజుల పాటు ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. సూపరింటెండెంట్లు, RMOలు, వైద్యాధికారులు, వైద్యులు, సిబ్బంది కచ్చితంగా ఆస్పత్రిలోనే ఉండాలని స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో వచ్చే రోగులకు, గర్భిణులకు తక్షణమే వైద్య సేవలు అందించాలన్నారు.
రాఖీ కట్టి తిరిగి వస్తూ మహిళ మృత ఇందూరు వార్త ములుగు జిల్లా తాడ్వాయి ఈరోజు ఉదయం 11:30 గంటల సమయంలో,తాడ్వాయి మండలం కోడిశెల గ్రామానికి చెందిన మొగిలిపల్లి కృష్ణ- పద్మ దంపతులు అంకంపల్లి లో తమ బంధువులకు రాఖీ కట్టి వస్తున్నారు. నాంపల్లి నీళ్ల ఒరే సమీపంలో బైక్ అదుపుతప్పి కింద పడింది. ఈ ఘటనలో పద్మ అక్కడికక్కడే మృతి చెందగా, కృష్ణకు స్వల్ప గాయాలయ్యాయి. తాడ్వాయి.ఎస్ ఐ. శ్రీకాంత్ రెడ్డి పంచనామ నిర్వహించి పోస్టుమార్టంకు ఏటూరు నాగారం ఆసుపత్రికి తరలించారు.
పంతులు తండాలో ఘనంగా తీజ్ ఉత్సవాలు..! ఆడి పాడిన గిరిజన మహిళలు ఇందూర్ వార్త సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం 7 అక్కన్నపేట మండల పరిధిలోని పంతులు తండా తరాచంద్ తండాలలో ఘనంగా గిరిజనుల వేడుక అయినటువంటి తీర్పణలను నిర్వహించారు ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని గిరిజనులు తెలిపారు తొమ్మిది రోజులు గిరిజన యువతులు ఆడి పాడి గోధుమ నారును, అత్యంత ఆరాధ దైవంగా భావించే మేరా మా యాడి ఆశీస్సులతో ఈ తీజ్ ఉత్సవాలను గురువారంతో ముగింపు చేశారు గిరిజన కుల బాంధవులు పెద్దలు బంధువులు అందరూ ఈ తీజ్ ఉత్సవాల్లో పాల్గొని ఆడి పాడి అనంతరం దగ్గరలో ఉన్నటువంటి చెరువులో వాటిని నిమజ్జనం చేశారు ఈ కార్యక్రమంలో సేవాలాల్ యూత్. ఆధ్వర్యంలో. ఎత్తున పాల్గొన్నారు
చింతకుంట గురుకులంలో ఇంటర్ స్పాట్ అడ్మిషన్లు జూలై 31 వరకు అవకాశం! మొత్తం 63 సీట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి చింతకుంట, కరీంనగర్, జూలై 30: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఇంటర్ కళాశాల, చింతకుంటలో 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మి తెలిపారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం సీఈసీ, వొకేషనల్ (ఏటి, ఐఎం) కోర్సుల్లో ప్రస్తుతం మొత్తం 63 సీట్లు మాత్రమే మిగిలి ఉన్నాయని పేర్కొన్నారు. వీటి కోసం జూలై 31, గురువారం ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు స్పాట్ అడ్మిషన్ దరఖాస్తులను స్వీకరిస్తామని తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె సూచించారు.
కరీంనగర్-జగిత్యాల రోడ్ విస్తరణకు మళ్లీ ఊపిరి: కేంద్రానికి బండి సంజయ్ వినతి ▪︎ గడ్కరీతో సమావేశమైన బండి సంజయ్ ▪︎ ₹113 కోట్ల సీఆర్ఐఎఫ్ ప్రతిపాదనలు సమర్పణ ▪︎ నివేదిక అనంతరం పనులు ప్రారంభమవుతాయని హామీ జూలై 28 ఇందూర్ వార్త ప్రతినిధి కరీంనగర్-జగిత్యాల రహదారి విస్తరణ పనులు తక్షణం ప్రారంభించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఈ రోజు కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో న్యూఢిల్లీలో సమావేశమయ్యారు.ఈ రహదారి 4 లేన్‌గా విస్తరించేందుకు ఇప్పటికే ₹2151 కోట్ల ప్రతిపాదనలు సిద్ధమై, ఆమోదం పొందినప్పటికీ టెండర్ ప్రక్రియ ఆలస్యం అవుతున్నట్లు గడ్కరీ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన గడ్కరీ సంబంధిత అధికారులను పిలిపించి వివరాలు కోరారు. ప్రజల అభ్యంతరాలు, న్యాయపరమైన ఇబ్బందుల వల్లే పనులు నెమ్మదించాయని చెప్పారు. అయితే ప్రస్తుతం అవన్నీ పరిష్కారమయ్యాయని, కమిటీ నివేదిక వచ్చిన…
25 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థుల సమావేశం.. 2000 సంవత్సరం బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. 25 సంవత్సరాల తర్వాత సమావేశం.. ఇందూరు వార్త ప్రతినిధి బిబిపేట్ మండల కేంద్రంలోని తిమ్మయ్య గారి సుశీల నారాయణరెడ్డి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఈ రోజు 2000 సంవత్సరంలో 10 వ తరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా 25 సంవత్సరాల క్రితం విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సన్మానించుకోవడం జరిగింది.ఈ సన్మాన కార్యక్రమంలో కాశీనాథ్ శర్మ,మాధవరెడ్డి,గోవర్ధన్ రెడ్డి,విజయ్ కుమార్,సుతారి అంజయ్య,తుమ్మ రామచంద్రం, ఎదుల్ల ఇంద్రసేనారెడ్డి,కిష్టరెడ్డి, ఆనందరావు,విశ్వమోహన్,ఎల్లము,రమేష్ శర్మ లు పాల్గొనడం జరిగింది.ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడే ఉపాధ్యాయులకు ఎనలేని ఆనందం కలుగుతుందని,కష్టాలకు కృంగిపోకూడదని జీవిత లక్ష్యాన్ని చేరుకునేంతవరకు విశ్రమించకూడదని పూర్వ విద్యార్థులకు సూచించారు.సమాజ శ్రేయస్సుకు సాధ్యమైనంత వరకు తోడ్పాటును అందించాలని పిలుపునిచ్చారు.పూర్వ విద్యార్థులు వారు 25 సంవత్సరాల క్రితం…
తెలంగాణ గురుకుల పాఠశాల, బ్యాక్ లాగ్ సీట్ల భర్తీకి ప్రవేశ పరీక్ష ఇందూర్ వార్త ప్రతినిధి తంగళ్ళపల్లి మండలం నేరెళ్ళలోని తెలంగాణ గురుకుల పాఠశాలలో 6,7,8 తరగతులలో ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ సీట్ల భర్తీకి జూలై 30న పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ జి. రాధ గారు తెలిపారు. జూలై 29లోగా దరఖాస్తుతో పాటు, కులధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డ్ జిరాక్స్ 2 ఫొటోస్ సమర్పించాలన్నారు. విభాగాలవారీగా ఖాళీలు, మెరిట్ జాబితా ఆధారంగా భర్తీ చేస్తామన్నారు. నేరెళ్ళలోని తెలంగాణ గురుకుల పాఠశాల ఆవరణలో ప్రవేశపరీక్ష నిర్వహిస్తామన్నారు.
మేడ్చల్ నియోజకవర్గానికి మంత్రిగా ఎంతో చేశానన్న మల్లారెడ్డి తనకు కనీస గౌరవం కూడా దక్కడం లేదని ఆవేదన అధికారులు ప్రొటోకాల్ పాటించడం లేదని విమర్శ మేడ్చల్ నియోజకవర్గ అభివృద్ధికి తాను ఎంతో చేశానని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తెలిపారు. మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడిన తనకు కనీస గౌరవం కూడా దక్కడం లేదని అసహనం వ్యక్తం చేశారు. అధికారులు ప్రొటోకాల్ పాటించడం లేదని అన్నారు. తాను ఓడిపోతే బాగుండేదని… ఇంట్లో కూర్చునేవాడినని చెప్పారు. మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టరేట్ లో జరిగిన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశానికి ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, లక్షారెడ్డి, జిల్లా కలెక్టర్ తదితరులు హాజరయ్యారు. ఈటల రాజేందర్ మాట్లాడుతూ… బడి, గుడి అనే తేడా లేకుండా ఎక్కడపడితే అక్కడ మద్యం, గంజాయిని విక్రయిస్తున్నారని…